2, మార్చి 2014, ఆదివారం

అంబరీష్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్లను నమ్మవద్దు'

నటుడు, రాజకీయవేత్త, కర్నాటక గృహ నిర్మాణశాఖామంత్రి అంబరీష్ ఆరోగ్యం కుదుటపడిందని ఆయన సతీమణి,నటి సుమలత వెల్లడించారు. ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం అంబరీష్ ను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ కు తరలించారు.
 శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో తొలుత ఫిబ్రవరి 21 తేదిన బెంగళూరులోని విక్రమ్ హస్పిటల్లో చేర్పించారు. ఆతర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సింగపూర్ కు తరలించారు. 
 వెంటిలెటర్ త్వరలో తొలగిస్తారని, మరో 15 రోజుల్లో డిశ్చార్జి చేస్తారని సుమలత తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లను మీడియా, పార్టీ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దు, అంబరీష్ ఆరోగ్యం మెరుగుపడిందని సుమలత తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి