31, మార్చి 2014, సోమవారం
28, మార్చి 2014, శుక్రవారం
సెమీఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా
మిర్పూర్: టీమిండియా ఖాతాలో మరో విజయం చేరింది. ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. బంగ్లా విసిరిన 139 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఆటగాళ్లు 18.3 ఓవర్లో ఛేదించారు. ఆదిలోనే ఓపెనర్ శిఖర్ థావన్ (1) పరుగుకే పెవిలియన్ చేరినా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (56) పరుగులతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడు విరాట్ కోహ్లి (56*) పరుగులతో చేసి భారత్ విజయానికి సహకరించాడు. చివర్లో కెప్టెన్ ధోని సిక్సర్ తో ఇన్నింగ్స్ ను ముగించాడు. ఈ మ్యాచ్ లో ఓటిమితో బంగ్లాదేశ్ మాత్రం సెమీస్ ఆశలను దాదాపు చేజార్చుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 138 పరుగులు చేసింది. భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆరంభంలోనే బంగ్లాను కట్టడి చేశాడు. అశ్విన్ వరుస బంతుల్లో తమీమ్ ఇక్బాల్, షమ్సూర్ రహ్మాన్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ షకీబల్ ను బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత బంగ్లా రన్ రేట్ మందగించింది. అనముల్ హక్ (44), ముష్ఫికర్ రహీం (24) బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేశారు. కాగా భారత బౌలర్ షమీ.. రహీంను అవుట్ చేయగా.. ఆ వెంటనే అమిత్ మిశ్రా అనముల్ ను బౌల్డ్ చేశారు. చివర్లో భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగించలేకపోయారు. మహ్మదుల్లా (33 నాటౌట్), నాసిర్ హుస్సేన్ (16) రాణించి బంగ్లాకు సముచిత స్కోరు అందించారు

నేటితో మున్సిపల్ ప్రచారానికి తెర
టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీల నుంచి చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, నగరి, పలమనేరు మున్సిపాల్టీల్లో అన్ని డివిజన్లు, వార్డులకు అభ్యర్థులను నిలిపారు. వీరి తరువాత స్వతంత్రులు పెద్ద సంఖ్యలో పోటీకి దిగారు. కాంగ్రెస్ శ్రీకాళహస్తి మున్సిపాల్టీలో మాత్రమే అన్ని వార్డులకు అభ్యర్థులను నిలిపింది. మొత్తం 813 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వీరి గెలుపు కోసం వైఎస్‌ఆర్ సీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏఎస్ మనోహర్, ఆర్‌కే రోజా, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు జోరుగా ప్రచారం చేశారు.
తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు గాలి, బొజ్జల, జంగాలపల్లి శ్రీనివాసులు, కఠారి మోహన్, దొరబాబు ప్రచారం నిర్వహించారు. చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్‌ఆర్ సీపీ, తెలుగుదేశంతోపాటు ఎమ్మేల్యే సీకే బాబు అనుచరులు స్వతంత్ర ప్యానల్‌గా రంగంలోకి దిగారు. దీంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం వార్డుల్లో పోటా పోటీగా సాగింది.
- చిత్తూరు కార్పొరేషన్,ఆరు మున్సిపాల్టీల్లో ఎన్నికలు
- హోరాహోరీగా సాగిన ప్రచారం

ఫ్యాన్ గిరగిరా.. సైకిల్ గరగారా ...
గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : వ్యాపార, వాణిజ్య రంగంలో జిల్లాలో పేరుగాంచిన గొల్లప్రోలులో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. గొల్లప్రోలు పేరు చెప్పగానే అందరికీ ఉల్లి, మిరప గుర్తుకొస్తాయి. రెండింటి మాదిరిగా ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా ఘాటుగా మారింది. తొలిసారిగా నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి. గతంలో రాజకీయ కురువృద్ధుడు పాము సూర్యారావు, మొగలి రామ్మూర్తి, మాదేపల్లి రంగబాబు వంటి వారు ఇక్కడ సర్పంచ్‌గా పనిచేశారు.
సర్పంచ్‌గా ఎప్పుడూ హోరాహోరీ పోరు జరుగుతుండేది. నగర పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది.నగర పంచాయతీ తొలి కుర్చీని కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు పోటీ పడుతున్నాయి. ఇరు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం చేస్తున్నాయి. బలగాలను, బంధుత్వాలను, వర్గాలను కూడగొట్టి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ కేడర్ మూడొంతులకు పైగా వైఎస్సార్‌సీపీలో చేరింది. ఇటీవల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో ఆ పార్టీ బలం మరింతగా పుంజుకుంది.
దీంతో పాటు వార్డుల్లో బలమైన అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ రంగంలోకి దించింది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన తెడ్లపు చిన్నాను చైర్‌పర్సన్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ముందుగా ప్రకటించి స్పష్టమైన వైఖరితో ఎన్నికల గోదాలోకి దిగింది. దీంతో వైఎస్సార్ సీపీ కేడర్ ప్రచారంలో దూసుకుపోతోంది. మరోపక్క టీడీపీ ఇంతవరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో పార్టీ కేడర్‌లో గందరగోళం నెలకొంది. అందుకే ప్రచారంలో వారు కొంత తడబడుతున్నారు. తొలిసారిగా నగర పంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.

నటవర్గం: బాలకృష్ణ, జగపతి బాబు, రాధిక ఆంప్టే, సోనాల్ చౌహన్
దర్శకుడు: బోయపాటి శ్రీను
నిర్మాత: అచంట గోపినాథ్, ఆచంట రాము, అనిల్ సుంకర
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
బ్యానర్: 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా సూపర్ హిట్. ఆతర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు సరైన హిట్ లేదు. లెజెండ్ లో జగపతిబాబు రూట్ మార్చి విలన్ రూపంలో కనిపించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిక్కి ఉంది. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ రాజకీయంగాను, సినీ కెరీర్ లో ప్రభావం చూపేందుకు లెజెండ్ ఎంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటిలు సరైన హిట్ కోసం, జగపతిబాబు తనను తాను కొత్తగా అవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ చిత్రం కొంత ప్రాధాన్యత, ఆసక్తిని సొంతం చేసుకుంది. మార్చి 28 శుక్రవారం వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
ఇంట్లో కారం, ఒంట్లో అహంకారం లేకుండా బతకలేననే జితేందర్ (జగపతిబాబు) ముఖ్యమంత్రిపై పదవిపై ఆశలు పెంచుకుంటాడు. అలాంటి జితేందర్ పెళ్లి చూపుల కెళ్లి ఓ వివాదంలో చిక్కుకుంటాడు. ఆ ఊరి పెద్ద (సుమన్) జితేందర్ ను నష్టపరిహారం, క్షమాపణ చెప్పాలని తీర్పు ఇస్తాడు. ఆ ఊరి పెద్ద నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా భార్య (సుహాసిని)ను కుమారుడు కృష్ణ (బాలకృష్ణ)ను కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ వ్యవహారంలో తల్లి చనిపోవడంతో కృష్ణ జితేందర్ తండ్రి, అతని అనుచరులను చంపుతాడు. చిన్నతనంలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో తలదూర్చడం ఇష్టం లేని కారణంగా కృష్ణను పై చదువుల కోసం లండన్ పంపుతాడు. చదువు పూర్తయిన తర్వాత దుబాయ్ లో బిజినెస్ లో స్థిర పడుతాడు. పెళ్లి చేసుకుందామని వచ్చిన కృష్ణకు జితేందర్, అతని అనుచరుడి రూపంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జితేందర్ ను, అతని అనుచరులు ఎదుర్కొన్న కృష్ణను హతమార్చేందుకు ప్లాన్ వేసి.. ఓ ఘటనలో కృష్ణపై కాల్పులు జరుపుతారు. దాంతో కృష్ణ పరిస్థితి విషమంగా మారుతుంది. ఆ సంఘటన తర్వాతే సినిమాలో పెద్ద ట్విస్ట్ మొదలవుతుంది. ట్విస్ ఎమిటి? చావు బతుకుల పరిస్థితుల మధ్య ఉన్న కృష్ణ పరిస్థితి ఏమైంది. జితేందర్ ముఖ్యమంత్రి అయ్యాడా; జితేందర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎవరు అడ్డంకిగా మారారు అనే సందేహాలకు సినిమా చూడాల్సిందే.
కృష్ణ పాత్రలో బాలకృష్ణ మరోసారి విజృంభించాడు. కథకు తగినట్టుగా.. తనకు లభించిన క్యారెక్టర్ పండించడంలో బాలకృష్ణ సఫలమయ్యాడు. సింహా తర్వాత ఓ పవర్ ఫుల్ పాత్రతో బాలకృష్ణ అదగొట్టాడనే చెప్పవచ్చు. ఇక జితేందర్ పాత్రలో జగపతిబాబు తన రూట్ ను మార్చుకుని ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రతో అద్బుతంగా రాణించాడు. జితేంద్ర పాత్ర లేకపోతే లెజెండ్ సినిమా లేదని ఓ అభిప్రాయాన్ని కలిగించే రేంజ్ లో జగపతిబాబు ప్రభావాన్ని చూపారు. తన ఇమేజ్ ను పక్కన పెట్టి ఓ కొత్త పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారడంలో సందేహం అక్కర్లేదు.
కథలో భాగంగా రాధికా ఆంప్టే, సోనాల్ చౌహాన్ లు పాటలకే పరిమితం కాకుండా పెర్పార్మెన్స్ కూడా అవకాశం లభించింది. మిగితా పాత్రలు తమ పాత్రల పరిమితి మేరకు పర్వాలేదనిపించారు.
రత్నం మాటలు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ ప్రసాద్ కెమెరా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ద్వితీయార్ధంలో రత్నం మాటలు తూటాల్ల పేలాయి.
మ్యూజిక్ రివ్యూ:
తొలిసారి బాలకృష్ణ చిత్రం కోసం మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు చేకూర్చారు. బాలకృష్ణను క్రేజ్ దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 'సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసాడంటే వీడు' అనే టైటిల్ సాంగ్, మెలోడిగా రూపొందింన 'పట్టు చీర బాగుందే.. కట్టు బొట్టు బాగుందే' ఆడియోలో అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటలకు వచ్చిన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా తెర రూపం కల్పించారు. ఇక ఈ చిత్రంలో కీలకమైన పలు సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో దేవి శ్రీ ప్రసాద్ జీవం పోశారు. ఈ చిత్ర ద్వితీయార్ధంలో దేవీ శ్రీ స్రసాద్ పనితీరు అద్బుతంగా ఉంది.
దర్శకుడి పనితీరు:
దమ్ము చిత్రంతో ఎదురెబ్బ తిన్న బోయపాటి శ్రీను లెజెండ్ చిత్రంలో చక్కటి స్క్రీన్ ప్లే, ఫర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో దూసుకుపోయాడు. తొలిభాగంలో కథ మామూలుగా నడిపించినా.. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఆతర్వాత ద్వితీయార్ధంలో సన్నివేశాలను పరిగెత్తించాడు. మంచి టేకింగ్ కు రత్నం మాటలు తోడవ్వడంతో ప్రేక్షకుడికి ఓ మంచి అనుభూతిని కలిగించారు. ఏది ఏమైనా కష్టకాలంలో బోయపాటి శ్రీను తొలి ఆటకే సానుకూలమైన టాక్ సంపాదించుకున్నారు. సింహా తర్వాత ఈ మధ్యకాలంలో సరియైన హిట్ సొంతం చేసుకోలేకపోయిన బాలకృష్ణకు ఊరట కలిగించే చిత్రాన్ని అందించడంలో బోయపాటి సఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే చిత్రంలో మితి మీరిన హింస, ఊహలకు అందిన ఫైట్స్ మైనస్ పాయింట్ చెప్పవచ్చు. పక్కా కమర్షియల్ హంగులతో, సెంటిమెంట్ తోపాటు, బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన లెజెండ్ చిత్రం 'సింహా-2' అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్:
జగపతిబాబు, బాలకృష్ణ నటన
డైలాగ్స్
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
మైనస్ పాయింట్స్:
మితిమీరిన హింస
క్లైమాక్స్
26, మార్చి 2014, బుధవారం
పోటీ, పొత్తులపై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇస్తారా
విశాఖపట్నం: విశాఖపట్నంలో రేపు గురువారం జరిగే సభలో జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగంపై ఉత్కంఠ నెలకొని ఉంది. జనసేన ఆవిర్భావ సభ హైదరాబాదులో జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న మొదటి రాజకీయ సభ ఇదే. ఆవిర్బావ సభలో ఆయన పొత్తులపై, ఎన్నికల్లో పోటీపై అస్పష్టంగా చెప్పారు. విశాఖ సభలో ఆయన స్పష్టత ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల్లో పోటీ చేస్తామో లేదో అని హైదరాబాదు సభలో ఆయన అన్నారు. అలాగే, కాంగ్రెసు తప్ప మిగతా ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆయన బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి తన మద్దతు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీతో కూడా ఆయన పొత్తు పెట్టుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే, తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలతో పనిచేయబోమని, బిజెపి వంటి జాతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని ఆయన కార్యాలయం పవన్ కళ్యాణ్ పేర ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ పట్ల ఆనుసరించే వైఖరిపై రేపు విశాఖ సభలో స్పష్టత ఇస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
బిజెపితో ఆయన పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. అయితే, ఆయన పార్టీ పోటీ చేసే స్థానాలు ఏవి అనేది తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఆయన పార్లమెంటుకు పోటీ చేయడానికే సుముఖంగా ఉన్నట్లు ఇప్పటి వరకు వార్తలు వస్తున్నాయి.
అన్నయ్య చిరంజీవిపై ఆయన తొలి సభలో సున్నితంగానే అయినా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత చిరంజీవి సున్నితంగానే ఆయినా తమ్ముడు పవన్ కళ్యాణ్‌పై సుతిమెత్తని విమర్శలు చేశారు. వాటికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తారా అనేది కూడా ఆసక్తికరంగానే మారింది.

ఆయన రేపు విశాఖసభలో ఇజం అనే పుస్తకాన్ని విడుదల చేస్తారు. తాను ఆంగ్లంలో రాసిన 150 పేజీల ఈ పుస్తకంలో తన పార్టీ వైఖరిని, విధివిధానాలను స్పష్టం చేస్తారని అంటున్నారు. ఆయన హైదరాబాద్ సభ తర్వాత అన్ని పార్టీల నాయకులు ఏదో రూపంలో పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేశారు. వాటికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమాధానాలు ఇస్తారనేది కూడా ఆసక్తికరంగానే ఉంది.
ఇజంలో ఏముంది.. పవన్ కళ్యాణ్ తన ఇజం పుస్తకంలో 2007 నుంచి తన అనుభవాల నేపథ్యంలో సైద్ధాంతిక ప్రాతిపదికను వివరించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన మిత్రుడు రాజు రవితేజతో కలిసి ఆ పుస్తకాన్ని రాసినట్లు తెలుస్తోంది. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. వ్యక్తికి, సమాజానికి సైద్ధాంతిక పునాది అవసరమని పుస్తకంలో పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. న్యాయం కోసం తపిస్తున్న అందరకీ ఈ పుస్తకం అంకితమని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఆల్ ద బెస్ట్
సాక్షి, సిటీబ్యూరో : మరికొద్ది గంటల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జంట జిల్లాల నుంచి మొత్తం 1,85,390 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఏప్రిల్ 15 వరకు కొనసాగనున్న పరీక్షల నిమిత్తం 813 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలుండే మార్గాల్లో ఆర్టీసీ 300 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆకస్మిక తనిఖీల నిమిత్తం రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన స్క్వాడ్ బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు.
23, మార్చి 2014, ఆదివారం
కులాంతర వివాహం చేసు
కుందని....
గుంటూరు : నగరంలోఆదివారం జరిగిన పరువు హత్య తీవ్ర కలకలం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుందని కుమార్తెను తల్లి దండ్రులే కసాయిలుగా మారి దారుణంగా హత్య చేసిన ఘటన రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. పెళ్లి పారాణి ఆరకముందే దీప్తి అనే యువతిని తల్లి దండ్రులే హత్య చేసి పరారైయ్యారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు తన భార్యను అత్తా మామ హత్య చేశారని భర్త ఆరోపిస్తున్నాడు.
తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన అనంతపల్లి నాగ సత్యనారాయణ, అరుశ్రీ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్ హైదరాబాద్‌లో హెచ్‌సిఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ ఫిబ్రవరి 1న అమెరికా వెళ్ళాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే సమయంలో 2011లో అదే కంపెనీలో పని చేస్తున్న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడికి చెందిన పచ్చల దీప్తితో పరిచయం ఏర్పడింది.
ఇరువురు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఇందుకు కిరణ్‌కుమార్ తన తల్లి దండ్రులను ఒప్పించాడు. అయితే ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో దీప్తి తల్లి దండ్రులు పెళ్ళికి అంగీకరించలేదు. దీప్తికి తల్లి దండ్రులు పెళ్ళి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. వేరొకరిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని దీప్తి కిరణ్‌కుమార్‌కు ఫోన్ చేసి తనను పెళ్ళి చేసుకోకుంటే చనిపోతానని హెచ్చరించింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన కిరణ్‌కుమార్ దీప్తిని వివాహం చేసుకున్నాడు. ఈ ప్రేమ వివాహాన్ని అంగీకరించని తల్లి దండ్రులు ఆసరాగా ఉంటామని నమ్మించి హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

14, మార్చి 2014, శుక్రవారం
గూగుల్ సెర్చ్: వైయస్ జగన్ నే టాప్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులను వెనక్కి నెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గూగుల్ సెర్చ్‌లో ఎక్కువమంది నెటిజన్లచే వెతకబడిన నాయకుడిగా రికార్డు సృష్టించాడు. రాష్ట్రంలో త్వరలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గూగుల్ సెర్చ్ ట్రెండ్ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. గత 90 రోజుల్లో డేటా సగటును సేకరించిన గూగుల్ ట్రెండ్ ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిలిచారని తెలిపింది. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు లను కూడా కొన్ని సంఖ్యల తేడాతో వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కినెట్టారు. కాగా, దేశంలో ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన వారి జాబితాలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రాజకీయ నాయకుల జాబితాలో అగ్ర స్థానంలో నిలవగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ కొనసాగుతున్నట్లు గూగుల్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గురించి సెర్చి చేసిన వారి సంఖ్య కేజ్రివాల్‌తో పోలిస్తే 2/3 వంతు, మోడీతో పోల్చితే సగం వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు, కెసిఆర్ గురించి సెర్చి చేసిన వారి సంఖ్యతో పోల్చితే నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రివాల్ సెర్చి చేసిన వారి సంఖ్య అధికంగా ఉంది. ఇది హైదరాబాద్ నగరంలో మరీ ఎక్కువగా ఉంది. ఆశ్చర్యకరంగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కూడా రాష్ట్ర నాయకుల కంటే కూడా నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రివాల్ గురించి సెర్చించే వారే ఎక్కువగా ఉండటం గమనార్హం.
చంద్రబాబు నాయుడు, కెసిఆర్ లాంటి నాయకులతో పోల్చితే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఎక్కువగా వెతికినట్లు తెలుస్తోంది. అంతేగాక జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఆర్థిక నేరాభియోగాలు కూడా అతని గురించి వెతికేందుకు దోహదం చేసినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పాపులారిటీ సంపాదించినంత మాత్రాన అవి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటేనని వారంటున్నారు. జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆన్‌లైన్ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తోందని, ఇది కూడా అతని పాపులారిటీని పెంచడంలో సహకరించినట్లు తెలుస్తోందని వారు చెబుతున్నారు.
12, మార్చి 2014, బుధవారం
319 నామినేషన్లు ఒక్కరోజే
అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్ జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో నామినేషన్లు ఊపందుకున్నా యి. ఈ నెల 10వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, బుధవారం ఒక్కరోజే 319 నామినేషన్లు దాఖలయ్యాయి.తొలి రెండురోజుల్లో కేవలం 13 మాత్రమే రాగా, ఇప్పటికి మొత్తం 332 నామినేషన్లు పడ్డాయి.
= తెనాలి పురపాలకసంఘం పరిధిలో 35 నామినేషన్లుపడ్డాయి. వీటిలో సీపీఐ 2, వైఎస్సార్ సీపీ 4, టీడీపీ 25, లోక్‌సత్తా 1, ఇండిపెండెంట్లు 3 దాఖలయ్యాయి.
= నరసరావుపేట పరిధిలో 47 నామినేషన్లు దాఖలు కాగా అందులో వైఎస్సార్ సీపీ 18, టీడీపీ 22, ఇతర పార్టీలు 1, ఇండిపెండెంట్లు 6 ఉన్నాయి.
= చిలకలూరిపేట పరిధిలో 22 నామినేషన్లు రాగా అందులో వైఎస్సార్ సీపీ 4, టీడీపీ 14, ఇండిపెండెంట్లు 4 ఉన్నాయి.
= బాపట్ల పరిధిలో 12 రాగా అందులో కాంగ్రెస్‌పార్టీ 1, వైఎస్సార్ సీపీ 1, టీడీపీ 7, ఇండిపెండెంట్లు 3 ఉన్నాయి.
= పొన్నూరు పరిధిలో 35 రాగా వైఎస్సార్ సీపీ 6, టీడీపీ 28, ఇండిపెండెంటు 1 ఉన్నాయి.
= రేపల్లె పరిధిలో 20 నామినేషన్లు రాగా అందులో కాంగ్రెస్ 8, వైఎస్సార్ సీపీ 5, టీడీపీ 7 ఉన్నాయి.
= మాచర్ల పరిధిలో 8 రాగా సీపీఎం 1, వైఎస్సార్ సీపీ 3, టీడీపీ 2, ఇతర పార్టీ లు 1, ఇండిపెండెంట్ 1 ఉన్నాయి.
= మంగళగిరి పరిధిలో 35 రాగా సీపీఐ 6, సీపీఎం 5, కాంగ్రెస్ 3, వైఎస్సార్‌సీపీ 11, టీడీపీ 7, ఇండిపెండెంట్లు 3 ఉన్నాయి.
= సత్తెనపల్లి పరిధిలో 28 రాగా కాంగ్రెస్ 2, వైఎస్సార్ సీపీ 5, టీడీపీ 5లు ఉన్నాయి.
= వినుకొండ పరిధిలో 15 రాగా కాంగ్రెస్ 4, వైఎస్సార్ సీపీ 3, టీడీపీ 4, ఇండిపెండెంట్లు 4 ఉన్నాయి.
= తాడేపల్లి పరిధిలో 74 రాగా అందులో సీపీఎం 10, కాంగ్రెస్ 23, వైఎస్సార్ సీపీ 30, టీడీపీ 6, ఇండిపెండెంట్లు 5 ఉన్నాయి.
= పిడుగురాళ్లలో 15వ వార్డుకు టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు చేసిన
చైర్మన్ అభ్యర్థులు
= నరసరావుపేట పురపాలక సంఘానికి చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ తరపున 1వ వార్డు నుంచి ఎన్‌ఈసీ కళాశాల అధినేత మిట్టపల్లి కోటేశ్వరరావు తనయుడు మిట్టపల్లి రమేష్, టీడీపీ తరఫున 16వ వార్డు నుంచి ప్రముఖ బంగారు వ్యాపారి నాగసరపు సుబ్బరాయగుప్తాలు నామినేషన్లు దాఖలు చేశారు.
= మాచర్లలో చైర్మన్ అభ్యర్థిగా 15వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున పోలూరి పద్మావతి నామినేషన్ వేశారు.
= రేపల్లెలో చైర్మన్ అభ్యర్థిగా 11వ వార్డు నుంచి టీడీపీ తరఫున గోగినేని పట్టాభిరామారావు నామినేషన్ దాఖలు చేశారు.
= బాపట్లలో చైర్మన్ అభ్యర్థిగా 19వ వార్డు నుంచి టీడీపీ తరఫున తోట మల్లేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.
= మంగళగిరి చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున చిల్లపల్లి వెంకటనాగమోహన్‌రావు, కాంగ్రెస్‌పార్టీ తరఫున ఇదే వార్డు నుంచి కొల్లి శ్రీనివాసచక్రవర్తి నామినేషన్ దాఖలు చేశారు.
= తాడేపల్లి చైర్మన్ అభ్యర్థిగా 5వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున కొయ్యగూర మహాలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.
= పొన్నూరు చైర్మన్ అభ్యర్థిగా 16వ వార్డు నుంచి టీడీపీ తరఫున సజ్జా హేమలత నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
'గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్ కు తెలియదు'
రాజమండ్రి: గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్ కు తెలియదని తాజా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గోదావరి జిల్లాల్లో నెగ్గిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టినందుకే జై సమైక్యాంధ్ర పార్టీ పుట్టిందన్నారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించినందుకే సీఎం పదవిని వదులుకున్నానని చెప్పారు. రాజమండ్రిలో జరిగిన జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభలో కిరణ్ మాట్లాడారు.
పెద్దమ్మ(సోనియా), చిన్నమ్మ(సుష్మా స్వరాజ్) కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించమని ఎవరు సిఫారసు చేశారని ప్రశ్నించారు. ఎవరి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేశారని నిలదీశారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్ లో ఎలా ఆమోదిస్తారన్నారు. తెలుగుజాతి విడిపోయిందన్న బాధ ప్రతిఒక్కరిలో ఉందన్నారు. అయితే విభజన పూర్తిగా అయిపోలేదన్నారు.
ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఇచ్చే తీర్పు కాంగ్రెస్ కు గుణపాఠం కావాలన్నారు. తనకు ప్రజలే బీఫారం ఇస్తారని కిరణ్ అన్నారు. పదవి వదిలేసి తెలుగు ప్రజల కోసం జీవితం అంకితం చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా జై సమైక్యాంధ్ర పార్టీ జెండాను కిరణ్ ఆవిష్కరించారు. లేత పసుపుపచ్చ, పచ్చరంగులో ఉన్న జెండా మధ్యలో ఆంధ్రప్రదేశ్ పటం ఉంచారు.
రాజమండ్రి: గోదావరి జిల్లాల దెబ్బ కాంగ్రెస్ కు తెలియదని తాజా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గోదావరి జిల్లాల్లో నెగ్గిన పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టినందుకే జై సమైక్యాంధ్ర పార్టీ పుట్టిందన్నారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించినందుకే సీఎం పదవిని వదులుకున్నానని చెప్పారు. రాజమండ్రిలో జరిగిన జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావ సభలో కిరణ్ మాట్లాడారు.పెద్దమ్మ(సోనియా), చిన్నమ్మ(సుష్మా స్వరాజ్) కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించమని ఎవరు సిఫారసు చేశారని ప్రశ్నించారు. ఎవరి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేశారని నిలదీశారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్ లో ఎలా ఆమోదిస్తారన్నారు. తెలుగుజాతి విడిపోయిందన్న బాధ ప్రతిఒక్కరిలో ఉందన్నారు. అయితే విభజన పూర్తిగా అయిపోలేదన్నారు.
ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఇచ్చే తీర్పు కాంగ్రెస్ కు గుణపాఠం కావాలన్నారు. తనకు ప్రజలే బీఫారం ఇస్తారని కిరణ్ అన్నారు. పదవి వదిలేసి తెలుగు ప్రజల కోసం జీవితం అంకితం చేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా జై సమైక్యాంధ్ర పార్టీ జెండాను కిరణ్ ఆవిష్కరించారు. లేత పసుపుపచ్చ, పచ్చరంగులో ఉన్న జెండా మధ్యలో ఆంధ్రప్రదేశ్ పటం ఉంచారు.
జనసేన అనే పేరు శివసేన
కన్నా పవర్
హైదరాబాద్: 'జనసేన' పేరులోనే ఇంతుంటే పార్టీలో ఇంకెంతుంటుందోనని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. జనసేన అనే పేరు శివసేన కన్నా వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందని ట్విటర్ లో పేర్కొన్నారు. జనసేన కన్నా గొప్ప పేరు ఒక పార్టీకి ఉండే అవకాశం లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీలో జరిగిన అవకతవక పనులు జనసేనలో అసలు జరిగే అవకాశం లేదని వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప నాయకుడు దొరకడు కాబట్టి జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి తెలుగువాళ్లు తెలివైనవారని నిరూపించుకోవాలన్నారు. తన ఉద్దేశంలో తెలివి, నీతి, అభిమానం, పౌరుషం ఉన్నవాళ్లెవరైనా పవన్ జనసేన పార్టీకి ఓటు వేస్తారని వర్మ వ్యాఖ్యానించారు. జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ కొత్తపార్టీ పెడుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

11, మార్చి 2014, మంగళవారం
సుష్మా పాత్రను ఎన్నటికి మరువలేనిది : రాజ్‌నాథ్
హైదరాబాద్: తెలంగాణ బిల్లు లోకసభలో ఆమోదం పొందడంలో తమ పార్టీ నేత సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిదని, దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ బహిరంగ సభలలో ఆయన ప్రసంగించారు. రెండు రాష్ట్రాలను కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని,
సీమాంధ్రకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణతో పాటు సీమాంధ్రలను ఎలా అభివృద్ధి చేయాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే నక్సలైట్ సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. దేశంలో సుపరిపాలన అందించే ఏకైక పార్టీ బిజెపి అని, ఈ విషయం తాను మాత్రమే చెప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అదే విషయం చెబుతున్నారని ఆయన అన్నారు.
తాము అధికారంలోకి రావడానికి తమ పార్టీ రాజకీయం చేయదని, దేశాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తుందని ఆయన చెప్పారు. తాము మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ విధమైన సమస్య రాలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంపై తమ పార్టీ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. గుజరాత్ అభివృద్ధిని సోనియా గాంధీ నేతృత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కూడా ప్రశంసించిందని ఆయన అన్నారు. గుజరాత్‌లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సమస్య, విద్యుత్తు సమస్య పూర్తిగా పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి సహకరించాలని బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ తెలంగాణ ప్రజలను కోరారు. ఇరు ప్రాంతాల అబివృద్ధి బాధ్యత కేంద్రంపై ఉంటుందని, బిజెపి అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను బిజెపి నెరవేర్చిందని ఆయన చెప్పారు. అబివృద్ధికి మారు పేరు తమ పార్టీ అని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును భూస్థాపితం చేయాలని ఆయన అన్నారు. తెలంగాణను బిజెపి మాత్రమే అభివృద్ధి చేయగలుతుందని ఆయన అన్నారు. మోడీ ప్రధాని అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
బిజెపిలోకి జీవిత
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పక్షులు తమకు అనుకూలమైన గూటికి చేరిపోతున్నాయి. ఎన్నికల ముందు వలసలు సహజమే అయినప్పటికీ ఈసారి రాష్ట్ర విభజనతో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో జంపింగ్ జపాంగ్స్ మరింత జోరందుకున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేలు శిల్పా మోహన్ రెడ్డి, లబ్బి వెంకట స్వామితోపాటు మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి తమ అనుచరులతో సహా తరలి వచ్చి తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వీరంతా ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య ఈనెల 12వ తేదీ తర్వాత తిరిగి సొంతగూడు అయిన టిడిపిలో చేరనున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లునెగ్గిన రత్తయ్య ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక బయటికి వచ్చారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు సీమాంధ్రకు చంద్రబాబు నాయకత్వం అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయంతో... టిడిపిలో చేరనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ బిల్లు లోకసభలో ఆమోదం పొందడంలో తమ పార్టీ నేత సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిదని, దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ బహిరంగ సభలలో ఆయన ప్రసంగించారు. రెండు రాష్ట్రాలను కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని, సీమాంధ్రకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణతో పాటు సీమాంధ్రలను ఎలా అభివృద్ధి చేయాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే నక్సలైట్ సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. దేశంలో సుపరిపాలన అందించే ఏకైక పార్టీ బిజెపి అని, ఈ విషయం తాను మాత్రమే చెప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అదే విషయం చెబుతున్నారని ఆయన అన్నారు.
తాము అధికారంలోకి రావడానికి తమ పార్టీ రాజకీయం చేయదని, దేశాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తుందని ఆయన చెప్పారు. తాము మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ విధమైన సమస్య రాలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంపై తమ పార్టీ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. గుజరాత్ అభివృద్ధిని సోనియా గాంధీ నేతృత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కూడా ప్రశంసించిందని ఆయన అన్నారు. గుజరాత్‌లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సమస్య, విద్యుత్తు సమస్య పూర్తిగా పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి సహకరించాలని బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ తెలంగాణ ప్రజలను కోరారు. ఇరు ప్రాంతాల అబివృద్ధి బాధ్యత కేంద్రంపై ఉంటుందని, బిజెపి అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను బిజెపి నెరవేర్చిందని ఆయన చెప్పారు. అబివృద్ధికి మారు పేరు తమ పార్టీ అని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును భూస్థాపితం చేయాలని ఆయన అన్నారు. తెలంగాణను బిజెపి మాత్రమే అభివృద్ధి చేయగలుతుందని ఆయన అన్నారు. మోడీ ప్రధాని అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
బిజెపిలోకి జీవితహైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పక్షులు తమకు అనుకూలమైన గూటికి చేరిపోతున్నాయి. ఎన్నికల ముందు వలసలు సహజమే అయినప్పటికీ ఈసారి రాష్ట్ర విభజనతో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో జంపింగ్ జపాంగ్స్ మరింత జోరందుకున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేలు శిల్పా మోహన్ రెడ్డి, లబ్బి వెంకట స్వామితోపాటు మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి తమ అనుచరులతో సహా తరలి వచ్చి తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వీరంతా ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య ఈనెల 12వ తేదీ తర్వాత తిరిగి సొంతగూడు అయిన టిడిపిలో చేరనున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లునెగ్గిన రత్తయ్య ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక బయటికి వచ్చారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు సీమాంధ్రకు చంద్రబాబు నాయకత్వం అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయంతో... టిడిపిలో చేరనున్నట్లు చెప్పారు.
ఆల్ ద బెస్ట్!
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు
జంట జిల్లాల నుంచి 3.5 లక్షల మంది అభ్యర్థులు
8.45 దాటితే పరీక్షాకేంద్రంలోకి అనుమతి నిల్
మరికొద్ది గంటల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులు, గురువారం సెకండియర్ విద్యార్థులు ద్వితీయభాష పరీక్షలను రాయనున్నారు. పరీక్షలు ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులను అరగంట ముందు నుంచే పరీక్ష జరిగే హాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 8.45 తర్వాత పరీక్షాకేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు.
ఆలస్యంగా వచ్చినట్లైతే అధికారులు ఇచ్చిన ప్రొఫార్మాలో అభ్యర్థులు ఆలస్యానికి కారణాలను వివరించాలి. సీఎస్, డీ వోలు మినహా పరీక్షాకేంద్రంలో ఎవ్వరూ (ఇన్విజిలేటర్లతో సహా) సెల్‌ఫోన్లు వినియోగించకూడదు. ఆకస్మిక తనిఖీల నిమిత్తం రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన స్క్వాడ్ బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు.

హీరోయిన్‌తో రవిబాబు శృంగార కేళి : నగ్నసత్యం
హైదరాబాద్: మన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ స్త్రీ ఉదంతాన్ని కతాంశంగా తీసుకుని సంచలన పాకిస్థానీ హీరోయిన్ వీణా మాలిక్ ప్రధాన పాత్రలో అనురాధా ఫిలింస్ పతాకంపై కూరపాటి రామారావు దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ‘నగ్న సత్యం' చిత్రం షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మరి ఆ స్త్రీ ఎవరనేది? సినిమా విడుదలైతేగానీ తెలిసే అవకాశం లేదు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ వారు సినిమా చూసి ఇలాంటి సినిమా ప్రస్తుత సమాజానికి అవసరం అని చెప్పి అభినందించారు. మా సినిమాకు ‘ఎ' సర్టిఫికెట్ ఇచ్చారని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. వీణా మాలిక్‌తో జతకట్టిన రవిబాబు రేంజిలో రెచ్చిపోయిన శృంగార సీన్లలో నటించడం గమనార్హం.
ఒక మంచి కథాంశంతో మేము సమాజానికి ఇలాంటి విషయాలను తెలియాలి అనే దృక్ఫథంతో ఈ సినిమాను రూపొందించాము. మా ప్రయత్నానికి మొదటి విజయంగా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా పేరుకు తగ్గట్టు సమాజంలో జరుగుతున్న అనేక నగ్న సత్యాలు ఇందులో చూపించామని నిర్మాత తెలిపారు.
హీరోయిన్ వీణా మిలిక్ తెలుగు రాక పోయినా సన్నివేశాన్ని అర్థం చేసుకుని నటించింది. ఈ చిత్ర దర్శకుడు కూరపాటి రామరావు సినిమాను చక్కగా రూపొందించాడని, తమ బేనర్‌కు, దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు నిర్మాత.
ఈ చిత్రంలో వీణా మాలిక్‌కు జోడీగా దర్శకుడు, నటుడు అయిన రవిబాబు నటించారు. మిగిలిన పాత్రల్లో చలపదిరావు, జాకీ, విజయ్, ఆర్.కె. తదితరులు నటించారు. సినిమాకు సంగీతం : శంభుప్రసాద్, నిర్మాత: చదలవాడ శ్రీనివాసరావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కూరపాటి రామారావు.
ఇది చాలా టఫ్ సీన్ అని, పోలీసులు నన్ను జైల్లోకి లాక్కెళ్లండం మాటల్లో చెప్పలేకపోతున్నానని, షూటింగులో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానని వీణా మాలిక్ గతంలో షూటింగ్ సందర్బంగా తెలిపింది.
ఇప్పటి వివిధ సినిమాల్లో రకరకాల పాత్రల్లో నటించిన రవిబాబు తొలిసారిగా ఈ చిత్రంలో పూర్తి రొమాంటిక్ రోల్స్ పోషిస్తున్నారు.
మన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ స్త్రీ ఉదంతాన్ని కతాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. మరి ఆమె ఎవరు? అనేది చర్చనీయాంశం అయింది.
హైదరాబాద్: మన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ స్త్రీ ఉదంతాన్ని కతాంశంగా తీసుకుని సంచలన పాకిస్థానీ హీరోయిన్ వీణా మాలిక్ ప్రధాన పాత్రలో అనురాధా ఫిలింస్ పతాకంపై కూరపాటి రామారావు దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ‘నగ్న సత్యం' చిత్రం షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మరి ఆ స్త్రీ ఎవరనేది? సినిమా విడుదలైతేగానీ తెలిసే అవకాశం లేదు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ వారు సినిమా చూసి ఇలాంటి సినిమా ప్రస్తుత సమాజానికి అవసరం అని చెప్పి అభినందించారు. మా సినిమాకు ‘ఎ' సర్టిఫికెట్ ఇచ్చారని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. వీణా మాలిక్‌తో జతకట్టిన రవిబాబు రేంజిలో రెచ్చిపోయిన శృంగార సీన్లలో నటించడం గమనార్హం.ఒక మంచి కథాంశంతో మేము సమాజానికి ఇలాంటి విషయాలను తెలియాలి అనే దృక్ఫథంతో ఈ సినిమాను రూపొందించాము. మా ప్రయత్నానికి మొదటి విజయంగా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా పేరుకు తగ్గట్టు సమాజంలో జరుగుతున్న అనేక నగ్న సత్యాలు ఇందులో చూపించామని నిర్మాత తెలిపారు.
హీరోయిన్ వీణా మిలిక్ తెలుగు రాక పోయినా సన్నివేశాన్ని అర్థం చేసుకుని నటించింది. ఈ చిత్ర దర్శకుడు కూరపాటి రామరావు సినిమాను చక్కగా రూపొందించాడని, తమ బేనర్‌కు, దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు నిర్మాత.
ఈ చిత్రంలో వీణా మాలిక్‌కు జోడీగా దర్శకుడు, నటుడు అయిన రవిబాబు నటించారు. మిగిలిన పాత్రల్లో చలపదిరావు, జాకీ, విజయ్, ఆర్.కె. తదితరులు నటించారు. సినిమాకు సంగీతం : శంభుప్రసాద్, నిర్మాత: చదలవాడ శ్రీనివాసరావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కూరపాటి రామారావు.
ఇది చాలా టఫ్ సీన్ అని, పోలీసులు నన్ను జైల్లోకి లాక్కెళ్లండం మాటల్లో చెప్పలేకపోతున్నానని, షూటింగులో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానని వీణా మాలిక్ గతంలో షూటింగ్ సందర్బంగా తెలిపింది.
ఇప్పటి వివిధ సినిమాల్లో రకరకాల పాత్రల్లో నటించిన రవిబాబు తొలిసారిగా ఈ చిత్రంలో పూర్తి రొమాంటిక్ రోల్స్ పోషిస్తున్నారు.
మన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ స్త్రీ ఉదంతాన్ని కతాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాతలు తెలిపారు. మరి ఆమె ఎవరు? అనేది చర్చనీయాంశం అయింది.
ద్రవిడ్ ఒప్పుకుంటాడా?

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 'గోడ'లా నిలబడి మిస్టర్ డిపెండబుల్ గా పేరు తెచ్చుకున్న క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మరోసారి టీమిండియాకు ఆశాకిరణంగా మారాడు. క్రీజ్ ను అంటిపెట్టుకుని ఎన్నోసార్లు భారత క్రికెట్ జట్టును గట్టెక్కించిన ఈ సీనియర్ ఆటగాడి సేవలు మరోసారి టీమ్ కు అవసరమయ్యాయి. బ్యాట్స్ మన్, కెప్టెన్, కీపర్ గా మైదానంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి సగౌరవంగా ఆట నుంచి నిష్క్రమించిన ద్రవిడ్ ను మార్గదర్శకుడి పాత్ర పోషించాలంటున్నారు సీనియర్లు. కోచ్ అవతారం ఎత్తాలని అభిలషిస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన తర్వాత ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మాత్రమే కొనసాగుతున్నాడు. గత ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అయితే త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఎడిషన్ లో ద్రవిడ్ ఆడడం లేదు. ఈ సీజన్ లో ఆడడని గత ఏడాదే ద్రవిడ్ ప్రకటించాడు. అన్నట్టుగానే వైదొలగాడు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కు రాయల్స్ పగ్గాలు అప్పజెప్పి తప్పుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కు మెంటర్(మార్గదర్శకుడు)గా కొత్త పాత్రలోకి ప్రవేశించాడు ద్రవిడ్.
ఇదిలావుంచితే వరుస పరాజయాల బాటలో పయనిస్తున్న టీమిండియాను గాడిలో పెట్టేందుకు రాహుల్ ద్రవిడ్ ను చీఫ్ కోచ్‌గా నియమించాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించారు. టీమిండియాకు యువ కోచ్ అవసరమన్న గవార్కర్... అందుకు సరైన వ్యక్తి ద్రవిడ్ అని చెప్పారు. ప్రస్తుత కోచ్ ఫ్లెచర్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారని అతడిని తప్పించి ద్రవిడ్ కు కోచ్ బాధ్యతలు అప్పగించాలన్నారు. ద్రవిడ్ పట్ల అందరికీ గౌరవముందని, అతడి మాట స్టార్ ఆటగాళ్లు కూడా వింటారని అన్నారు.
గవార్కర్ ప్రతిపాదనపై అటు బీసీసీఐ, ఇటు ద్రవిడ్ స్పందించలేదు. కోచ్ గా నియమిస్తామని బీసీసీఐ ప్రతిపాదిస్తే ద్రవిడ్ కాదనకపోవచ్చు. ఆట కోసం తపించే ద్రవిడ్ ను కోచ్ గా పెడితే ఎవరూ వ్యతిరేకించకపోవచ్చు. అయితే కెప్టెన్ గా రాణించలేకపోయిన ద్రవిడ్ కోచ్ గా రాణిస్తాడా అన్న అనుమానం కలుగుతోంది. నాయకుడిగా నిలదొక్కులేకపోయిన ద్రవిడ్ టీమిండియా ఆటగాళ్లను ఏ మేరకు ప్రభావితం చేస్తారన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఆట కోసం అతడు పడే కష్టం చూస్తే ఇటువంటి అనుమానాలకు తావుండదు. కోచ్ పదవిలో ద్రవిడ్ తప్పకుండా సత్తా చూపుతాడన్న నమ్మకాన్ని గవార్కర్ వ్యక్తం చేశారు. ద్రవిడ్ ను కొత్త పాత్రలో చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. జట్టు వెనకుండి నడిపించే బాధ్యత ద్రవిడ్ కు దక్కుతుందో, లేదో చూడాలి.
బంపర్ ఆఫర్లు పవన్ కళ్యాణ్‌కు
హైదరాబాద్: రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్‌కు అన్ని రాజకీయ పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వస్తే ఆహ్వానించడానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. బహిరంగంగానే ఆయనకు స్వాగతం చెప్పాయి. ప్రతిగా ఆయన కోరికలను తీర్చడానికి ముందుకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వస్తే పార్టీలో ప్రధాన స్థానం కల్పించడమే కాకుండా తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వస్తే హృదయపూర్వకంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు.
పవన్ కళ్యాణ్‌ను తమ పార్టీలోకి లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణ ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను అందరికన్నా ముందుగా ఆహ్వానించింది ఆయనే. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొంత కాలం క్రితం ఊహాగానాలు చెలరేగాయి. పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా మద్దతు ఇస్తామని, పవన్ కళ్యాణ్ మద్దతుదారులకు కొన్ని శాసనసభా స్థానాలు ఇస్తామని కూడా తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కాగా, పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటన చేస్తారని బలమైన సంకేతాలు వస్తున్నాయి. ఆయన సినిమాల్లో పేదలు, బడుగుల పట్ల ఆదరణ చూపిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సామాజిక సేవ పట్ల అనురక్తి కలిగించే సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ నటించారు.
7, మార్చి 2014, శుక్రవారం
నువ్వా-నేనా అనేలా....
దేవిశ్రీ ప్రసాద్ జనరంజకమైన సంగీతాన్ని అందించాడు. దేవిశ్రీ తండ్రిగారు సత్యమూర్తి, నేను చాలా సినిమాలకు పనిచేశాం. అప్పుడు దేవిశ్రీ చాలా చిన్నపిల్లాడు. ఇప్పుడు తన ఎదుగుదల చూస్తుంటే ఆనందంగా ఉంది. జగపతిబాబుది ఇందులో విలన్ పాత్ర అని నేను అనను. మా ఇద్దరి పాత్రలూ నువ్వా- నేనా అనేలా ఉంటాయి. పంచభక్ష్యపరమాన్నాలతో వడ్డించిన విస్తరిలా సినిమాను మలిచాడు బోయపాటి’’ అని చెప్పారు. ‘‘ ‘బాబులకే బాబు లాంటివాడు బాలయ్యబాబు. ఆయన ముందు నన్ను ‘బాబు’ అని పిలవొద్దు’ని సెట్‌లోకి రాగానే అందరికీ చెప్పాను. కానీ అందరూ నన్ను ‘బాబు’ అనే పిలుస్తున్నారు. ఎందుకు అనడిగితే... ‘బాలయ్యే మిమ్మల్ని బాబు అని పిలుస్తున్నారండీ. ఇక మేం పిలవకపోతే ఎలా’ అన్నారంతా. దటీజ్ బాలయ్య. నేను ఇప్పటివరకూ బాలయ్యను యాక్టర్ మాత్రమే అనుకున్నాను. కానీ ఆయన న్యూక్లియర్ రియాక్టర్ అని ఆయనతో పనిచేశాక తెలిసింది’’ అని జగపతిబాబు అన్నారు.
బాలకృష్ణతో పనిచేయడం ఆనందంగా ఉందని, ఈ సినిమాతో అందరు హీరోలతో పనిచేసిన క్రెడిట్ తనకు దక్కిందని దేవిశ్రీప్రసాద్ ఆనందం వెలిబుచ్చారు. యూనిట్ సభ్యులతో పాటు రాజమౌళి, బాలకృష్ణ అల్లుళ్లు లోకేష్, శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.
సంచలనాల 'లెజెండ్'
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన 'లెజెండ్' సినిమా విడుదలకు ముందే సంచలనాలు రేపుతోంది. బుధవారం అభిమాని చేతుల మీదుగా విడుదల చేసిన లెజెండ్ టీజర్ కు మంచి ఆదరణ లభించింది. సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో దీన్ని అభిమానులు వీక్షించారు. 26 సెకనుల నిడివున్న ఈ ప్రచార చిత్రాన్ని 12 గంటల్లోపు సుమారు 120000 మంది పైగా వీక్షించినట్టు చెబుతున్నారు. చేతిలో తుపాకీ పట్టుకుని బాలకృష్ణ ఠీవిగా కూర్చున్నట్టుగా ఇందులో చూపించారు. బాలయ్య మెడ మీద టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టీజర్ కు మంచి ఆదరణ లభించడం పట్ల దర్శకుడు బోయపాటి శ్రీను సంతోషం వ్యక్తం చేశారు. 'లెజెండ్' తప్పకుండా మంచి సినిమా అవుతుందని చెప్పారు. దేవీశ్రీ ప్రసాద్ మంచి సంగీతం అందించాడని తెలిపారు. బాలయ్యను కొత్తగా ప్రమోట్ చేయడానికి టాటూ వేశామని వెల్లడించారు. బాలయ్య కోసం ప్రత్యేకంగా బైకు, సఫారీ కారు తయారు చేయించామని బోయపాటి తెలిపారు. మార్చి 7న ఆడియోను విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. మార్చి 28న 'లెజెండ్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

నాన్నకే నా సపోర్ట్.. బాబాయ్ కి 'రాం రాం' చరణ్
పవన్ కళ్యాణ్ పెట్టబోయే రాజకీయ పార్టీపై చిరంజీవి తనయుడు రాం చరణ్ స్పందించారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు తన మద్దతు ఉంటుందని.. అయితే నాన్నకే తన సపోర్ట్ అని వ్యాఖ్యానించారు. అయితే తనకు రాజకీయాలపై అవగాహన లేదు అని రాం చరణ్ అన్నారు. నాదారి నాదే.. బాబాయి దారి బాబాయిదే అని రాం చరణ్ వ్యాఖ్యలు చేశారు. చిన్నతనం నుంచి నాన్న నాకు సపోర్ట్ గా ఉన్నారు.. అలాగే నేను ఎప్పుడూ నాన్నకే సపోర్ట్ చేస్తాను అని అన్నారు. కుటుంబంలో ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే.. ఎవరి ఇష్టం వారిదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఆయన వ్యక్తిగతం అని అన్నారు.

ఇటీవల కాలంలో మెగాస్టార్ కుటుంబంలో విబేధాలు ఉన్నాయనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ చిత్రం ప్రారంభ కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడకోకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా, మార్చి 14 తేదిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ ప్రవేశంపై ఓ ప్రకటన చేయనున్నారు.
6, మార్చి 2014, గురువారం
తెలుగువారికోసం పార్టీ, జర్మనీయే కల్సింది:కిరణ్
హైదరాబాద్: ప్రపంచంలోని తెలుగు వారి గుండె చప్పుడు వినిపించేందుకు తాము కొత్త పార్టీని పెడుతున్నామని, ఆంధ్రప్రదేశ్‌లో తాము పోటీ చేస్తామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ నెల 12న రాజమండ్రిలో నిర్వహించే బహిరంగ సభలో విధివిధానాలు చెబుతామన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే తమ పార్టీ ఉంటుందన్నారు. తాము పార్టీ పెడుతోంది.. పదవుల కోసం కాదని, ప్రజల కోసమన్నారు.
తెలుగు వారిని అవమానిస్తే ప్రతిఘటించేందుకే తమ పార్టీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియను తాము పూర్తిగా వ్యతిరేకించామన్నారు. విభజనను వ్యతిరేకిస్తూనే తాను రాజీనామా చేశానన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభించిందని దుయ్యబట్టారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పటి వరకు కూడా స్పష్టత లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ప్రవర్తించిన తీరు బాధాకరమన్నారు. ఆయన అసెంబ్లీలో కూడా తన అభిప్రాయాన్ని చెప్పలేదని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విభజనకు సహకరించిందని ఆరోపించారు. ఆ పార్టీ బయటనేమో సమైక్యవాదమంటూ, లోపల మాత్రం విభజనను సమర్థించిందన్నారు. విభజన జరిగితేనే ముఖ్యమంత్రి అవుతానని జగన్ భావించారన్నారు. రాష్ట్రం కలిసుంటుందో, విడిపోతుందో తెలియని సమయంలో ప్లీనరీలో జగన్ తాను కాబోయే ముఖ్యమంత్రినని ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు, బిజెపిలు కలిసి తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సీమాంధ్రకు జరిగిన అన్యాయంపై స్పష్టంగా చెప్పారన్నారు. పురుడు పోసి తల్లిని చంపారని మోడీ అన్నారు. ఇక బిజెపి అగ్రనేత అద్వానీ ఇంత దుర్మార్గమైన బిల్లును తాను జీవితంలో చూడలేదని, సుష్మా స్వరాజ్ బిల్లే పెట్టలేదని, ఎంపీలు వెల్లోకి పోతే హృదయం గాయపడిందని ప్రధాని అన్నారని గుర్తు చేశారు. పార్లమెంటులో మన ఎంపీలను బహిష్కరించిన తీరు అవమానకరమన్నారు.
వివిద దశల్లో తాము సమైక్యం కోసం పోరాటం చేశామన్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో నోటా వచ్చిందన్నారు. పార్టీలను తిరస్కరించే అవకాశం ప్రజలకు ఉందన్నారు. ఆత్మవంచన చేసుకొని ప్రజలు ఎవరూ కూడా విభజనకు సహకరించిన పార్టీలకు ఓటేయరని తాము భావిస్తున్నామన్నారు. తాము పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే తాము పార్టీ పెడుతున్నామన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా వారి ఆత్మగౌరవం కోసం పోరాడుతుందన్నారు. తెలంగాణ, సీమాంధ్రల్లోనే కాకుండా ప్రపంచంలో ఉంటే తెలుగు వారి అందరి గుండె చప్పుడు అర్థం చేసుకునేలా తమ పార్టీ ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాము పోటీ చేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 12న మొదటి సభను పెడుతున్నామని, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుతామని చెప్పారు. రాజమండ్రి సభలో పార్టీ విధివిధానాలు చెబుతామన్నారు. విభజనకు కారణమైన పార్టీలో నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయన్నారు. వారికి అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలది అధికార దాహమే అన్నారు. తమ పార్టీ లక్ష్యం మాత్రం తెలుగు వారి గుండె చప్పుడు వినిపించేందుకే అన్నారు. తెలుగు వారి ప్రతిస్పందనలే తమ పార్టీ ప్రణాళికలని చెప్పారు. తాను పదవులు వదులుకొని పార్టీ పెడుతున్నానని చెప్పారు. అలాంటప్పుడు పదవుల కోసమే పార్టీ అనడంలో అర్థం లేదన్నారు. తనతో ఎవరు కలిసి రాకున్నా ఫరవాలేదని కానీ, తెలుగు ప్రజల తరఫున నిలిస్తే చాలన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇటీవల పలువురు నేతలు ఢిల్లీ పరుగెత్తినట్లు తాను మీడియాలో చూశానన్నారు. అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేశారనే బాధతో రాజీనామా చేశానన్నారు. తెలుగు వారి పట్ల ప్రవర్తించిన తీరు తనను కలచి వేసిందన్నారు. బిల్లు సమయంలో లైవ్ కాస్ట్ కూడా ఆపివేశారని విమర్శించారు.

4, మార్చి 2014, మంగళవారం
అద్దంలో చూసుకోవడానికీ భయపడేదాన్ని!
నాది చాలా సున్నిత హృదయం. ఎవరైనా నాతో కఠినంగా మాట్లాడితే తట్టుకోలేను. మరే పని లేనట్లు రోజంతా ఆ విషయం గురించే ఆలోచించి తెగ బాధపడిపోతుంటాను. దీని నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాను.
సలహాలు అన్నివేళలా ఉపకరించవని చెప్పడానికి నా సొంత అనుభవాలే నిదర్శనం. ఉదా: ‘డర్టీ పిక్చర్’ సినిమాను ఒప్పుకోవద్దని చాలామంది సన్నిహితులు చెప్పారు. ‘ఆ సినిమా చేస్తే నీ కెరీర్ ముగిసినట్లే’ అని కూడా అన్నారు. నేను వాటిని చాలా తేలికగా తీసుకున్నాను. నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. మార్చుకొని ఉంటే చాలా నష్టపోయేదాన్ని.
ఎప్పుడు పరాజయం ఎదురైనా ‘మేము ఉన్నాం కదా!’ అని నా కుటుంబం, స్నేహితులు ధైర్యాన్ని ఇచ్చేవారు. కొన్నిసార్లు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడేదాన్ని. ఆ అద్దంలో నా అంతరాత్మ ప్రత్యక్షమై ‘నువ్వెప్పుడూ విజయం సాధించలేవు’ అని తిడుతున్నట్లు అనిపించేది.
నేను చేసే పాత్రలు ఆ సినిమా వరకు మాత్రమే పరిమితం కావు. ఆ పాత్రలు నాతో పాటు ఇంటికి నడిచొస్తాయి. నవ్విస్తాయి. ధైర్యాన్ని ఇస్తాయి.
నాది చాలా సున్నిత హృదయం. ఎవరైనా నాతో కఠినంగా మాట్లాడితే తట్టుకోలేను. మరే పని లేనట్లు రోజంతా ఆ విషయం గురించే ఆలోచించి తెగ బాధపడిపోతుంటాను. దీని నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాను.సలహాలు అన్నివేళలా ఉపకరించవని చెప్పడానికి నా సొంత అనుభవాలే నిదర్శనం. ఉదా: ‘డర్టీ పిక్చర్’ సినిమాను ఒప్పుకోవద్దని చాలామంది సన్నిహితులు చెప్పారు. ‘ఆ సినిమా చేస్తే నీ కెరీర్ ముగిసినట్లే’ అని కూడా అన్నారు. నేను వాటిని చాలా తేలికగా తీసుకున్నాను. నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. మార్చుకొని ఉంటే చాలా నష్టపోయేదాన్ని.
ఎప్పుడు పరాజయం ఎదురైనా ‘మేము ఉన్నాం కదా!’ అని నా కుటుంబం, స్నేహితులు ధైర్యాన్ని ఇచ్చేవారు. కొన్నిసార్లు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడేదాన్ని. ఆ అద్దంలో నా అంతరాత్మ ప్రత్యక్షమై ‘నువ్వెప్పుడూ విజయం సాధించలేవు’ అని తిడుతున్నట్లు అనిపించేది.
నేను చేసే పాత్రలు ఆ సినిమా వరకు మాత్రమే పరిమితం కావు. ఆ పాత్రలు నాతో పాటు ఇంటికి నడిచొస్తాయి. నవ్విస్తాయి. ధైర్యాన్ని ఇస్తాయి.
నేను వస్తే.. విలీనం చేస్తారా : విజయశాంతి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా అని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి సవాల్ విసిరారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామంటే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇటీవల కెసిఆర్ మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన విజయశాంతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని.. ఇప్పుడు తమ పార్టీని విలీనం చేయాలని ఎలా అడుగుతారని ప్రశ్నించినట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను పై వ్యాఖ్యలు చేసినట్లు విజయశాంతి తెలిపారు. టిఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలని ఎవరైనా అడిగారా అని ఆమె ప్రశ్నించారు. ఎవరూ అడగకపోయినా కెసిఆర్ విలీనం చేయమని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. సీమాంధ్రలోని 25 పార్లమెంటు స్థానాలను వదులుకుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని విజయశాంతి అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మాట నిలబెట్టుకున్నారని, ఆమెనే తెలంగాణకు నిజమైన తల్లి అని చెప్పారు.
ఒక ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్ఎస్‌ను జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ విలీనం చేయాలని ఏనాడూ కోరలేదని చెప్పారు. తాను పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో చేరానని విజయశాంతి తెలిపారు. తెలంగాణపై సిడబ్ల్యూసి నిర్ణయం వెలువడిన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసి కృతజ్ఞతలు చెప్పానని, అందుకే టిఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిందని ఆరోపించారు. అయితే తాను అప్పటికీ ఏ పార్టీలో చేరలేదని, తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాతే కాంగ్రెస్‌లో చేరానని విజయశాంతి చెప్పారు. ఎన్నికల తర్వాత దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కెసిఆర్, తాను అడిగితే అప్పటి వరకు చూద్దాంలే అని కసురుకున్నట్లు విజయశాంతి తెలిపారు. బడుగుబలహీన వర్గానికి చెందిన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. నాయకుడంటే మాటకు కట్టుబడి ఉండాలని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే రెండు ప్రాంతాల్లోనూ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణానికి మీరే కావాలా? అని టిఆర్ఎస్‌ను ప్రశ్నించన ఆమె.. తెలంగాణ జెఏసితోపాటు మరెందరో నాయకులు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు తామనుకున్న తెలంగాణ రాలేదని అంటున్న కెసిఆర్, అప్పుడే ఎందుకు ప్రకటించలేదని విజయశాంతి ప్రశ్నించారు. కెసిఆర్ డిమాండ్లు తెలంగాణ కోసమా? లేక మరేమైనా ఉన్నాయా అని ఆమె అన్నారు. కెసిఆర్ మాట నిలబెట్టుకోని మనిషని ఆమె అన్నారు. దయచేసి పద్దతి మార్చుకోండి.. కుంటిసాకులతో అబద్ధాలు చెప్పకండని కెసిఆర్‌ను కోరింది. స్వాత్యంత్రం ఇచ్చినందుకు దేశ ప్రజలు బ్రిటిషువారికి కృతజ్ఞతలు చెప్పలేదని.. గాంధీ, నెహ్రూలనే ఆరాధించారని కెసిఆర్ అన్న మాటలపై ఆమె స్పందించారు. తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడి ప్రజలు సోనియానే దేవతగా చూస్తారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లిని వెన్నుపోటు పోడవటం బాధారమని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి తమ విశ్వాసం చాటుకుంటున్నారని విజయశాంతి చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన సమయంలోనూ టిఆర్ఎస్ నాయకులను అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. ఇదే తరహాలో కాంగ్రెస్‌ను కూడా గెలిపిస్తారని అన్నారు. తెలంగాణ కట్టుబడి ఉన్నామన్న భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై అనేక మెలికలు పెట్టిందని విజయశాంతి తెలిపారు.

కెసిఆర్ పై నిప్పులు, జగన్ కి బెదిరింపులు
హైదరాబాద్: విలీనం అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన, పర్యటన విషయమై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మండిపడుతున్నారు. కెసిఆర్ పైన కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కెసిఆర్‌ది రెండు నాల్కల ధోరణి అని, బెదిరింపులు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసు పార్టీయేనని ప్రజలకు తెలుసునని చెప్పారు. వచ్చే
ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఒంటరి పోరుకు దిగనుందని చెప్పారు. విలీనం అవుతానని చెప్పింది... ఆ తర్వాత కాదని చెప్పింది కెసిఆరే అన్నారు.
కెసిఆర్ వారం రోజుల్లో మాట మార్చారని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కుటుంబం చుట్టే తెలంగాణ తిరగాలని ఆయన భావిస్తున్నారని, సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. కెసిఆర్ స్వార్థం మానకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని, విలీనంపై పునరాలోచన చేయాలన్నారు. పోలవరం ముంపుకు సంబంధించి ఏడు మండలాలను సీమాంధ్రకు వదిలేది లేదన్నారు. జగన్‌కు తెలంగాణలో పర్యటించే హక్కు లేదన్నారు. కెసిఆర్ విలీనంపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గండ్ర వెంకటరమణ రెడ్డివరంగల్ జిల్లాలో అన్నారు. సోనియా పైన చెసిన వ్యాఖ్యలను కెసిఆర్ ఉపసంహరించుకోవాలని సూచించారు. కెసిఆర్ కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికార పక్షంలో ఉంటారు.. లేదంటే ప్రతిపక్షంలో ఉంటారన్నారు. అదే సమయంలో జగన్ పైనా మండిపడ్డారు. జగన్ ఏ మొహం పెట్టుకొని రేపు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని ప్రశ్నించారు. జగన్ పర్యటిస్తే మానుకోట పునరావృతమవుతుందని హెచ్చరించారు. కెసిఆర్ విలీనంపై మాట నిలబెట్టుకోవాలని, జగన్ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాలని వి హనుమంత రావు అన్నారు. కాగా, జగన్ పర్యటనకు అనుమతించవద్దని పలువురు నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
3, మార్చి 2014, సోమవారం
నేను యువతరం ప్రతినిధిని: జగన్
ఏలూరు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాతతరం మనిషని, తాను యువకుడిని, ఈ తరం ప్రతినిధినని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సగర్వంగా చెప్పుకున్నారు. ఏఎస్ఆర్ గ్రౌండ్‌లో 'వైఎస్ఆర్ జనభేరి' బహిరంగ సభలో భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. చంద్రబాబు కన్నా తాము బాగా పాలించగలం అని చెప్పారు. అధికారంలోకి రాగానే చరిత్రను మార్చే 4 సంతకాలు చేస్తానన్నారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లిబిడ్డల జీవితాల్లో వెలుగు తెచ్చేలా తొలి సంతకం చేస్తాను. అవ్వా, తాతల జీవితాలకు ఊరటనిచ్చేలా వారికి పెన్షన్ రూ.700 పెంచేలా రెండో సంతకం చేస్తాను. రైతన్న ఇంట వెలుగు నిండేలా అన్నదాతకు గిట్టుబాటు ధర కల్పించేందుకు స్థిరీకరణ నిధి కోసం మూడో సంతకం చేస్తాను.అక్కా, చెల్లెళ్ల కళ్లల్లో సంతోషం కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగో సంతకం చేస్తానని చెప్పారు. రాష్ట్రం కోసం జీవితాంతం పాకులాడుతానని హామీ ఇచ్చారు.
