హైదరాబాద్: గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు హృదయ స్పందన ఫౌండేషన్ హైదరాబాద్‌లో వాక్ నిర్వహించింది. నెక్లెస్ రోడ్డులోని పీవీఘాట్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన ఈ నడకనకు సినీహీరో పవన్ కల్యాణ్, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ప్రారంభించారు. 'వాక్‌ఫర్ హార్ట్-రిచ్ ఫర్ హార్ట్' పేరిట ఉదయం ప్రారంభమైన నడక కార్యక్రమంలో కళాశాల విద్యార్థులతో పాటు వైద్యులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొని గుండె వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సినీ హీరో వపన్‌కల్యాణ్ చెప్పారు. ఆరోగ్యం బాగుంటే మంచి ఆలోచనలతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలమన్నారు. ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండె వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి