3, మే 2014, శనివారం

‘తల్లిని సుఖపెట్టడం’- అంటే అర్ధం  చెప్పు పవన్‌!
పవన్‌ కల్యాణ్‌ ను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. మాతృత్వం పట్ల ఆయనకు మమకారం ఉంది. తల్లి ఎవరికైనా తల్లే! వైఎస్‌ జగన్‌ను తాను రాజకీయ శత్రువుగా పరిగణిస్తున్నప్పటికీ.. ఆయన తల్లి విజయమ్మ పట్ల మాత్రం.. పుత్రప్రేమనే కనబరుస్తున్నాడు. ఆ తల్లి ఎన్నికల ప్రచారంలో కష్టపడుతున్నదని పాపం పవన్‌ ఆవేదన చెందుతున్నాడు.  అయితే తాను సెలబ్రిటీని అనే ఒక భ్రమలో.. నాలుగుగోడల మధ్య, మాత్రమే బతకడానికి అలవాటు పడిన పవన్‌కల్యాణ్‌లో సామాజిక అంశాల గురించిన అజ్ఞానం వలన ఆయన అలా మాట్లాడుతున్నారు అనుకోవాల్సి వస్తోంది. పవన్‌ పదేపదే విజయమ్మమీద జాలి కురిపించడం చూస్తోంటే.. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు.. నీకెందుకు బయ్యా అని కొందరు అనవచ్చు గానీ.. ఆయన ఒక్క సంగతి వివరణ చెప్పాలి.  
ఇంతకూ అమ్మను సుఖపెట్టడం అంటే ఏమిటి? కనీసం ఈ ఒక్క ప్రశ్నకు పవన్‌ కల్యాణ్‌ వద్ద సరైన జవాబు ఉన్నదా? అమ్మను సుఖపెట్టడం అంటే.. ఆమెను ఇంట్లోంచి బయటకు కదలనివ్వకుండా ఒక మూల కూర్చోబెట్టి.. ముప్పొద్దుల్లా తిన్నంత తిండిపెట్టి, ఆరోగ్యావసరాలకు డాక్టరు వద్దకు తీసుకెళుతూ.. ఇతరత్రా సేవలు చేయడం మాత్రమేనా? మామూలు గృహిణులుగానే బతికి అలాగే రిటైరైన పవన్‌ అమ్మలాంటి వారి విషయంలో ఆయన సిద్ధాంతం నిజమే కావొచ్చు. కానీ ఈ రాష్ట్రానికి తిరుగులేని జనరంజక పాలన అందించిన ఒక ముఖ్యమంత్రి కి భార్య, రాజకీయ చైతన్యం ఉన్న కుటుంబానికి ఆమె పెద్దదిక్కు.. అలాంటి రాజకీయ చైతన్యం ఉన్న మహిళను వంటింటికి, లేదా ఇంట్లోని విశ్రాంతి గదికి పరిమితం చేయడం అనేది.. ఆమెలో ఉన్న శక్తులను బలవంతంగా అణిచేసినట్లు అనిపించుకోదా? స్త్రీజాతికి పవన్‌ కల్యాణ్‌ ఇచ్చే విలువ ఇదేనా? ఒకే స్త్రీ.. భార్య స్థానంలో ఉంటే ఎన్నికల్లో పోటీచేయడానికి తిరగడానికి అర్హురాలు, తల్లి స్థానంలో ఉంటే అనర్హురాలు అవుతుందా? తల్లి స్థానానికి వచ్చిన తర్వాత.. విశ్రాంతి తప్ప రాజకీయ చైతన్యం అధికారం అనేవి ఆమెకు ఎప్పటికీ దక్కకుండా చేయడం కొడుకు బాధ్యత అనుకోవాలా? 

బహుశా పవన్‌ కల్యాణ్‌ లాంటి అవకాశవాద కొడుకు ఉంటే మాత్రం.. అలాగే చేసేవాడేమో? అమ్మ ద్వారా తనుకు రాజకీయ చైతన్యం సంక్రమించినా.. సరే, తన పబ్బం గడవగానే.. అమ్మను వంటింటికి పరిమితి చేసేవాడేమో. కానీ జగన్‌ అలాకాదు.. తన తల్లి విలువను, సమాజానికి సేవ చేయడంలో ఆమె చిత్తశుద్ధిని ప్రజలకు ఆమె అవసరాన్ని తెలిసిన వాడు. అందుకే ఎమ్మెల్యేగా ఉన్న తల్లిని.. ఎంపీగా ఢిల్లీ చట్టసభకు పంపే పనిలో ఉన్నాడు. ఈ సత్యాన్ని అజ్ఞానాంధకారం కళ్లలో నిండిన పవన్‌ గుర్తించలేకపోవచ్చు... కానీ ప్రజలందరికీ ఈ విషయం తెలుసని పవన్‌ గ్రహించాలి. 
అంటే ఏంటి పవన్‌బాబూ!
‘రాజధానిని నిర్మించడానికి అనుభవం కావాలి.. అందుకనే నేను చంద్రబాబునాయుడుకు మద్దతు ఇచ్చా...’ అంటూ పవన్‌ కల్యాణ్‌ పదేపదే అంటున్నారు. మొత్తం సీమాంధ్ర సభల్లో ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేయడానికి.. టోకుగా చుట్టబెట్టేస్తున్న పవన్‌కల్యాణ్‌.. ప్రతి చోటా చంద్రబాబును మించిన ఉక్రోషంతో వైఎస్‌ జగన్‌ను తూర్పారపట్టేస్తున్నారు పవన్‌ కల్యాణ్‌!  సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించడానికి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలని.. అందుకే తాను చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నానని పవన్‌ కల్యాణ్‌ పదేపదే ప్రకటిస్తున్నారు. అనుభవం.. అనుభవం.. అంటున్నారు. అక్కడికేదో.. ముఖ్యమంత్రి పదవిలో ఎక్కువ కాలం ఉండడమే ప్రాతిపదిక అన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజధానిని నిర్మాణానికి అనుభవం ఉండాలంటే.. అదేమీ ఇటుకలతో గోడ కట్టడం కాదు కదా.. అనుభవం ఉన్న మేస్త్రీనా? లేని మేస్త్రీనా? అని బేరీజు వేసుకోవడానికి. అది కార్యనిర్వహణ సామర్థ్యానికి సంబంధించిన వ్యవహారం మాత్రమే. ఒక విషయంలో తన పరిణతిని ప్రూవ్‌ చేసుకున్న వారు మరో విషయంలోనూ అలా చేయగలరు! రాజధాని నిర్మాణం అంటే.. చంద్రబాబు తాపీ పట్టుకుని నిర్మించనక్కర్లేదని.. నిపుణులు- నిజాయితీ ఉన్న అధికారులు, అనుచరుల్ని నమ్మితే.. అద్భుతాలు సృష్టించవచ్చునని ఎవరైనా చెప్పగలరు! అయితే చంద్రబాబుకు అసలు మనుషుల్ని నమ్మే అలవాటే లేదు కదా! ఆయన అసలేం చేయగలరు అనేది అందరి అనుమానం.  దాన్ని పక్కన పెడితే.. అసలు అనుభవం అనేది ఒక్కటే పనిని సక్సెస్‌ఫుల్‌గా చేయడానికి గీటురాయి కానక్కర లేదని పవన్‌కల్యాణ్‌ సొంత అనుభవాలన్నీ చెబుతున్నాయి. బహుశా ఆయనకు రాజకీయాలకంటె సినిమా పరిభాషలో చెబితే బాగా అర్థం కావచ్చు.  ఆయన హీరో కెరీర్‌లో అద్భుతాలు సృష్టించిన చిత్రాలన్నీ అనుభవశూన్యులు ఇచ్చినవే. తొలిప్రేమ కరుణాకరన్‌, తమ్ముడు అరుణ్‌ప్రసాద్‌, బద్రి పూరీ జగన్నాధ్‌ వంటి అనుభవ శూన్యులే ఆయనను జీవితంలో హీరోగా నిలబెట్టారు. ఖుషి, గబ్బర్‌సింగ్‌, జల్సా వంటి హిట్‌లు ఇచ్చిన సమయానికి కూడా ఆయా దర్శకులకు ఒకటి రెండు సినిమాలకు మించిన అనుభవం లేదు.  అనుభవమే ముఖ్యం అని పవన్‌ నమ్మేట్లయితే.. కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కెఎస్‌ఆర్‌దాస్‌, కోడి రామకృష్ణ, బిగోపాల్‌ లాంటి వారితోనే తీసుకోలేకపోయారా? అనేది జనం సందేహం. కాబట్టి పవన్‌ కల్యాణ్‌ తన విషయంలో అయితే అనుభవం కంటె టేలెంటు ముఖ్యమని నమ్ముతారు. జనం ఎలా  చస్తే మనకేంటిలే అనే భావన ఉన్నవాడు గనుక.. టేలెంటు చిత్తశుద్ధితో నిమిత్తం లేకుండా చంద్రబాబుకు ఓటు వేయమని సలహా ఇస్తాడు.  అసలు పవన్‌ మరో సంగతి తెలుసుకోవాలి. అనుభవం ముదిరితే.. వార్ధక్యం వస్తుంది. అందుకే ఇప్పుడు కె.రాఘవేంద్రరావు లాంటి వాళ్లు జనం నాడి పట్టే సినిమాలు తీయలేకపోతున్నారు. కోదండరామిరెడ్డి, ముత్యాలసుబ్బయ్య లాంటి వాళ్లు మానుకున్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద నమ్మకం ఉంటే.. చంద్రబాబును కూడా రిటైర్‌ కమ్మని సలహా ఇస్తే మంచిది.  

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

హిందూపురం నుంచే బాలయ్య:  చంద్రబాబు పచ్చజెండా

హైదరాబాద్: నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ పోటీ చేసే సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన శాసనసభకే పోటీ చేయనున్నారు. అంతేకాకుండా అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఆయన పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు సమాచారం. 

బాలకృష్ణ ఈ నెల 16 లేదా 17 వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఇంతటితో బాలయ్య పోటీపై ఇప్పటివరకూ నెలకొన్న సందేహాలు దీంతో తొలగిపోయినట్లేనని భావిస్తున్నారు. హిందూపురం నుంచే పోటీ చేస్తానంటూ బాలకృష్ణ పట్టు బట్టడంతో చంద్రబాబు అంగీకరించక తప్పలేదని అంటున్నారు

హిందూపురం మొదటినుంచీ తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటవంటిది. పైగా, తన తండ్రి ఎన్టీ రామరావును ఆ సీటు ఆదరిస్తూ వస్తోంది. తండ్రిపై సెంటిమెంటు కారణంగా కూడా బాలకృష్ణ ఆ సీటుపై పట్టుబట్టినట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చునని కొన్నాళ్లుగా బాలయ్య అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పెనమలూరు లేదా శ్రీకాకుళం నుంచి బాలకృష్ణ పోటీ చేయవచ్చునని పార్టీ వర్గాలు కొన్నాళ్లుగా పేర్కొంటున్నాయి.
తమ నాయకుడు చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటానని బాలయ్య ఇటీవల చెబుతూ వచ్చారు. చివరికి బాలయ్య పోటీకి హిందూపురం సరైన నియోజకవర్గం అని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేసినప్పుడే బాలకృష్ణ కూడా హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయవచ్చునని తెలుస్తోంది.



సినిమా రివ్యూ: రేసుగుర్రం
లక్ష్మణ్ ఉరప్ లక్కీ, రామ్ ఇద్దరూ అన్నదమ్ములు. నీతి, నిజాయితీ ఉన్న బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ రామ్, ఎప్పుడూ జల్సాగా తిరిగే లక్కీలకు క్షణం కూడా పడదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో స్పందన (శృతి హాసన్)తో లక్కీ ప్రేమలో పడతాడు. అయితే ఓ కారణంగా లక్కీ, స్పందన ప్రేమ వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు రామ్ ప్లాన్ వేస్తాడు. శృతిని తనకు దక్కకుండా చేసిన రామ్ కు తగిన గుణపాఠం చెప్పాలని అతని పోలీస్ కారును దొంగిలిస్తాడు. లక్కీ దొంగిలించిన కారులో ఉన్నది రామ్ అనుకుని రాజకీయవేత్తగా మారిన రౌడీ మద్దాలి శివారెడ్డి వర్గం ఎటాక్ చేసి చంపాలనుకుంటాడు. ఆ దాడి నుంచి లక్కీ క్షేమంగా బయటపడుతాడు. ఆ దాడి నుంచి బయటపడిన శివారెడ్డి ఏం చేశాడు? శివారెడ్డికి రామ్ మధ్య శతృత్వానికి కారణమేంటి? లక్కీ, స్పందనల ప్రేమ వ్యవహారాన్ని రామ్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటాడు? రామ్, లక్కీల మధ్య ఉన్న మనస్పర్ధలు ఎలా తొలగిపోయాయి అనే సమస్యలకు ముంగిపే 'రేసుగుర్రం' చిత్ర కథ.

పెర్ఫార్మెన్స్:


అల్లు అర్జున్ లో ఎనర్జీ లక్కీ పాత్రకు సూట్ అయింది. యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, లవ్ సీన్స్ లో నటించడం అర్జున్ కు కొత్తేమీ కాదు. తనదైన శైలిలో లక్కీ పాత్రలో ఉండే వివిధ కోణాలకు అల్లు అర్జున్ న్యాయం చేకూర్చారు. స్పందనగా శృతి హాసన్ గత చిత్రాల్లో ఎన్నడూ లేనంతగా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. స్పందన పాత్రలో ఓ ఢిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. దాన్ని శృతి హాసన్ బాగా పండించింది. కిక్ శ్యామ్ ప్రేయసిగా సలోని గెస్ట్ గా కనిపించింది. ఈ చిత్రంలో తనకు లభించిన సీన్లలో తెలంగాణ యాసలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అంతగా గుర్తుండిపోయే పాత్రేమీ కాదు.

కిక్ శ్యామ్ పోలీస్ ఆఫీసర్ గా, అల్లు అర్జున్ అన్నగా పర్వాలేదనిపించాడు. కిక్ తర్వాత అలాంటి తరహా పాత్రనే రిపీట్ చేశాడా అనిపించింది. మెయిన్ విలన్ గా మద్దెల శివారెడ్డి పాత్రలో భోజ్ పూరి నటుడు రవికిషన్ నటించాడు. రౌడీగా మారిన రాజకీయవేత్తగా రవికిషన్ వీలైనంత మేరకు మంచి నటనే అందించాడు.

మరోసారి బ్రహ్మనందం కామెడీతో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఓ ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ కిల్ బిల్ పాండే గా క్లైమాక్స్ లో  హంగామా చేశాడు. ప్రీ క్లైమాక్స్ ఎంటరై.. క్లైమాక్స్ వరకు చిత్ర భారాన్ని తన భుజాలపై బ్రహ్మానందం ఎత్తుకున్నాడు. చిత్రమంతా రొటీన్ గా ఉందే అనుకునే సమయంలో మరోసారి తన ప్రతిభతో ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేశ్ తదితర కమెడియన్లు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

స్పందన తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కొన్ని సీన్లకు తనదైన స్టైల్లో ప్రకాశ్ రాజ్ న్యాయం చేశాడు. మిగతా పాత్రల్లో తనికెళ్ల భరణి, ముఖేశ్ రుషి నటించారు.

టెక్నికల్:
తమన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరు కీలక సన్నివేశాలకు మంచి సపోర్ట్ ఇచ్చింది. పాటల్లో అర్జున్ పై చిత్రీకరించిన సోలో సాంగ్... బూచోడే, 'సినిమా చూపిస్త మామా' పాటలు ఆడియో పరంగానే కాకుండా తెరపై కూడా ఆకట్టుకున్నాయి.
టెక్నికల్ అంశాలు చూస్తే మనోజ్ పరమహంస కెమెరా చాలా రిచ్ గా ఉంది. శృతి హాసన్, అల్లు అర్జున్ క్యాస్టూమ్ అదిరిపోయేలా ఉన్నాయి. కొత్త లుక్ తో డిజైన్ చేసిన క్యాస్టూమ్ శృతి, అల్లు అర్జున్ కు మరింత గ్లామర్ ను పెంచాయి. 

డైరెక్షన్:
టేకింగ్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి టాలీవుడ్ లో విలక్షణమైన శైలి అని గత చిత్రాలతో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విషయానికి వస్తే కథ కన్నా అల్లు అర్జున్ లోని స్టైలిష్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మనందం కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. కిక్ సినిమాలో ఆలీ క్యారెక్టర్ ను కొనసాగింపుగా ఈ చిత్రంలో ఇంట్రడ్యూస్ చేసినా సరైన స్పేస్ లేని కారణంగానో, ఇతర పరిమితుల కారణంగానో బెడిసి కొట్టింది. ముఖేశ్ రుషి, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ క్యారెక్టర్లను సరైన దృష్టి పెట్టకుండా వదిలేశాడనే ఓ చిన్న ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ కథ, కొత్తదనం లేని విలనిజంతో చేసిన సాహసం అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వకపోయినా.. క్లైమాక్స్ లో బ్రహ్మానందాన్ని తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు. బ్రహ్మనందం ఎపిసోడ్ నడిపించిన తీరు గ్రిప్పింగ్ గా ఉంది. ఈ చిత్రంలోని 'రేసుగుర్రం' అర్జున్ ఎనర్జీని బ్రహ్మానందానికి ఇచ్చేసి రొటీన్ కు భిన్నంగా కొత్త ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు. సెకంఢాఫ్ లో కథపై కొంత ఎక్సర్ సైజ్ చేసి ఉంటే మంచి ఫలితాలన్ని రాబట్టే అవకాశం ఉండేది. మార్కెట్ లో ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ పై దృష్టి సారిస్తున్నారనే ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మాస్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను జోడించి రేసుగుర్రాన్ని పరిగెత్తించిన సురేందర్ రెడ్డి... వినోదాన్ని ఆశించిన ప్రేక్షకుల్లో సంతృప్తి నింపి.. కొత్తదనం ఆశించిన వారిని కొంచెం నిరాశకు గురి చేశాడు.

ప్లస్ పాయింట్స్: 
అల్లు అర్జున్, 'కిక్' శ్యామ్, రవి కిషన్, బ్రహ్మానందం యాక్టింగ్
శృతి హాసన్ గ్లామర్
సాంగ్స్, కామెడీ
 
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
ఫైట్స్

9, ఏప్రిల్ 2014, బుధవారం

సీమాంధ్ర టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా
హైదరాబాద్: సీమాంధ్ర టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం విడుదల చేశారు. ఏడు లోక్ సభ, 47 శాసనసభ స్థానాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం కల్పించారు. చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా మళ్లీ టిక్కెట్లు లభించాయి. చంద్రబాబు మరోసారి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. మాజా మంత్రులిద్దరూ ఈసారి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.

 లోక్‌సభ అభ్యర్థులు

హిందూపురం-నిమ్మల కిష్టప్ప
మచిలీపట్నం-కొనకళ్ల నారాయణ
ఏలూరు-మాగంటి బాబు
నంద్యాల-ఎన్‌.ఎం.డి.ఫరూఖ్‌
విజయనగరం-అశోక్‌ గజపతిబాబు
చిత్తూరు-శివప్రసాద్‌

 అసెంబ్లీ అభ్యర్థులు

పుట్టపర్తి-పల్లె రఘునాథరెడ్డి
రాప్తాడు-పరిటాల సునిత
నగరి-గాలి
ఉరవకొండ-పయ్యావుల కేశవ్‌
కదిరి-కందికుంట ప్రసాద్‌
రాయదుర్గం-కాల్వ శ్రీనివాసులు
కళ్యాణదుర్గం-హనుమంతరాయ చౌదరి
పామర్రు-వర్ల రామయ్య
రాజాం-ప్రతిభాభారతి
శ్రీకాళహస్తి-బొజ్జల
కుప్పం-చంద్రబాబునాయుడు
మండపేట-జోగేశ్వరరావు
నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు
టెక్కలి-అచ్చెన్నాయుడు
విశాఖ పశ్చిమ-ధనబాబు
తుని-యనమల
ప్రత్తిపాడు-సత్యనారాయణమూర్తి
కాకినాడ రూరల్‌-అనంతలక్ష్మి
ఆముదాలవలస-కూన రవికుమార్‌
నెల్లిమర్ల-నారాయణస్వామినాయుడు
పెందుర్తి-బండారు సత్యనారాయణమూర్తి
పి.గన్నవరం-నారాయణమూర్తి
మైలవరం-దేవినేని ఉమ
జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య
అద్దంకి-కరణం అజయ్‌
బనగానపల్లె-జనార్దనరెడ్డి
ఆలూరు-వీరభద్రగౌడ్‌
పెనుకొండ-పార్థసారథి
ధర్మవరం-వరదాపురం సూరి
ఎచ్చెర్ల-కళా వెంకట్రావు
పాలకొండ-జయకృష్ణ
బిజెపి నేత టైగర్ ఆలె నరేంద్ర  ఇకలేకరు ... 