వైఎస్ఆర్ చనిపోయి ఐదేళ్లైనా ప్రజల గుండెల్లోనే ఉన్నారు. విలువలు, విశ్వసనీయత అంటే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్. విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి వైఎస్ఆర్. భూతద్దంపెట్టి వెతికినా నేటి రాజకీయ నేతల్లో విలువలు, విశ్వసనీయత కనిపించడం లేదు. చంద్రబాబు ఏనాడైనా విద్యార్థుల వద్దకు వెళ్లారా? చదువుకోవడంలో ఉన్న కష్టనష్టాలు చంద్రబాబుకు తెలుసా? చంద్రబాబు హయాంలో అనారోగ్యం పాలైనవారి కష్టాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ప్రాణం బతికించుకునేందుకు, ఆస్పత్రుల ఫీజుల కోసం ఇళ్లు తాకట్టుపెట్టిన రోజులు గుర్తున్నాయి. నిరుపేదల బియ్యాన్ని రూ.2 నుంచి రూ.5 లకు పెంచిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. మద్య నిషేధం ఎత్తేయించాలని ఈనాడులో పెద్దపెద్ద రాతలు రాయించారు. ఈనాడు రాసిన 2,3 రోజులకు బాబు మద్యపాన నిషేధం ఎత్తేశారు. గ్రామగ్రామాన చంద్రబాబు బెల్ట్ షాపులను ఏర్పాటు చేసిన రోజులు గుర్తున్నాయి. ఎఫ్ డిఐలకు అనుకూలంగా తన ఎంపీలతో బాబు ఓటేయించారు. తెలుగువారిని మోసం చేసి రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబు. ఇప్పుడు సింగపూర్ లాగా మారుస్తానంటున్నారు. రాష్ట్రాన్ని విడదీస్తున్నప్పుడు బాధపడటం తప్ప ఏం చేయలేకపోయాను. కేంద్రంలో కాంగ్రెస్- బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ - చంద్రబాబు కలిసిపోయి రాష్ట్రాన్ని విడదీశారు. 30 ఎంపి స్థానాలు గెలుచుకుందాం, మన ప్రయోజనాలు కాపాడేవారిని ప్రధానిని చేద్దాం అని జగన్ చెప్పారు.
వైఎస్ఆర్ జనభేరి భారీగా జనం తరలి వచ్చారు. సభా ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది.

కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కలవదు: కేసీఆర్
హైదరాబాద్: తమ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ లో విలీనం చేయబోమని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఈమేరకు టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. టీఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో కలపొద్దని తెలంగాణ వ్యాప్తంగా తనకు వేల సందేశాలు వచ్చాయని తెలిపారు.
విభజన విషయంలో ఏ ఒక్క సందర్భంలోనూ కాంగ్రెస్ తమను సంప్రదించలేదన్నారు. బిల్లు రూపకల్పనలో తమను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తాము అడిగింది ఏమీ కాంగ్రెస్ చేయలేదని విమర్శించారు. ఎన్టీపీసీ నుంచి అదనపు విద్యుత్ ఇవ్వలేదని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది కాబట్టి ఇక నుంచి టీఆర్ఎస్ పక్కా రాజకీయ పార్టీగా ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తుల విషయం కేశవరావు నేతృత్వంలో ఏర్పడే కమిటీ చూసుకుంటుందన్నారు. సోనియాను కొందరు నాయకులు తప్పుదారి పట్టించారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే తప్పకుండా మద్దతు ఇస్తామని కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్: తమ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ లో విలీనం చేయబోమని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఈమేరకు టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. టీఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో కలపొద్దని తెలంగాణ వ్యాప్తంగా తనకు వేల సందేశాలు వచ్చాయని తెలిపారు.విభజన విషయంలో ఏ ఒక్క సందర్భంలోనూ కాంగ్రెస్ తమను సంప్రదించలేదన్నారు. బిల్లు రూపకల్పనలో తమను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తాము అడిగింది ఏమీ కాంగ్రెస్ చేయలేదని విమర్శించారు. ఎన్టీపీసీ నుంచి అదనపు విద్యుత్ ఇవ్వలేదని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది కాబట్టి ఇక నుంచి టీఆర్ఎస్ పక్కా రాజకీయ పార్టీగా ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తుల విషయం కేశవరావు నేతృత్వంలో ఏర్పడే కమిటీ చూసుకుంటుందన్నారు. సోనియాను కొందరు నాయకులు తప్పుదారి పట్టించారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే తప్పకుండా మద్దతు ఇస్తామని కేసీఆర్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ చిత్రంలో నటకిరీటి ...
హైదరాబాద్: ఆ మధ్యన అల్లు అర్జున్ సూపర్ హిట్ జులాయి లో చేసి మురిపించిన కామెడీ కింగ్ మరో పెద్ద హీరో సినిమాలో కనిపించనున్నారని సమాచారం. బాలీవుడ్ సూపర్ హిట్ ‘ఓ మై గాడ్' సినిమాకి రీమేక్ గా రూపొందనున్న చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ పాత్రను పోషించనున్నారు. ఆ పాత్ర స్వామిజీ అని తెలుస్తోంది. ఓ మైగాడ్ లో ఆ పాత్రను మిధున్ చక్రవర్తి చేసారు. అయ్యారే లో రాజేంద్రప్రసాద్ ఈ తరహా పాత్రను చేసి మెప్పించటంతో ఈ సారి ఆయన్నే అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క మహేష్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న ఆగడు చిత్రంలో ఆయన హీరో కి తండ్రిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఫన్,సెంటిమెంట్ కలగలపిన పాత్రలో రాజేంద్రప్రసాద్ ని దర్సకుడు చూపించనున్నారని చెప్పుతున్నారు. ఇక ఓమైగాడ్ రీమేక్ చిత్రానికి ఏం పేరు పెట్టే అవకాసముందే విషయమై మీడియాలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి ‘ఓరి దేముడా'అనే టైటిల్ పెట్టే అవకాసముందని చెప్తున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయటానికి నిర్ణయించారని ఫిల్మ్ సర్కిల్సో లో వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్'. 'మేన్ హూ స్యూడ్ గాడ్' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు. కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్'. అక్షయ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం. 'ఓ మై గాడ్'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.
2, మార్చి 2014, ఆదివారం
నీలంతో ఆరంభం .. నల్లారితో అంతం
Neelam Sanjiva Reddy
Former President of India
Neelam Sanjiva Reddy was the sixth President of India, serving from 1977 to 1982. Over the course of a long political career, Reddy held several key offices, as the first and two-time Chief Minister of Andhra Pradesh, a two-time Speaker of the Lok Sabha and Union Minister. He remains the only person to be elected to the office of the President of India unopposed.
Born: May 19, 1913, Madras Presidency, Presidencies of British India
Died: June 1, 1996, Bangalore
Previous office: President of India
(1977–1982)
Presidential term: July 25, 1977 –
July 25, 1982
Party: Janata Party
ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో 58 ఏళ్ళ తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్ గా మిగిలిపోయింది. 1956 నవంబర్ 1న ఏర్పడిన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి నేటివరకూ 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎక్కువమంది రాయలసీమ నుంచి వచ్చిన వారే. సామాజిక న్యాయం అనేది అందని అందలమైంది. ఆంధ్రప్రదేశ్ జనాభా రీత్యా అత్యధికశాతం బీసీ వోటర్లు ఉన్నా ఒక్కరికి కూడా సీఎంగా అవకాశం దక్కలేదు. ఎస్టీలు
ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. ఎస్సీల్లో ఒక్క దామోదరం సంజీవయ్యకు సీఏంగా పని చేసే అవకాశం దక్కగా.. అదీ మూడేళ్ళ ముచ్చటగానే ముగిసింది.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 9 మంది సీఎంలుగా పనిచేశారు. కమ్మ కులం నుంచి ముగ్గురు, ఒకరు బ్రాహ్మణ, మరొకరు వైశ్య, వెలమల్లో ఒకరికి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. రాయలసీమ నుంచి ఆరుగురు, కోస్తాంధ్రకు చెందిన ఆరుగురు, తెలంగాణలోని నలుగురు సీఎం కుర్చీని అధిరోహించారు. 16 మందిలో ఎక్కువ రోజులు పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు చంద్రబాబు సొంతం అవగా.. అతి తక్కువ రోజులు సీఎంగా వ్యవహరించిన వ్యక్తిగా నాదెండ్ల భాస్కరరావు చరిత్ర సృష్టించారు. అనంతపురం జిల్లావాసి అయిన నీలం సంజీవరెడ్డితో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల ప్రస్తానం చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ముగిసింది.
నీలంతో ఆరంభమైన సమైక్యాంధ్రప్రదేశ్ ..నల్లారి పాలనతో అంతమై అవశేషాంధ్రప్రదేశ్ గా మిగిలిపోయింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజికవర్గ ముఖ్యమంత్రుల హయాంలోనే ఇరుప్రాంతాల విలీనం.. రెండు ప్రాంతాలుగా విభజన జరగడం యాదృచ్చికమే అయినా చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకుంది.
Nallari Kiran Kumar Reddy
Indian Politician
Nallari Kiran Kumar Reddy is an Indian politician who served as the Chief Minister of Andhra Pradesh.
Born: September 13, 1960 (age 53), Hyderabad
Spouse: Radhika Reddy
Party: Indian National Congress
Children: Niharika Reddy, Nikelesh Reddy
Education: Osmania University, Nizam College, Hyderabad Public School
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)