‘తల్లిని సుఖపెట్టడం’- అంటే అర్ధం చెప్పు పవన్!
పవన్ కల్యాణ్ ను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. మాతృత్వం పట్ల ఆయనకు మమకారం ఉంది. తల్లి ఎవరికైనా తల్లే! వైఎస్ జగన్‌ను తాను రాజకీయ శత్రువుగా పరిగణిస్తున్నప్పటికీ.. ఆయన తల్లి విజయమ్మ పట్ల మాత్రం.. పుత్రప్రేమనే కనబరుస్తున్నాడు. ఆ తల్లి ఎన్నికల ప్రచారంలో కష్టపడుతున్నదని పాపం పవన్ ఆవేదన చెందుతున్నాడు. అయితే తాను సెలబ్రిటీని అనే ఒక భ్రమలో.. నాలుగుగోడల మధ్య, మాత్రమే బతకడానికి అలవాటు పడిన పవన్‌కల్యాణ్‌లో సామాజిక అంశాల గురించిన అజ్ఞానం వలన ఆయన అలా మాట్లాడుతున్నారు అనుకోవాల్సి వస్తోంది. పవన్ పదేపదే విజయమ్మమీద జాలి కురిపించడం చూస్తోంటే.. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు.. నీకెందుకు బయ్యా అని కొందరు అనవచ్చు గానీ.. ఆయన ఒక్క సంగతి వివరణ చెప్పాలి.
ఇంతకూ అమ్మను సుఖపెట్టడం అంటే ఏమిటి? కనీసం ఈ ఒక్క ప్రశ్నకు పవన్ కల్యాణ్ వద్ద సరైన జవాబు ఉన్నదా? అమ్మను సుఖపెట్టడం అంటే.. ఆమెను ఇంట్లోంచి బయటకు కదలనివ్వకుండా ఒక మూల కూర్చోబెట్టి.. ముప్పొద్దుల్లా తిన్నంత తిండిపెట్టి, ఆరోగ్యావసరాలకు డాక్టరు వద్దకు తీసుకెళుతూ.. ఇతరత్రా సేవలు చేయడం మాత్రమేనా? మామూలు గృహిణులుగానే బతికి అలాగే రిటైరైన పవన్ అమ్మలాంటి వారి విషయంలో ఆయన సిద్ధాంతం నిజమే కావొచ్చు. కానీ ఈ రాష్ట్రానికి తిరుగులేని జనరంజక పాలన అందించిన ఒక ముఖ్యమంత్రి కి భార్య, రాజకీయ చైతన్యం ఉన్న కుటుంబానికి ఆమె పెద్దదిక్కు.. అలాంటి రాజకీయ చైతన్యం ఉన్న మహిళను వంటింటికి, లేదా ఇంట్లోని విశ్రాంతి గదికి పరిమితం చేయడం అనేది.. ఆమెలో ఉన్న శక్తులను బలవంతంగా అణిచేసినట్లు అనిపించుకోదా? స్త్రీజాతికి పవన్ కల్యాణ్ ఇచ్చే విలువ ఇదేనా? ఒకే స్త్రీ.. భార్య స్థానంలో ఉంటే ఎన్నికల్లో పోటీచేయడానికి తిరగడానికి అర్హురాలు, తల్లి స్థానంలో ఉంటే అనర్హురాలు అవుతుందా? తల్లి స్థానానికి వచ్చిన తర్వాత.. విశ్రాంతి తప్ప రాజకీయ చైతన్యం అధికారం అనేవి ఆమెకు ఎప్పటికీ దక్కకుండా చేయడం కొడుకు బాధ్యత అనుకోవాలా?
బహుశా పవన్ కల్యాణ్ లాంటి అవకాశవాద కొడుకు ఉంటే మాత్రం.. అలాగే చేసేవాడేమో? అమ్మ ద్వారా తనుకు రాజకీయ చైతన్యం సంక్రమించినా.. సరే, తన పబ్బం గడవగానే.. అమ్మను వంటింటికి పరిమితి చేసేవాడేమో. కానీ జగన్ అలాకాదు.. తన తల్లి విలువను, సమాజానికి సేవ చేయడంలో ఆమె చిత్తశుద్ధిని ప్రజలకు ఆమె అవసరాన్ని తెలిసిన వాడు. అందుకే ఎమ్మెల్యేగా ఉన్న తల్లిని.. ఎంపీగా ఢిల్లీ చట్టసభకు పంపే పనిలో ఉన్నాడు. ఈ సత్యాన్ని అజ్ఞానాంధకారం కళ్లలో నిండిన పవన్ గుర్తించలేకపోవచ్చు... కానీ ప్రజలందరికీ ఈ విషయం తెలుసని పవన్ గ్రహించాలి.
పవన్ కల్యాణ్ ను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. మాతృత్వం పట్ల ఆయనకు మమకారం ఉంది. తల్లి ఎవరికైనా తల్లే! వైఎస్ జగన్‌ను తాను రాజకీయ శత్రువుగా పరిగణిస్తున్నప్పటికీ.. ఆయన తల్లి విజయమ్మ పట్ల మాత్రం.. పుత్రప్రేమనే కనబరుస్తున్నాడు. ఆ తల్లి ఎన్నికల ప్రచారంలో కష్టపడుతున్నదని పాపం పవన్ ఆవేదన చెందుతున్నాడు. అయితే తాను సెలబ్రిటీని అనే ఒక భ్రమలో.. నాలుగుగోడల మధ్య, మాత్రమే బతకడానికి అలవాటు పడిన పవన్‌కల్యాణ్‌లో సామాజిక అంశాల గురించిన అజ్ఞానం వలన ఆయన అలా మాట్లాడుతున్నారు అనుకోవాల్సి వస్తోంది. పవన్ పదేపదే విజయమ్మమీద జాలి కురిపించడం చూస్తోంటే.. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు.. నీకెందుకు బయ్యా అని కొందరు అనవచ్చు గానీ.. ఆయన ఒక్క సంగతి వివరణ చెప్పాలి. ఇంతకూ అమ్మను సుఖపెట్టడం అంటే ఏమిటి? కనీసం ఈ ఒక్క ప్రశ్నకు పవన్ కల్యాణ్ వద్ద సరైన జవాబు ఉన్నదా? అమ్మను సుఖపెట్టడం అంటే.. ఆమెను ఇంట్లోంచి బయటకు కదలనివ్వకుండా ఒక మూల కూర్చోబెట్టి.. ముప్పొద్దుల్లా తిన్నంత తిండిపెట్టి, ఆరోగ్యావసరాలకు డాక్టరు వద్దకు తీసుకెళుతూ.. ఇతరత్రా సేవలు చేయడం మాత్రమేనా? మామూలు గృహిణులుగానే బతికి అలాగే రిటైరైన పవన్ అమ్మలాంటి వారి విషయంలో ఆయన సిద్ధాంతం నిజమే కావొచ్చు. కానీ ఈ రాష్ట్రానికి తిరుగులేని జనరంజక పాలన అందించిన ఒక ముఖ్యమంత్రి కి భార్య, రాజకీయ చైతన్యం ఉన్న కుటుంబానికి ఆమె పెద్దదిక్కు.. అలాంటి రాజకీయ చైతన్యం ఉన్న మహిళను వంటింటికి, లేదా ఇంట్లోని విశ్రాంతి గదికి పరిమితం చేయడం అనేది.. ఆమెలో ఉన్న శక్తులను బలవంతంగా అణిచేసినట్లు అనిపించుకోదా? స్త్రీజాతికి పవన్ కల్యాణ్ ఇచ్చే విలువ ఇదేనా? ఒకే స్త్రీ.. భార్య స్థానంలో ఉంటే ఎన్నికల్లో పోటీచేయడానికి తిరగడానికి అర్హురాలు, తల్లి స్థానంలో ఉంటే అనర్హురాలు అవుతుందా? తల్లి స్థానానికి వచ్చిన తర్వాత.. విశ్రాంతి తప్ప రాజకీయ చైతన్యం అధికారం అనేవి ఆమెకు ఎప్పటికీ దక్కకుండా చేయడం కొడుకు బాధ్యత అనుకోవాలా?
బహుశా పవన్ కల్యాణ్ లాంటి అవకాశవాద కొడుకు ఉంటే మాత్రం.. అలాగే చేసేవాడేమో? అమ్మ ద్వారా తనుకు రాజకీయ చైతన్యం సంక్రమించినా.. సరే, తన పబ్బం గడవగానే.. అమ్మను వంటింటికి పరిమితి చేసేవాడేమో. కానీ జగన్ అలాకాదు.. తన తల్లి విలువను, సమాజానికి సేవ చేయడంలో ఆమె చిత్తశుద్ధిని ప్రజలకు ఆమె అవసరాన్ని తెలిసిన వాడు. అందుకే ఎమ్మెల్యేగా ఉన్న తల్లిని.. ఎంపీగా ఢిల్లీ చట్టసభకు పంపే పనిలో ఉన్నాడు. ఈ సత్యాన్ని అజ్ఞానాంధకారం కళ్లలో నిండిన పవన్ గుర్తించలేకపోవచ్చు... కానీ ప్రజలందరికీ ఈ విషయం తెలుసని పవన్ గ్రహించాలి.