హైదరాబాద్: హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఆలె నరేంద్ర బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందారు. ఆయన వయస్సు 68. ఆలె నరేంద్రను టైగర్ నరేంద్ర అంటారు. ఆయన కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. టైగర్ నరేంద్ర 1946 ఆగస్టు 1వ తేదీన హైదరాబాదులో జన్మించారు. ఆయన మెదక్ జిల్లా నుండి లోకసభకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన మొదటి నుండి బిజెపిలో ఉన్నారు. అనంతరం తెలంగాణ కోసం తెలంగాణ సాధనా సమితి పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. అతను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో వచ్చిన విభేదాల వల్ల ఆయన పార్టీకి దూరమయ్యారు. తెరాస ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఇతర పార్టీలోకి వెళ్లారు. బిజెపి తెలంగాణ కోసం ఉద్యమించిన నేపథ్యంలో ఆయన తిరిగి రెండేళ్ల క్రితం బిజెపిలోకి వచ్చారు. 


ఆలె నరేంద్రకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య పేరు లలిత. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

8, ఏప్రిల్ 2014, మంగళవారం

కిరణ్ పార్టీ అభ్యర్థులు: 21 తెలంగాణ అసెంబ్లీ సీట్లకు వీరే
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ తెలంగాణలోనూ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలంగాణలో పోటీ చేసే తన అభ్యర్థుల తొలి జాబితాను మంగళవారం విడుదల చేసింది. 21 శాసనసభా స్థానాలకు, మూడు శాసనసభా స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 


తెలంగాణలో నామినేషన్లకు రేపు బుధవారంతో గడువు ముగుస్తుంది. జై సమైక్యాంధ్ర పార్టీ ఖమ్మం జిల్లాలో ఎక్కువ సీట్లకు పోటీ చేస్తోంది. నల్లగొండ జిల్లాలో ఒక్క స్థానానికి మాత్రమే పోటీ చేస్తుంది. మూడు లోకసభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోకసభ స్థానం నుంచి చెరుకూరు నాగార్జునరావు పోటీ చేయనున్నారు.

సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి శ్రీనివాస రావు, నల్లగొండ జిల్లాలోని భువనగిరి సీటు నుంచి జనార్దన్ రెడ్డి పోటీ చేస్తారు. సీమాంధ్రలో అభ్యర్థుల ప్రకటనకు ఇంకా గడువు ఉంది.

జెఎస్పీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా



ఆలేరు - నర్సింగోజు నర్సింహాచారి 
పినపాక - కనిపి కృష్ణ 
ఇల్లందు - ముక్తిరాజు 
ఖమ్మం - షేక్ బాషా 
పాలేరు - అప్పల లింగమూర్తి 
మథిర - మల్లు శివరాం
వైరా - వాసం రామకృష్ణం దొర
సత్తుపల్లి- సమ్మల రాజేష్ కుమార్ 
కొత్తగూడెం - నార్ల సత్యనారాయణ 
అశ్వారావుపేట - పాయం పోతయ్య దొర 
భద్రాచలం- కురుపం సుబ్బారావు 
నర్సాపూర్ - ఎండి వాజద్ అలీ 
పటాన్ చెరు - సుహాసినీ కొడాఠి 
మల్కాజిగిరి - పిట్ల శ్రీన్ రాజు 
ఎల్బీ నగర్ - గున్నం నరేందర్ రెడ్డి 
రాజేంద్ర నగర్ - సయ్యద్ ఉమర్ 
ముషీరాబాద్ - రాణి గడాఫీ 
ఖైరతాబాద్ - రాజు 
జూబ్లీహిల్స్ - సుదర్శనం వెంకటేశ్వర్లు 
సనత్‌నగర్ - చర్లపల్లి నీతాగౌడ్ 
చార్మినార్ - మహ్మద్ అయూబ్ ఖాన్
బాబుకి వేరే ఆప్షన్‌ లేవ్ ... 

భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోడానికి ముందు చాలా గొంతెమ్మ కోర్కెలను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఏనాడూ భారతీయ జనతా పార్టీకి ‘ప్రధాన పార్టీ’ అన్న ముద్ర లేదు. తెలంగాణలో తప్ప, సీమాంధ్రలో ఆ పార్టీకి ప్రాభవం లేదు. సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో బీజేపీ. అలాంటి బీజేపీ ఈసారి, డబుల్‌ డిజిట్‌ సాధించేస్తామన్న ధీమాతో వుంది. ఆ ధీమాతోనే, టీడీపీ ముందు గొంతెమ్మ కోర్కెలు వుంచింది. 

తెలంగాణ అంశం కారణంగా తెలంగాణలో తమకు కలిసి వస్తుందని భావించిన చంద్రబాబు, బీజేపీ గొంతెమ్మ కోర్కెలను తీర్చేందుకు ఒప్పుకోక తప్పలేదు. అయినప్పటికీ, సీమాంధ్రలో బీజేపీ కోరినన్ని సీట్లను చంద్రబాబు కేటాయించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఎన్ని చోట్ల పోటీ చేసినా, బీజేపీకి డబుల్‌ డిజిట్‌ వచ్చే అవకాశం లేదన్నది విశ్లేషకుల వాదన. అలాంటప్పుడు చంద్రబాబు, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు.? వారి కోరికలను ఎందుకు అంగీకరించినట్టు.?

 సమాధానం సింపుల్‌. 2004, 2009లాగానే ఈసారి కూడా తేడా కొడితే నెపాన్ని తేలిగ్గా బీజేపీపైకి నెట్టేయొచ్చని చంద్రబాబు భావిస్తున్నారట. అంతకు మించి చంద్రబాబు వద్ద వేరే ఆప్షన్‌ కూడా లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, సీమాంధ్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జోరు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో ఎంతో కొంత బావుకోవచ్చన్న ఆలోచన తప్ప, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి, ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల్లోకి వెళ్ళలేని దయనీయ స్థితి చంద్రబాబుది. 

బీజేపీ ఎన్ని చోట్ల పోటీ చేసినా, ఎన్ని సీట్లు దక్కించుకున్నా ఆ పార్టీకి ఎంతో కొంత లాభమే తప్ప నష్టముండదు. కానీ టీడీపీ పరిస్థితి అది కాదు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అంటూ స్వర్గీయ ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఈసారి ఎన్నికల్లో ఏమన్నా డింకీ కొడితే.. ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. అప్పుడిక బీజేపీ వల్లనే ఓడిపోయాం అని చంద్రబాబు చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమీ వుండదు. 

చిరు ప్రచారంపై మెగా అనుమానాలు

చిరు ప్రచారంపై మెగా అనుమానాలు
  • ‘అన్నయ్య’తో ప్రచారానికి జంకుతున్న అభ్యర్థులు
  •   నాడు ఎలాంటి ఫలితమివ్వని ‘గౌరిబిదనూరు’ రోడ్ షో
  •  విభజన నేపథ్యంలో నేడు చిరుపై మరింత వ్యతిరేకత
  •  ప్రచారం చేస్తే ఉన్న ఓట్లనూ కోల్పోయే పరిస్థితి
  •  గతంలో కాంగ్రెస్ కరపత్రాలపై చిరంజీవి బొమ్మలు
  •  నేడు ఆయన ఫొటో లేకుండా జాగ్రత్తలు
 బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కేంద్ర మంత్రి చిరంజీవి ప్రచారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక నేతలు కొందరు చిరంజీవి ప్రచారానికి వస్తారంటూ ప్రకటనలు చేస్తున్నా, కాంగ్రెస్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడడం లేదు. ఈ నెల 17న ఒకే దశలో రాష్ట్రంలో పోలింగ్ జరుగనుంది. కనుక ప్రచారానికి పట్టుమని పది రోజులు కూడా లేవు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ర్టంలో ఐదారు బహిరంగ సభల్లో ప్రసంగించి వెళ్లారు. బుధవారం సోనియా గాంధీ వస్తున్నారు.

తెలుగు మాట్లాడే వారు అధిక సంఖ్యలో ఉన్న కోలారు, చిక్కబళ్లాపురంలతో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లాలో చిరంజీవి చేత ప్రచారం చేయించడానికి గతంలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడే వారు. ముఖ్యంగా కోలారు జిల్లాలో ఉప ఎన్నికలప్పుడు కూడా కేంద్ర మంత్రి కేహెచ్. మునియప్ప మరీ దగ్గరుండి చిరంజీవిని పిలుచుకు వచ్చారు. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన పరిణామాలు కర్ణాటకలో ప్రభావం చూపుతున్నాయి.

పట్టుబట్టి మరీ... రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్‌పై ప్రవాసాంధ్రుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగస్వామి అయిన చిరంజీవి అంటేనే... సరిహద్దు జిల్లాల్లో తెలుగు మాట్లాడే వారు మండి పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయనను ప్రచారానికి తీసుకు వస్తే కలిగే లాభం కన్నా నష్టమే అధికమని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు మాట్లాడే వారు ఉన్న ప్రాంతాల్లో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులు గతంలో కర పత్రాలపై చిరంజీవి బొమ్మలు వేసుకునే వారు.

ఈసారి అలాంటి బొమ్మలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల సందర్భంగా చిరంజీవి ప్రచారం చేసిన నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు ఆశించినంత ఫలితాలు రాలేదని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సినీ నటుడుగా ఆయనను చూడడానికి జనం ఎగబడడం వాస్తవమే అయినా, అవన్నీ ఓట్ల రూపంలో పరివర్తన చెందడం లేదని వారు విశ్లేషిస్తున్నారు.

మరో వైపు అనంతపురం జిల్లాను ఆనుకుని ఉన్న గౌరిబిదనూరు నియోజక వర్గంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు చిరంజీవి... కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ శివశంకర రెడ్డి తరఫున ప్రచారం చేశారు.

అయితే చిరంజీవి అభిమానులంతా ఆయనకు వ్యతిరేకంగా ఓ ఇండిపెండెంట్‌కు మద్దతు పలికారు. ఈ పరిణామాల నడుమ ఈసారి చిరంజీవి ప్రచారం అనుమానమేనని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇక మోడీ తరఫున చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని వినిపించినా, ఇప్పటి వరకు అలాంటి సంకేతాలేవీ అందలేదు.

టీడీపీలో మొదలైన టికెట్ల లొల్లి

* పొత్తుకు వ్యతిరేకంగా నేతల తిరుగుబాటు
* కొత్త వారికి సీటిస్తే ఒప్పుకోం
* ఖైరతాబాద్, ఉప్పల్ సీట్ల కోసంబాబు ఇంటి వద్ద ఆందోళన
* మల్కాజ్‌గిరి లోక్‌సభకు నేడు రేవంత్ నామినేషన్


హైదరాబాద్: బీజేపీతో పొత్తు తెలుగుదేశాన్ని నట్టేట ముంచుతోంది. పొత్తు వల్ల సీట్లు కోల్పోయిన నేతలు, మైనారిటీలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఎన్నికలకు ముందు డబ్బుతో వచ్చిన వారికి సీట్లు ఇచ్చే పద్ధతికి పుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ సీటును ఇటీవలే పార్టీలో చేరిన విద్యాసంస్థల అధినేత నల్ల మల్లారెడ్డికి ఇవ్వాలని యత్నిస్తున్న చంద్రబాబుపై కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడుతున్నారు. తనకు ఇవ్వకూడదనుకుంటే, పార్టీలో ఎవరికిచ్చినా సంతోషిస్తామని, కొత్తగా వచ్చిన వారికిస్తే ఒప్పుకునేది లేదని ఆయన చెపుతున్నారు. అందుకే మంగళవారం మల్కాజ్‌గిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ చేసి బాబుపై ఒత్తిడి తేవాలని ఆయన నిర్ణయించుకున్నారు.

కేవీఆర్, దేవేందర్‌గౌడ్‌లను వదిలించుకోవడానికేనా?
ఖైరతాబాద్ సీటును బీజేపీకి ఇవ్వవద్దని, కె.విజయ రామారావుకు ఇవ్వాలని, ఉప్పల్‌సీటును దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌కు ఇవ్వాలని వారిద్దరి అనుయాయులు సోమవారం బాబు నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దేవేందర్, కేవీఆర్‌లపై కోపంతోనే చంద్రబాబు ఖైరతాబాద్,ఉప్పల్ సీట్లను బీజేపీకి ఇచ్చారని అంటున్నారు. సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసిన కేవీఆర్ అనుభవాన్ని,పరిచయాలను ఉపయోగించుకొని తనపై కేసులు లేకుండా చూసుకొని ఇప్పుడు దూరం పెడుతున్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

మాజీ హోంమంత్రి టి. దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ మూడేళ్లుగా ఉప్పల్ సీటును ఆశిస్తుంటే బీజేపీకి వదిలేయడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు షాబాజ్ అహ్మద్‌ఖాన్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. పాతబస్తీ నుంచి టికెట్ ఆశించిన మరో నేత పార్టీ మారి టీఆర్‌ఎస్ నుంచి నామినేషన్ వేయబోతున్నారు. ముషీరాబాద్‌కు చెందిన ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బుధవారం ఆయన రెబల్‌గా నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

మీరు మరణించబోతున్నరని తెలిపే లక్షణాలు 
పుట్టేదెప్పుడో ముందే తెలుస్తుంది కాని చావును గురించి ముందుగా తెలియడం అరుదు. అందువల్ల విధిగా వచ్చేదైనప్పటికీ చావు అందరికీ ఒక మిస్టరీగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. దాన్ని గురించి ఎంతో జిజ్ఞాసా, భయాలూ, సందేహాలూ కలుగుతూంటాయి. శరీరం అశాశ్వతమనీ, జీవితం బుద్బుదప్రాయమనీ అనేక వైరాగ్య భావనలు మనకు ఉండనే ఉన్నాయి. 


అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే అనే ఆలోచన జీవితం, సమాజంపట్ల మన వైఖరిని బలంగా శాసిస్తుందనడంలో సందేహం లేదు. చావు అనేది ఎప్పుడూ మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఇది మానవ జీవితంలో ఒక నిజమైన వాస్తవం. ఎప్పుడు జన్మిస్తారో, ఎప్పుడు మరణిస్తారో ఎవ్వరికీ తెలియదు. చావు అనివార్యమైనది. మరణం గురించి మనకు వింత విషయం ఏముంది. మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది. 

మరణం తర్వాత ప్రపంచం ఉందా లేదా మరణం తర్వాత మనం కేవలం అదృశ్యమవుతామా?ఇటువంటి ప్రశ్నలతో మనం ఎప్పుడూ భయపడుతుంటాం అందుకు మానవులు ఎల్లప్పుడూ మణం నివారించడానికి ఎన్నో మార్గాలకోసం చూస్తుంటారు. కానీ మరణం నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మీరు మరణించబోతున్నారన్న మీకు కూడా తెలియంత విధంగా నిశ్శద్దంగా వస్తుంది మరణం. అయితే మన ఇండియన్ గ్రంధాలలో ఒక వ్యక్తి వెంటనే లేదా త్వరలో చనిపోతాడని సూచించే కొన్ని లక్షణాలను నమోదు చేయడం జరిగింది. 

మరణించబోతున్నారన్న సంకేతాలను శివ పురాణంలో వివరించడం జరిగింది. శివ పురాణం ప్రకారం, ఒక సారి పార్వతీ దేవి మరణం యొక్క సంకేతాల గురించి లార్డ్ శివను కోరినట్లు తెలుపుతున్నాయి. ఒక అతను/ఆమె చనిపోబోతున్నారని ఎలా తెలుస్తుంది?తర్వాత మరణం గురించి ప్రతిదీ పార్వతీ దేవికి వివరించాడాని శివ పురాణంలో తెలుపుతున్నది. లార్డ్ శివ పార్వతి దేవికి వివరించిన వాటిలో 10 లక్షణాలను కొద్ది రోజుల్లో లేదా కొన్ని గంటల్లో చనిపోయే వ్యక్తిలో చూడవచ్చు అని మాట్లాడం జరిగింది. మరి మీరు కూడా మరణం యొక్క లక్షణాలను తెలుసుకోవాలనుందా? అయితే ఈ క్రింది స్లైడ్ ను పరిశీలించండి...

మరణానికి మొదటి లక్షణం: ఒక వ్యక్తి యొక్క చర్మం యొక్క రంగు లేత పసుపు లేదా తెలుపు రంగులోకి మారుతుంది మరియు కొద్దిగా ఎరుపు రంగులోకి కూడా మారుతుంది. ఇలాంటి లక్షణాలు కనబడితే ఆ వ్యక్తి మరో 6నెల్లల్లో చనిపోబోతున్నాడని సూచిస్తుంది.

మరణానికి రెండవ లక్షణం: ఒక వ్యక్తి అతను/ఆమె తన ప్రతిబింబంను నీటిలో లేదా అద్దంలో చూడటానికి కుదరు లేదా కనబడకపోవడం వంటి లక్షణాలు కలిగిన వ్యక్తి మరో 6 నెలల్లో మరణించబోతున్నారని అర్థం.

మరణానికి మూడవ లక్షణం:  ఒక వ్యక్తి ఏది చూసిన బ్లాక్ గా కనబడుట ప్రారంభమైనప్పుడు, ఆ వ్యక్తి త్వరలో చనిపోబోతున్నాడని సూచిస్తుంది.

ఒక వ్యక్తిలో ఎడమ చేయి ఒక వారం నుండి సంకోచిస్తున్నట్లు(సలుపుతున్నట్లు లేదా నరాలు లాగుతున్నట్లు) అనిపించడం. అది ఆ వ్యక్తి ఒక నెల రోజులు జీవించవచ్చు అని అర్థం.

మరణానికి ఐదవ లక్షణం:   ఒక వ్యక్తి అతను/ఆమె యొక్క సెన్స్ ఆర్గాన్స్ (జ్ఞానేంద్రియాలు)రాళ్ళులాగే కఠినంగా మారుతాయి. అంటే దాని అర్ధం ఆమె/అతను మరో 6నెలల్లో చనిపోబోతున్నారని అర్ధం.

మరణానికి ఆరవ లక్షణం:  ఒక వ్యక్తి చంద్రుడు, సూర్యుడు లేదా అగ్ని నుండి వెలువడే కాంతిని చూడలేనప్పుడు, ఆ వ్యక్తి వెంటనే చనిపోతారని సూచిస్తుంది.

మరణానికి ఏడవ లక్షణం:  ఒక వ్యక్తి యొక్క నాలుక అకస్మాత్తుగా ఉబ్బడం లేదా చిగుళ్ళ నుండి చీము స్రవించడం మొదలైన లక్షణాలు కనబడితే , ఆ వ్యక్తి ఎక్కువ రోజులు బ్రతకరని నమ్ముతారు.


మరణానికి ఎనిమిదవ లక్షణం: ఒక వ్యక్తి ఆకాశంలో ధ్రువ నక్షత్రంను చూడలేనప్పుడు, అది ఆ వ్యక్తి 6నెలల్లో మరణించబోతున్నారని అర్ధం.

మరణానికి తొమ్మిదో లక్షణం:  ఒక వ్యక్తి సూర్యుడుని, చంద్రుడిని మరియు ఆకాశాన్ని ఎరుపు రంగులో చూడగలిగినప్పుడు, అది ఆ వ్యక్తి త్వరలో చనిపోబోతున్నాడని సూచిస్తుంది.



మరణానికి పదో లక్షణం: ఒక వ్యక్తి తన కలలో గుడ్లగూబను చూసినట్లు లేదా ఖాళీగా మరియు నాశనం అయిన గ్రామాన్ని కలలో చూసినప్పుడు అతడు/ఆమె యొక్క మరణం సమీపంలో ఉన్నదని అర్ధం.

2, ఏప్రిల్ 2014, బుధవారం

 ఓ స్పై థ్రిల్లర్... మహేష్ బాబు చిత్రం...

హైదరాబాద్ : హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ బాబు స్పై థ్రిల్లర్ లో కనపించనున్నాడా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మణిరత్నం దర్శకత్వంలో మహేష్ ఓకే చేసిన సబ్జెక్టు ఓ స్పై థ్రిల్లర్ అని దేశభక్తి అండరకరెంట్ గా సాగుతుందని తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకూ ఇండియన్ తెరపై కనిపించని విజువల్స్ ని మణి ప్లాన్ చేస్తున్నాడంటున్నారు. నాగార్జున మరో కీలక పాత్రలో కనిపించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైంది. ఈ విషయమై సుహాసినీ మణిరత్నం మీడియాకు ఖరారు చేసి తెలిపింది.

 సుహాసిని మాట్లాడుతూ... " బోర్న్ ఐడింటిటీ చిత్రం తరహాలో మా చిత్రం ఓ స్పై థ్రిల్లర్. ఈ చిత్రాన్ని జూన్ లో ప్రారంభించనున్నాం. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్, శృతి హాసన్ మాత్రమే కాక హీరోయిన్ కి అవకాసం ఉంది. ఆ పాత్రను ఇరానీ లేదా పాకిస్ధానీ నటి అవకాసం ఉంది ," అని చెప్పుకొచ్చింది. 

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ సైతం కీలకమైన పాత్రను పోషించనుంది. ఈ మేరకు ఐశ్వర్యారాయ్ ని కలిసినట్లు,మణిరత్నం ఆఫీస్ వర్గాలు థృవీకరించినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక ఈ చిత్రంలో శృతిహాసన్ సెకండ్ హీరోయిన్ గా చేయనుంది. నాగార్జున,ఐశ్వర్యారాయ్ ఇప్పటికే సైన్ చేసారని తెలుస్తోంది. అయితే మహేష్,శృతి హాసన్ ఇంకా ఎగ్రిమెంట్ లోకి రాలేదు. మహేష్ బాబు కొన్ని సూచనలు చేసారని,ఆ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నట్లు వినికిడి. మద్రాస్ టాకీస్, వైజయింతీ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 

ఈ సినిమా ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. చర్చలు చేస్తున్నామని, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అన్నారు. నిజానికి, పొన్నియన్ సెల్వన్‌ను కథను తెరకెక్కించాలని మహేష్ బాబు, మణిరత్నం కలిసి అనుకున్నారు. కానీ ఎందువల్లనో అది ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. 
పవన్...కాస్తయినా నిజాలు మాట్లాడు

అటు మొన్నటి దాకా హీరో..మొన్నటికి మొన్న రాజకీయ తెరపై తళక్కుమన్నాడు..నిన్నటికి నిన్న జీరో అయిపోయాడు..ఈ రోజు..పూర్తిగా తాను కొందరి చేతిలో కీలు బొమ్మగా మారిపోయానని నిరూపించుకున్నాడు.. 

దటీజ్ పవన్ కళ్యాణ్ 
ప్రపంచ రాజకీయాలు అన్నీ ఔపాసన పట్టీసినట్లు మాట్లాడేస్తాడు..అన్నీ తనకే తెలుసనుకుంటాడు. నిజానికి వాదనకు దిగడు..నిలవడు. ప్రపంచంలో ఏ రాజకీయ, సౌద్దాంతిక వేత్త అయినా మీడియా దగ్గర మాత్రం కాస్తయినా ధైర్యంగా వుంటాడు. మీడియాను ఫేస్ చేయడానికి ఇబ్బంది పడడు. కానీ మిడిమిడి జ్ఞానం వున్న పవన్ లాంటి వాళ్లు తప్పితే. జనసేన పెట్టడానికి ముందు..పెట్టిన తరువాత..ఎన్నికలకు వెళ్లకుండా కాళ్లు తేలేసిన తరువాత కూడా మీడియా ముందుకు రాలేకపోయిన పవన్ ఒక్కసారిగా చంద్రబాబు అనుకూల మీడియాకు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చాడు. బహుశా ఇలా ఇంటర్వూ ఇవ్వడం కూడా ఇదే తొలిసారేమో కూడా. ఇందులో ఏమన్నాడు..మంచి చెడ్డలేమిటి అన్నది చూసే ముందు.. మీడియా మొహం చూడడం అంటే ఇష్టపడని పవన్ ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబు అనుకూల మీడియాకే ఎందుకు ఇంటర్వూ ఇవ్వాల్సి వచ్చింది?

దీనికి ఒక్క రోజు ముందు వెలువడిన నీల్సన్ తాజా సర్వే ఫలితాలు, తెలుగుదేశం పార్టీ అధినేతను దిగాలు పర్చబట్టి.  పవన్ రెండు సభల్లోనూ చంద్రబాబు అనుకూల, పవన్ వ్యతిరకే ధోరణి అంత స్పష్టంగా జనంలోకి వెళ్ల లేదు కాబట్టి. పవన్ అనే అస్త్రం ప్రయోగం పూర్తి కాకుండానే తుస్సుమన్నదని మీడియా కోడై కూసింది కాబట్టి. మరింక ఈ విషయాలు స్పష్టం చేయాలంటే రెండే మార్గాలు. ఒకటి మరో సమావేశం. అది ఇప్పట్లో ఏర్పాటు చెసే ఉద్దేశం పవన్ లో లేదు. రెండవది మీడియా సమావేశం. దాన్ని ఎదుర్కోనే ఉద్దేశం పవన్ కు ఏ మాత్రం వున్నట్లు లేదు. ఎందుకంటే, ప్రత్యేక ఇంటర్వూ, లేదా సభ అంటే తన మానాన తాను చెప్పుకుంటూపోవడమే. అదెందుకు? ఇదెలా అని అడిగే అవకాశం వుండదు. అంతా వన్ సైడ్ వ్యవహారం. కానీ మీడియా సమావేశం అంటే అలా కాదు. కాలికేస్తే, మెడకేస్తారు..మెడకేస్తే, కాలికేస్తారు. ఉదాహరణకు జగన్ కేసుల గురించి, గదినిండా ఫైళ్ల గురించి ప్రస్తావిస్తే, చంద్రబాబు కేసులు, వాటిని తప్పించుకునేందుకు వేసిన ఎత్తులు, న్యాయ విచారణను ఎదర్కొకుండా, తప్పించుకునేందుకు చట్టాన్ని అడ్డుపెట్టుకున్న వైనం నీకు తెలుసా అని ఎవరైనా అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? మన గ్యాస్ గుజరాత్ కు ఎలా తరలిపోయింది? అందుకోసం ఏర్పడిన కంపెనీకి చంద్రబాబు మనిషి ఎలా అధినేత కాగలిగారు..అదే కంపెనీతో అనుబంధం వున్న సంస్థ ఈనాడు సంస్థను మార్గదర్శి కష్టాల నుంచి ఎలా గట్టెక్కించింది..ఇవన్నీ నీకు తెలుసా..నీకు..తెలుసా..అని ఎవరైనా అడిగితే...తెల్ల మొకం వేయాలి. అందుకే..  అందుకే పవన్ ప్రత్యేక ఇంటర్వూను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. 

 వైఎస్ కారణమా? 
ఎన్నడైనా పవన్ షూటింగ్ ల్లో అతగాడి దగ్గరకు లోకల్ కుర్రాళ్లను అనుమతించేంత సీన్ వుందా? పవన్ అనే కాదు, మరే బడా హీరో అయినా, చుట్టూ ప్రయివేటు ఆర్మీ, బౌన్సర్లు. అలాంటిది పవన్ దగ్గరకు తెలంగాణ కుర్రాళ్లు వచ్చి, వైఎస్ మా బతుకుల్ని చిన్నా బిన్నం చేసేసారు అని చెబితే, అయ్యో అనుకున్నారా? మరి అదెలా అని వివరించరేం? భూమల ధరలు పెరిగితే, అమ్ముకున్న తెలంగాణ వాసులు బాగుపడ్డారా? కొనుక్కున్న వారు బాగు పడ్టారా? ఓ ప్రాంతం అభివృద్ది చెందితే కదా భూముల ధరలు పెరిగేది? ఇఫ్పుడు తెలంగాణలో ధరలు ఎందుకు దిగజారాయి? తెలంగాణ విషయంలో ఢిల్లీకి వైఎస్ఆర్ డెలిగేట్లను పంపించి వుండొచ్చు. కానీ సీమాంధ్ర వాసులను ఏ ఒక్కరినైనా పలకరించండి..వైఎస్ బతికి వుంటే, ఈ విభజన జరిగివుండేది కాదు అనే చెబుతారు. అది ఏ పార్టీవారైనా. ఈ సంగతి పవన్ కు తెలియదా? అసలు పవన్ కు పెద్ద మనుషుల ఒప్పందం నుంచి ఇప్పటి వరకు జరిగిన తెలంగాణ వ్యవహారాలపై ఏ మేరకు అవగాహన వుంది? తెలంగాణ ప్రజలు బాధ పడుతున్నది తమ అవకాశాలనే కాదు, తమ ప్రాంత రాజకీయ ప్రయోజనాలను కూడా స్వాహా చేసినందుకు,. అలా చేసింది ఎవరు? ఇవ్వాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణ కోటాలో కూడా రాజ్యసభకు పంపిందెవరిని?  అలా చేసింనందుకేగా తెలంగాణ ప్రాంత నాయకులు అలిగింది? ఇవ్వాళ ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి ప్రాంతాల్లో సీమాంధ్రులు తెలంగాణ రాజకీయ పదవులను అనుభవించడం వల్లనే కదా తెలంగాణ ప్రాంత వాసులు బాధపడుతున్నది. ఇది కాదనగలమా? ఇందుకు ఒక్క వైఎస్ఆర్ మాత్రమే కారణమా? ఈ వైనాలేమన్నా పవన్ కు తెలుసా?  

జగన్ తొందరపడ్డాడా? 
నిజమే తండ్రి పోయిన వెంటనే వారసత్వంగా పదవి కావాలనుకోవడం జగన్ తప్పిదమే. అంతకన్నా పెద్ద తప్పిదం వైఎస్ చేసాడు. తాను పదవిలో వుండగానే చంద్రబాబు అందరినీ పక్కన పెట్టి లోకేష్ ను అమాంతం పైకి తెచ్చిన మాదిరిగా జగన్ ను తేకపోవడం తప్పిదమే. అలా తెచ్చివుంటే పవన్ ఈ మాట అనకపోదును. పార్టీలో అందరు సీనియర్లు వుండగా, హరికృష్ణలాంటి అసలైన వారసులు వుండగా లోకేష్ ను తెచ్చిన వైనం, ఎందుకంత తొందర అని పవన్ కు అనిపించకపోవడం ఆశ్చర్యకరమే. అవును..ఇంతకీ సినిమా హీరోల సంగతేమిటి పవనూ..తమ తమ పిల్లలకు మీసాలు ఇంకా రాకముందే హీరోలను చేసేయడంలా? మాతో చెప్పింతురేమయ్యా? నీ హీరొ అవకాశం ఎలా వచ్చింది? అన్న చిరంజీవి లేకుంటే, అక్కినేని వారసురాలు నీ పక్కన హీరోయిన్ వేసేంత సీన్ వుండేదా? హీరోల వారుసులు ఎలా వున్నా, ఎన్ని చెక్కుళ్లు చెక్కించుకున్నా, అవకాశాలు ఎలా వస్తున్నాయి..వారసత్వం కాదా?  

సరే,. జగన్ పై అభియోగాలు వున్నాయి..నిజమే. అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయో, ఎలా ప్రారంభమయ్యాయో నీకు తెలియదా..నీ వెనుక వున్న సోకాల్డ్ బ్యూరో క్రాట్స్ ప్రముఖులకు తెలియదా? అంతవరకు లేని కేసులు, సోనియా, కాంగ్రెస్ ,తేదేపా కుమ్మక్కుతో ఒక్కసారి ఎలా ఉరికి వచ్చాయో తెలియదా? పోనీ జగన్, సరైన వాడు కాదు..ఓడించండి..అనడంలో తప్పు లేదు. కానీ అలా అని చంద్రబాబు పాలన గురించి ఏమి తెలుసని మద్దతు పలుకుతున్నావు. 

 రైతుల మీద దృష్టి పెట్టి వుంటే బాగుండేది..బషీర్ బాగ్ సంఘటన జరగకుండా వుంటే బాగుండేది..ఈ రెండు సంఘటనల కారణంగానే ప్రజలు బాబును పదేళ్లు అధికారానికి దూరంగా వుంచారు?  

సినిమా బాగుంటే జనం వద్దన్నా నెత్తిన పెట్టుకుంటారు. లేకుంటే తీన్ మార్..పంజా, కొమరం పులి అవుతాయి. పాలన బాగుంటే బాబు అయినా వైఎస్ అయినా నీలాంటి వాళ్ల సిఫార్సులేఖలు అక్కరలేదు. బాబు మంచి చేసి వుంటే ఎందుకు జనం వదిలేస్తారు. ఇప్పుడు కూడా ఉద్యోగస్థులు బాబు అధికారంలోకి వస్తాడంటే ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్రానికి రావడానికి బ్యూరోక్రాట్లు భయపడుతున్నారని చెప్పిన నీకు, ఇక్కడి ఉద్యోగులు బాబు పాలన అంటేనే భయపడుతున్నారని తెలుసా? 

 ప్రజాసేవ చేయడానికి అధికారమే అక్కరలేదు అనుకున్నపుడు. పవన్ పార్టీ ఎందుకు పెట్టాలి? స్వచ్ఛంధ సంస్థ చాలుగా? మరి రాజకీయ కుటుంబం కానీ మీకే రాజకీయాల మీద, ఎన్నికలు పోటీ, బలాబలాల అంచనాలు, భవిష్యత్ ప్రణాళికలు అన్న వాటిపై అంతంత మాత్రం అయిడియా వుంటే, రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన జగన్ కు వుండడంలో తప్పేమిటి? అది వారసత్వం అని మీరు అంటున్నారు. మరి లోకేష్ కోసం, చంద్రబాబు అతగాడి చుట్టూ వుంచిన యువ తెలుగుదేశం కుర్ర నాయకుల చరిత్ర ఒక్కసారి చూడు పవన్ ప్లీజ్..వారిలో ఒక్కరైనా వారసత్వం లేకుండా వున్నారా? కరణం వారసులు, కింజరాపు వారసుడు, పరిటాల వారసుడు, ఇలా లోకేష్ చుట్టూ వున్నది వారసులేగా? ఎందుకంటే ఈ వారసత్వం కావాలంటే, ఆ వారసత్వానికి ఊ అనాలి కాబట్టి. కానీ జగన్ వారసత్వం మాత్రం వద్దు. ఇదెక్కడి నీతి పవన్?  

ఓవర్ నైట్ డబ్బులెలా వస్తాయి? అవును అదీ నిజమే. రెండు ఎకరాల ఆసామీ, స్కాలర్ షిప్ లతో చదువుకున్న పెద్ద మనిషి చంద్రబాబు ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు .అదీ కేవలం పది నుంచి ఇరవై ఏళ్లలో. ఎలా..హౌ...పోనీ ఆ సంగతి వదిలేయ్..ఏమీ లేని బాబు తల్లి, భారీగా మనవడికి బహుమతి ఎలా ఇవ్వగలిగారని గిట్టని వైకాపా నేతలు అడుగుతున్నారు..సమాధానం వుందా? సరే అదీ వదిలేయ్. గట్టిగా మీసాలు రాని వయసులోనే రామ్ చరణ్ మీ అన్నకు లండన్ నుంచి భారీ కారు తెప్పించి గిఫ్ట్ ఇచ్చాడు? ఎలా వస్తున్నాయి. ఇన్ని కోట్లు అని ఈ దేశపు సగటు యువతరం తలలు బద్దలు కొట్టుకుంటోంది పవన్. కాస్త వివరించు. పారదర్శకత గురించి మాట్లాడే మీరు..ఏ ఒక్క సినిమా హీరో అయినా తీసుకునే అసలు, నలుపు, తెలుపు, ఏరియా హక్కులు, కాల్ షీట్ మేనేజర్లు వగైరా లెక్కలను ఒక్కసారి అయినా వెల్లడించిన పాపాన పోయారా? 

జగన్ కోసం కాదు 
ఇందంతా మీరు జగన్ నో, వైఎస్ నో వేలెత్తి చూపారని కాదు. వాళ్లను మాత్రమే చూపారని, మీ చుట్టూ అంతా చెత్తే అయితే, మీరు కూడా చెత్తను ఆనుకునే కూర్చుని, మీ ఎదురుగా వున్నదే చెత్త, మిగిలినది మంచి అంటున్నారు చూడండి..అందుకని. ప్లీజ్ కాస్త నిజాలు మాట్లాడడం నేర్చుకోండి పవన్..అంతే కానీ ప్రాప్టింగ్ కు, డబ్బింగ్ చెప్పకండి..ఇకనైనా. 

31, మార్చి 2014, సోమవారం

శ్రీ జయ నామ సంవత్సర ఉగాది సుభాకాక్షాలు 

28, మార్చి 2014, శుక్రవారం

సెమీఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా

మిర్పూర్: టీమిండియా ఖాతాలో మరో విజయం చేరింది. ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. బంగ్లా విసిరిన 139 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఆటగాళ్లు 18.3 ఓవర్లో ఛేదించారు. ఆదిలోనే ఓపెనర్ శిఖర్ థావన్ (1) పరుగుకే పెవిలియన్ చేరినా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (56) పరుగులతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడు విరాట్ కోహ్లి (56*) పరుగులతో చేసి భారత్ విజయానికి సహకరించాడు.  చివర్లో కెప్టెన్ ధోని సిక్సర్ తో ఇన్నింగ్స్ ను ముగించాడు. ఈ మ్యాచ్ లో ఓటిమితో బంగ్లాదేశ్ మాత్రం సెమీస్ ఆశలను దాదాపు చేజార్చుకుంది.
 
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 138 పరుగులు చేసింది. భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆరంభంలోనే బంగ్లాను కట్టడి చేశాడు. అశ్విన్ వరుస బంతుల్లో తమీమ్ ఇక్బాల్, షమ్సూర్ రహ్మాన్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ షకీబల్ ను బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఆ తర్వాత బంగ్లా రన్ రేట్ మందగించింది. అనముల్ హక్ (44), ముష్ఫికర్ రహీం (24) బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేశారు. కాగా భారత బౌలర్ షమీ.. రహీంను అవుట్ చేయగా.. ఆ వెంటనే అమిత్ మిశ్రా అనముల్ ను బౌల్డ్ చేశారు. చివర్లో భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగించలేకపోయారు. మహ్మదుల్లా (33 నాటౌట్), నాసిర్ హుస్సేన్ (16) రాణించి బంగ్లాకు సముచిత స్కోరు అందించారు

నేటితో మున్సిపల్ ప్రచారానికి తెర
  • చిత్తూరు కార్పొరేషన్,ఆరు మున్సిపాల్టీల్లో ఎన్నికలు
  • హోరాహోరీగా సాగిన ప్రచారం
చిత్తూరు: జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాల్టీలకు నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం 48 గంటల ముందు ప్రచారం ముగిం చాలి. మార్చి 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండడంతో మైక్‌ల హోరు, అభ్యర్థనల జోరుకు నేటితో తెరపడనున్నది. 18వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు దాదాపు రెండు వారాలపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీల నుంచి చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, నగరి, పలమనేరు మున్సిపాల్టీల్లో అన్ని డివిజన్లు, వార్డులకు అభ్యర్థులను నిలిపారు. వీరి తరువాత స్వతంత్రులు పెద్ద సంఖ్యలో పోటీకి దిగారు. కాంగ్రెస్ శ్రీకాళహస్తి మున్సిపాల్టీలో మాత్రమే అన్ని వార్డులకు అభ్యర్థులను నిలిపింది. మొత్తం 813 మంది  ఎన్నికల బరిలో ఉన్నారు. వీరి గెలుపు కోసం వైఎస్‌ఆర్ సీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏఎస్ మనోహర్, ఆర్‌కే రోజా, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు జోరుగా ప్రచారం చేశారు.

తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు గాలి, బొజ్జల, జంగాలపల్లి శ్రీనివాసులు, కఠారి మోహన్, దొరబాబు ప్రచారం నిర్వహించారు. చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్‌ఆర్ సీపీ, తెలుగుదేశంతోపాటు ఎమ్మేల్యే సీకే బాబు అనుచరులు స్వతంత్ర ప్యానల్‌గా రంగంలోకి దిగారు. దీంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం వార్డుల్లో పోటా పోటీగా సాగింది.
ఫ్యాన్ గిరగిరా.. సైకిల్ గరగారా ... 

గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : వ్యాపార, వాణిజ్య రంగంలో జిల్లాలో పేరుగాంచిన గొల్లప్రోలులో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. గొల్లప్రోలు పేరు చెప్పగానే అందరికీ ఉల్లి, మిరప గుర్తుకొస్తాయి. రెండింటి మాదిరిగా ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా ఘాటుగా మారింది. తొలిసారిగా నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి. గతంలో రాజకీయ కురువృద్ధుడు పాము సూర్యారావు, మొగలి రామ్మూర్తి, మాదేపల్లి రంగబాబు వంటి వారు ఇక్కడ సర్పంచ్‌గా పనిచేశారు.
 
సర్పంచ్‌గా ఎప్పుడూ  హోరాహోరీ పోరు జరుగుతుండేది. నగర పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది.నగర పంచాయతీ తొలి కుర్చీని కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు పోటీ పడుతున్నాయి. ఇరు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం చేస్తున్నాయి. బలగాలను, బంధుత్వాలను, వర్గాలను కూడగొట్టి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ కేడర్ మూడొంతులకు పైగా వైఎస్సార్‌సీపీలో చేరింది. ఇటీవల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో ఆ పార్టీ బలం మరింతగా పుంజుకుంది.
 
దీంతో పాటు వార్డుల్లో బలమైన అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ రంగంలోకి దించింది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన తెడ్లపు చిన్నాను చైర్‌పర్సన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ  ముందుగా ప్రకటించి స్పష్టమైన వైఖరితో ఎన్నికల గోదాలోకి దిగింది. దీంతో వైఎస్సార్ సీపీ కేడర్ ప్రచారంలో దూసుకుపోతోంది. మరోపక్క టీడీపీ ఇంతవరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పార్టీ కేడర్‌లో గందరగోళం నెలకొంది. అందుకే ప్రచారంలో వారు కొంత తడబడుతున్నారు. తొలిసారిగా నగర పంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.
సినిమా రివ్యూ: లెజెండ్
నటవర్గం: బాలకృష్ణ, జగపతి బాబు, రాధిక ఆంప్టే, సోనాల్ చౌహన్
దర్శకుడు: బోయపాటి శ్రీను
నిర్మాత: అచంట గోపినాథ్, ఆచంట రాము, అనిల్ సుంకర
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
బ్యానర్: 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా సూపర్ హిట్. ఆతర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు సరైన హిట్ లేదు. లెజెండ్ లో జగపతిబాబు రూట్ మార్చి విలన్ రూపంలో కనిపించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిక్కి ఉంది. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ రాజకీయంగాను, సినీ కెరీర్ లో ప్రభావం చూపేందుకు లెజెండ్ ఎంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటిలు సరైన హిట్ కోసం, జగపతిబాబు తనను తాను కొత్తగా అవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ చిత్రం కొంత ప్రాధాన్యత, ఆసక్తిని సొంతం చేసుకుంది. మార్చి 28 శుక్రవారం వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 
 
ఇంట్లో కారం, ఒంట్లో అహంకారం లేకుండా బతకలేననే జితేందర్ (జగపతిబాబు) ముఖ్యమంత్రిపై పదవిపై ఆశలు పెంచుకుంటాడు. అలాంటి జితేందర్ పెళ్లి చూపుల కెళ్లి ఓ వివాదంలో చిక్కుకుంటాడు. ఆ ఊరి పెద్ద (సుమన్) జితేందర్ ను నష్టపరిహారం, క్షమాపణ చెప్పాలని తీర్పు ఇస్తాడు. ఆ ఊరి పెద్ద నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా భార్య (సుహాసిని)ను కుమారుడు కృష్ణ (బాలకృష్ణ)ను కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ వ్యవహారంలో తల్లి చనిపోవడంతో కృష్ణ జితేందర్ తండ్రి, అతని అనుచరులను చంపుతాడు. చిన్నతనంలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో తలదూర్చడం ఇష్టం లేని కారణంగా కృష్ణను పై చదువుల కోసం లండన్ పంపుతాడు. చదువు పూర్తయిన తర్వాత దుబాయ్ లో బిజినెస్ లో స్థిర పడుతాడు. పెళ్లి చేసుకుందామని వచ్చిన కృష్ణకు జితేందర్, అతని అనుచరుడి రూపంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జితేందర్ ను, అతని అనుచరులు ఎదుర్కొన్న కృష్ణను హతమార్చేందుకు ప్లాన్ వేసి.. ఓ ఘటనలో కృష్ణపై కాల్పులు జరుపుతారు. దాంతో కృష్ణ పరిస్థితి విషమంగా మారుతుంది. ఆ సంఘటన తర్వాతే సినిమాలో పెద్ద ట్విస్ట్ మొదలవుతుంది. ట్విస్ ఎమిటి? చావు బతుకుల పరిస్థితుల మధ్య ఉన్న కృష్ణ పరిస్థితి ఏమైంది. జితేందర్ ముఖ్యమంత్రి అయ్యాడా; జితేందర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎవరు అడ్డంకిగా మారారు అనే సందేహాలకు సినిమా చూడాల్సిందే. 
 
కృష్ణ పాత్రలో బాలకృష్ణ మరోసారి విజృంభించాడు. కథకు తగినట్టుగా.. తనకు లభించిన క్యారెక్టర్ పండించడంలో బాలకృష్ణ సఫలమయ్యాడు. సింహా తర్వాత ఓ పవర్ ఫుల్ పాత్రతో బాలకృష్ణ అదగొట్టాడనే చెప్పవచ్చు. ఇక జితేందర్ పాత్రలో జగపతిబాబు తన రూట్ ను మార్చుకుని ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రతో అద్బుతంగా రాణించాడు. జితేంద్ర పాత్ర లేకపోతే లెజెండ్ సినిమా లేదని ఓ అభిప్రాయాన్ని కలిగించే రేంజ్ లో జగపతిబాబు ప్రభావాన్ని చూపారు. తన ఇమేజ్ ను పక్కన పెట్టి ఓ కొత్త పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారడంలో సందేహం అక్కర్లేదు. 
 
కథలో భాగంగా రాధికా ఆంప్టే, సోనాల్ చౌహాన్ లు పాటలకే పరిమితం కాకుండా పెర్పార్మెన్స్ కూడా అవకాశం లభించింది. మిగితా పాత్రలు తమ పాత్రల పరిమితి మేరకు పర్వాలేదనిపించారు. 
 
రత్నం మాటలు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ ప్రసాద్ కెమెరా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ద్వితీయార్ధంలో రత్నం మాటలు తూటాల్ల పేలాయి. 
 
మ్యూజిక్ రివ్యూ: 
తొలిసారి బాలకృష్ణ చిత్రం కోసం మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు చేకూర్చారు. బాలకృష్ణను క్రేజ్ దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 'సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసాడంటే వీడు' అనే టైటిల్ సాంగ్, మెలోడిగా రూపొందింన  'పట్టు చీర బాగుందే.. కట్టు బొట్టు బాగుందే'  ఆడియోలో అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటలకు వచ్చిన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా తెర రూపం కల్పించారు. ఇక ఈ చిత్రంలో కీలకమైన పలు సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో దేవి శ్రీ ప్రసాద్ జీవం పోశారు. ఈ చిత్ర ద్వితీయార్ధంలో దేవీ శ్రీ స్రసాద్ పనితీరు అద్బుతంగా ఉంది. 
 
దర్శకుడి పనితీరు: 
దమ్ము చిత్రంతో ఎదురెబ్బ తిన్న బోయపాటి శ్రీను లెజెండ్ చిత్రంలో చక్కటి స్క్రీన్ ప్లే, ఫర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో దూసుకుపోయాడు. తొలిభాగంలో కథ మామూలుగా నడిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఆతర్వాత ద్వితీయార్ధంలో సన్నివేశాలను పరిగెత్తించాడు. మంచి టేకింగ్ కు రత్నం మాటలు తోడవ్వడంతో ప్రేక్షకుడికి ఓ మంచి అనుభూతిని కలిగించారు. ఏది ఏమైనా కష్టకాలంలో బోయపాటి శ్రీను తొలి ఆటకే సానుకూలమైన టాక్ సంపాదించుకున్నారు. సింహా తర్వాత ఈ మధ్యకాలంలో సరియైన హిట్ సొంతం చేసుకోలేకపోయిన బాలకృష్ణకు ఊరట కలిగించే చిత్రాన్ని అందించడంలో బోయపాటి సఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే చిత్రంలో మితి మీరిన హింస, ఊహలకు అందిన ఫైట్స్ మైనస్ పాయింట్ చెప్పవచ్చు. పక్కా కమర్షియల్ హంగులతో, సెంటిమెంట్ తోపాటు, బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన లెజెండ్ చిత్రం 'సింహా-2' అని చెప్పవచ్చు.


ప్లస్ పాయింట్స్:
జగపతిబాబు, బాలకృష్ణ నటన
డైలాగ్స్
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
 
మైనస్ పాయింట్స్:
మితిమీరిన హింస
క్లైమాక్స్

26, మార్చి 2014, బుధవారం

పోటీ, పొత్తులపై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇస్తారా

విశాఖపట్నం: విశాఖపట్నంలో రేపు గురువారం జరిగే సభలో జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగంపై ఉత్కంఠ నెలకొని ఉంది. జనసేన ఆవిర్భావ సభ హైదరాబాదులో జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న మొదటి రాజకీయ సభ ఇదే. ఆవిర్బావ సభలో ఆయన పొత్తులపై, ఎన్నికల్లో పోటీపై అస్పష్టంగా చెప్పారు. విశాఖ సభలో ఆయన స్పష్టత ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల్లో పోటీ చేస్తామో లేదో అని హైదరాబాదు సభలో ఆయన అన్నారు. అలాగే, కాంగ్రెసు తప్ప మిగతా ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆయన బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి తన మద్దతు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీతో కూడా ఆయన పొత్తు పెట్టుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే, తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలతో పనిచేయబోమని, బిజెపి వంటి జాతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని ఆయన కార్యాలయం పవన్ కళ్యాణ్ పేర ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ పట్ల ఆనుసరించే వైఖరిపై రేపు విశాఖ సభలో స్పష్టత ఇస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

బిజెపితో ఆయన పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. అయితే, ఆయన పార్టీ పోటీ చేసే స్థానాలు ఏవి అనేది తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఆయన పార్లమెంటుకు పోటీ చేయడానికే సుముఖంగా ఉన్నట్లు ఇప్పటి వరకు వార్తలు వస్తున్నాయి.

అన్నయ్య చిరంజీవిపై ఆయన తొలి సభలో సున్నితంగానే అయినా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత చిరంజీవి సున్నితంగానే ఆయినా తమ్ముడు పవన్ కళ్యాణ్‌పై సుతిమెత్తని విమర్శలు చేశారు. వాటికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తారా అనేది కూడా ఆసక్తికరంగానే మారింది.
ఆయన రేపు విశాఖసభలో ఇజం అనే పుస్తకాన్ని విడుదల చేస్తారు. తాను ఆంగ్లంలో రాసిన 150 పేజీల ఈ పుస్తకంలో తన పార్టీ వైఖరిని, విధివిధానాలను స్పష్టం చేస్తారని అంటున్నారు. ఆయన హైదరాబాద్ సభ తర్వాత అన్ని పార్టీల నాయకులు ఏదో రూపంలో పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేశారు. వాటికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమాధానాలు ఇస్తారనేది కూడా ఆసక్తికరంగానే ఉంది.

ఇజంలో ఏముంది.. పవన్ కళ్యాణ్ తన ఇజం పుస్తకంలో 2007 నుంచి తన అనుభవాల నేపథ్యంలో సైద్ధాంతిక ప్రాతిపదికను వివరించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన మిత్రుడు రాజు రవితేజతో కలిసి ఆ పుస్తకాన్ని రాసినట్లు తెలుస్తోంది. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. వ్యక్తికి, సమాజానికి సైద్ధాంతిక పునాది అవసరమని పుస్తకంలో పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. న్యాయం కోసం తపిస్తున్న అందరకీ ఈ పుస్తకం అంకితమని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఆల్ ద బెస్ట్

  • నేటి నుంచే టెన్త్ పరీక్షలు
  •  జంట జిల్లాల నుంచి 1.85 లక్షల మంది
 సాక్షి, సిటీబ్యూరో : మరికొద్ది గంటల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జంట జిల్లాల నుంచి మొత్తం 1,85,390 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఏప్రిల్ 15 వరకు కొనసాగనున్న పరీక్షల నిమిత్తం 813 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలుండే మార్గాల్లో ఆర్టీసీ 300 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆకస్మిక తనిఖీల నిమిత్తం రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన స్క్వాడ్ బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు.


23, మార్చి 2014, ఆదివారం

కులాంతర వివాహం చేసు
కుందని....
గుంటూరు : నగరంలోఆదివారం జరిగిన పరువు హత్య తీవ్ర కలకలం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుందని కుమార్తెను తల్లి దండ్రులే కసాయిలుగా మారి దారుణంగా హత్య చేసిన ఘటన రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. పెళ్లి పారాణి ఆరకముందే దీప్తి అనే యువతిని తల్లి దండ్రులే హత్య చేసి పరారైయ్యారు.  ప్రేమ వివాహం చేసుకున్నందుకు తన భార్యను అత్తా మామ హత్య చేశారని భర్త ఆరోపిస్తున్నాడు.
 
తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన అనంతపల్లి నాగ సత్యనారాయణ, అరుశ్రీ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్ హైదరాబాద్‌లో హెచ్‌సిఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ ఫిబ్రవరి 1న అమెరికా వెళ్ళాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే సమయంలో 2011లో అదే కంపెనీలో ని చేస్తున్న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడికి చెందిన పచ్చల దీప్తితో పరిచయం ఏర్పడింది.

ఇరువురు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఇందుకు కిరణ్‌కుమార్ తన తల్లి దండ్రులను ఒప్పించాడు. అయితే ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో దీప్తి తల్లి దండ్రులు పెళ్ళికి అంగీకరించలేదు. దీప్తికి తల్లి దండ్రులు పెళ్ళి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. వేరొకరిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని దీప్తి కిరణ్‌కుమార్‌కు ఫోన్ చేసి తనను పెళ్ళి చేసుకోకుంటే చనిపోతానని హెచ్చరించింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన కిరణ్‌కుమార్ దీప్తిని వివాహం చేసుకున్నాడు. ఈ ప్రేమ వివాహాన్ని అంగీకరించని తల్లి దండ్రులు ఆసరాగా ఉంటామని నమ్మించి హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

14, మార్చి 2014, శుక్రవారం

గూగుల్ సెర్చ్: వైయస్ జగన్‌ నే టాప్ 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులను వెనక్కి నెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గూగుల్ సెర్చ్‌లో ఎక్కువమంది నెటిజన్లచే వెతకబడిన నాయకుడిగా రికార్డు సృష్టించాడు. రాష్ట్రంలో త్వరలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గూగుల్ సెర్చ్ ట్రెండ్ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. గత 90 రోజుల్లో డేటా సగటును సేకరించిన గూగుల్ ట్రెండ్ ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిలిచారని తెలిపింది. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు లను కూడా కొన్ని సంఖ్యల తేడాతో వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కినెట్టారు. కాగా, దేశంలో ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన వారి జాబితాలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రాజకీయ నాయకుల జాబితాలో అగ్ర స్థానంలో నిలవగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ కొనసాగుతున్నట్లు గూగుల్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గురించి సెర్చి చేసిన వారి సంఖ్య కేజ్రివాల్‌తో పోలిస్తే 2/3 వంతు, మోడీతో పోల్చితే సగం వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు, కెసిఆర్ గురించి సెర్చి చేసిన వారి సంఖ్యతో పోల్చితే నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రివాల్ సెర్చి చేసిన వారి సంఖ్య అధికంగా ఉంది. ఇది హైదరాబాద్ నగరంలో మరీ ఎక్కువగా ఉంది. ఆశ్చర్యకరంగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కూడా రాష్ట్ర నాయకుల కంటే కూడా నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రివాల్ గురించి సెర్చించే వారే ఎక్కువగా ఉండటం గమనార్హం.

చంద్రబాబు నాయుడు, కెసిఆర్ లాంటి నాయకులతో పోల్చితే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఎక్కువగా వెతికినట్లు తెలుస్తోంది. అంతేగాక జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఆర్థిక నేరాభియోగాలు కూడా అతని గురించి వెతికేందుకు దోహదం చేసినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పాపులారిటీ సంపాదించినంత మాత్రాన అవి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటేనని వారంటున్నారు. జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆన్‌లైన్ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తోందని, ఇది కూడా అతని పాపులారిటీని పెంచడంలో సహకరించినట్లు తెలుస్తోందని వారు చెబుతున్నారు.

12, మార్చి 2014, బుధవారం

319 నామినేషన్లు ఒక్కరోజే 

అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్ జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో నామినేషన్లు ఊపందుకున్నా యి. ఈ నెల 10వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, బుధవారం ఒక్కరోజే 319 నామినేషన్లు దాఖలయ్యాయి.తొలి రెండురోజుల్లో కేవలం 13 మాత్రమే రాగా, ఇప్పటికి మొత్తం 332 నామినేషన్లు పడ్డాయి.
 
 = తెనాలి పురపాలకసంఘం పరిధిలో 35 నామినేషన్లుపడ్డాయి. వీటిలో సీపీఐ 2, వైఎస్సార్ సీపీ 4, టీడీపీ 25, లోక్‌సత్తా 1, ఇండిపెండెంట్లు 3 దాఖలయ్యాయి.
 
 = నరసరావుపేట పరిధిలో 47 నామినేషన్లు దాఖలు కాగా అందులో వైఎస్సార్ సీపీ 18, టీడీపీ 22, ఇతర పార్టీలు 1, ఇండిపెండెంట్లు 6 ఉన్నాయి. 
 
 = చిలకలూరిపేట పరిధిలో 22 నామినేషన్లు రాగా అందులో వైఎస్సార్ సీపీ 4, టీడీపీ 14, ఇండిపెండెంట్లు 4 ఉన్నాయి. 
 
 = బాపట్ల పరిధిలో 12 రాగా అందులో కాంగ్రెస్‌పార్టీ 1, వైఎస్సార్ సీపీ 1, టీడీపీ 7, ఇండిపెండెంట్లు 3 ఉన్నాయి.
 
 = పొన్నూరు పరిధిలో 35 రాగా వైఎస్సార్ సీపీ 6, టీడీపీ 28, ఇండిపెండెంటు 1 ఉన్నాయి. 
 = రేపల్లె పరిధిలో 20 నామినేషన్లు రాగా అందులో కాంగ్రెస్ 8, వైఎస్సార్ సీపీ 5, టీడీపీ 7 ఉన్నాయి. 
 = మాచర్ల పరిధిలో 8 రాగా సీపీఎం 1, వైఎస్సార్ సీపీ 3, టీడీపీ 2, ఇతర పార్టీ లు 1, ఇండిపెండెంట్ 1 ఉన్నాయి.
 
 = మంగళగిరి పరిధిలో 35 రాగా సీపీఐ 6, సీపీఎం 5, కాంగ్రెస్ 3, వైఎస్సార్‌సీపీ 11, టీడీపీ 7, ఇండిపెండెంట్లు 3 ఉన్నాయి.
 
 = సత్తెనపల్లి పరిధిలో 28 రాగా కాంగ్రెస్ 2, వైఎస్సార్ సీపీ 5, టీడీపీ 5లు ఉన్నాయి.
 = వినుకొండ పరిధిలో 15 రాగా కాంగ్రెస్ 4, వైఎస్సార్ సీపీ 3, టీడీపీ 4, ఇండిపెండెంట్లు 4 ఉన్నాయి.
 = తాడేపల్లి పరిధిలో 74 రాగా అందులో సీపీఎం 10, కాంగ్రెస్ 23, వైఎస్సార్ సీపీ 30, టీడీపీ 6, ఇండిపెండెంట్లు 5 ఉన్నాయి. 
 
 = పిడుగురాళ్లలో 15వ వార్డుకు టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.  
 
 నామినేషన్ దాఖలు చేసిన 
 చైర్మన్ అభ్యర్థులు
 = నరసరావుపేట పురపాలక సంఘానికి చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ తరపున 1వ వార్డు నుంచి ఎన్‌ఈసీ కళాశాల అధినేత మిట్టపల్లి కోటేశ్వరరావు తనయుడు మిట్టపల్లి రమేష్, టీడీపీ తరఫున 16వ వార్డు నుంచి ప్రముఖ బంగారు వ్యాపారి నాగసరపు సుబ్బరాయగుప్తాలు నామినేషన్లు దాఖలు చేశారు. 
 = మాచర్లలో చైర్మన్ అభ్యర్థిగా 15వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున పోలూరి పద్మావతి నామినేషన్ వేశారు.
 
 = రేపల్లెలో చైర్మన్ అభ్యర్థిగా 11వ వార్డు నుంచి టీడీపీ తరఫున గోగినేని పట్టాభిరామారావు నామినేషన్ దాఖలు చేశారు.
 
 = బాపట్లలో చైర్మన్ అభ్యర్థిగా 19వ వార్డు నుంచి టీడీపీ తరఫున తోట మల్లేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.
 
 = మంగళగిరి చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున చిల్లపల్లి వెంకటనాగమోహన్‌రావు, కాంగ్రెస్‌పార్టీ తరఫున ఇదే వార్డు నుంచి కొల్లి శ్రీనివాసచక్రవర్తి నామినేషన్ దాఖలు చేశారు. 
 = తాడేపల్లి చైర్మన్ అభ్యర్థిగా 5వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున కొయ్యగూర మహాలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. 
 = పొన్నూరు చైర్మన్ అభ్యర్థిగా 16వ వార్డు నుంచి టీడీపీ తరఫున సజ్జా హేమలత నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.