మీర్పూర్: ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచులో పాకిస్తాన్ భారత్ తన ముందు ఉంచిన 246 పరుగుల లక్ష్యాన్ని ఉత్కంఠ మ్యాచులో ఛేదించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచులో చివరలో షాహిద్ అఫ్రిదీ సిక్సర్లతో పాకిస్తాన్‌కు విజయాన్ని అందించాడు. దాంతో పాకిస్తాన్ భారత్‌పై ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. అఫ్రిదీ 18 బంతుల్లో 34 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కగా, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. చివరలో విజయం దోబూచులాడినప్పటిప్పటికీ అఫ్రిదీ భారత్ ఆశలను వమ్ము చేశాడు. రెండు బంతులు మిగిలి ఉండగానే అఫ్రిదీ పాకిస్తాన్‌కు విజయాన్ని అందించాడు. అంతకు ముందు భారత్ తన ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదివారంనాడు రెండు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అహ్మద్ షెహజాద్ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. అంతకు ముందు షర్జీల్ ఖాన్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. పాకిస్తాన్ 96 పరుగుల స్కోరు వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మిస్బావుల్ హక్ ఒక్క పరుగు మాత్రమే చేసి రన్నవుట్ అయ్యాడు. ఉమర్ అక్మల్ అమిత్ మిశ్రా బౌలింగులో నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో పాకిస్తాన్ 113 పరుగుల స్కోరు వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన మొహమ్మద్ హఫీజ్ 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో పాకిస్తాన్ 200 పరుగుల స్కోరు వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో పాకిస్తాన్ 39 బంతుల్లో 46 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఆ తర్వాత మూడు పరుగులు చేసిన తర్వాత మక్సూద్ రన్నవుటయ్యాడు. దాంతో పాకిస్తాన్ 203 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. దాంతో పాకిస్తాన్ విజయానికి 32 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో పడింది. కీలకమైన సమయంలో ఉమర్ గుల్ అవుటయ్యాడు. పాకిస్తాన్ 235 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో పాకిస్తాన్ 9 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. పాకిస్తాన్ 236 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. దీంతో ఆరు బంతుల్లో పది పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. ఆ వెంటనే మరో వికెట్ పడింది. దీంతో ఐదు బంతుల్లో పది పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది. అశ్విన్ వేసిన బంతికి అజ్మల్ ఒక పరుగు తీయగా, ఆ తర్వాత అఫ్రీదీ రెండు సిక్స్‌లు బాది పాకిస్తాన్‌కు విజయాన్ని అందించాడు. ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌లో జరిగిన భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. రవీంద్ర జడెజా(52), అంబటి రాయుడు(58), రోహిత్ శర్మ(56)లు అర్ధ సెంచరీలతో అలరించారు. పాకిస్తాన్ ముందు 246 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. పాక్ బౌలర్లలో అజ్మల్ 3, తల్హా, హఫీజ్‌లు రెండేసి, ఉమర్ గుల్ ఒక వికెట్ తీసుకున్నారు. అంతకుముందు మ్యాచ్ ప్రారంభంలోనే భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 18 పరుగులు ఉన్నప్పుడు శిఖర్ ధావన్ అవుటయ్యాడు. హఫీజ్ బౌలింగులో ఎల్బీడబ్ల్యుగా పెవిలియన్ చేరాడు. ధావన్ 13 బంతుల్లో 10 పరుగులు చేశాడు. అనంతరం 56 పరుగుల వద్ద కోహ్లీ (5) ఉమర్ గుల్ బౌలింగులో అవుటయ్యాడు. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేశాడు. రోహిత్ 45 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. పదిహేను ఓవర్లు ముగిసే వరకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. భారత్ 92 పరుగుల వద్ద రోహిత్(58 బంతుల్లో 56 పరుగులు) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. తర్వాత స్వల్ప వ్యవధిలోనే మరో వికెట్ కోల్పోయింది.103 పరుగుల వద్ద రహానే.. తల్హా బౌలింగులో అవుటయ్యాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి