319 నామినేషన్లు ఒక్కరోజే
అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్ జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో నామినేషన్లు ఊపందుకున్నా యి. ఈ నెల 10వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, బుధవారం ఒక్కరోజే 319 నామినేషన్లు దాఖలయ్యాయి.తొలి రెండురోజుల్లో కేవలం 13 మాత్రమే రాగా, ఇప్పటికి మొత్తం 332 నామినేషన్లు పడ్డాయి.
= తెనాలి పురపాలకసంఘం పరిధిలో 35 నామినేషన్లుపడ్డాయి. వీటిలో సీపీఐ 2, వైఎస్సార్ సీపీ 4, టీడీపీ 25, లోక్‌సత్తా 1, ఇండిపెండెంట్లు 3 దాఖలయ్యాయి.
= నరసరావుపేట పరిధిలో 47 నామినేషన్లు దాఖలు కాగా అందులో వైఎస్సార్ సీపీ 18, టీడీపీ 22, ఇతర పార్టీలు 1, ఇండిపెండెంట్లు 6 ఉన్నాయి.
= చిలకలూరిపేట పరిధిలో 22 నామినేషన్లు రాగా అందులో వైఎస్సార్ సీపీ 4, టీడీపీ 14, ఇండిపెండెంట్లు 4 ఉన్నాయి.
= బాపట్ల పరిధిలో 12 రాగా అందులో కాంగ్రెస్‌పార్టీ 1, వైఎస్సార్ సీపీ 1, టీడీపీ 7, ఇండిపెండెంట్లు 3 ఉన్నాయి.
= పొన్నూరు పరిధిలో 35 రాగా వైఎస్సార్ సీపీ 6, టీడీపీ 28, ఇండిపెండెంటు 1 ఉన్నాయి.
= రేపల్లె పరిధిలో 20 నామినేషన్లు రాగా అందులో కాంగ్రెస్ 8, వైఎస్సార్ సీపీ 5, టీడీపీ 7 ఉన్నాయి.
= మాచర్ల పరిధిలో 8 రాగా సీపీఎం 1, వైఎస్సార్ సీపీ 3, టీడీపీ 2, ఇతర పార్టీ లు 1, ఇండిపెండెంట్ 1 ఉన్నాయి.
= మంగళగిరి పరిధిలో 35 రాగా సీపీఐ 6, సీపీఎం 5, కాంగ్రెస్ 3, వైఎస్సార్‌సీపీ 11, టీడీపీ 7, ఇండిపెండెంట్లు 3 ఉన్నాయి.
= సత్తెనపల్లి పరిధిలో 28 రాగా కాంగ్రెస్ 2, వైఎస్సార్ సీపీ 5, టీడీపీ 5లు ఉన్నాయి.
= వినుకొండ పరిధిలో 15 రాగా కాంగ్రెస్ 4, వైఎస్సార్ సీపీ 3, టీడీపీ 4, ఇండిపెండెంట్లు 4 ఉన్నాయి.
= తాడేపల్లి పరిధిలో 74 రాగా అందులో సీపీఎం 10, కాంగ్రెస్ 23, వైఎస్సార్ సీపీ 30, టీడీపీ 6, ఇండిపెండెంట్లు 5 ఉన్నాయి.
= పిడుగురాళ్లలో 15వ వార్డుకు టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు చేసిన
చైర్మన్ అభ్యర్థులు
= నరసరావుపేట పురపాలక సంఘానికి చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ తరపున 1వ వార్డు నుంచి ఎన్‌ఈసీ కళాశాల అధినేత మిట్టపల్లి కోటేశ్వరరావు తనయుడు మిట్టపల్లి రమేష్, టీడీపీ తరఫున 16వ వార్డు నుంచి ప్రముఖ బంగారు వ్యాపారి నాగసరపు సుబ్బరాయగుప్తాలు నామినేషన్లు దాఖలు చేశారు.
= మాచర్లలో చైర్మన్ అభ్యర్థిగా 15వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున పోలూరి పద్మావతి నామినేషన్ వేశారు.
= రేపల్లెలో చైర్మన్ అభ్యర్థిగా 11వ వార్డు నుంచి టీడీపీ తరఫున గోగినేని పట్టాభిరామారావు నామినేషన్ దాఖలు చేశారు.
= బాపట్లలో చైర్మన్ అభ్యర్థిగా 19వ వార్డు నుంచి టీడీపీ తరఫున తోట మల్లేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.
= మంగళగిరి చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున చిల్లపల్లి వెంకటనాగమోహన్‌రావు, కాంగ్రెస్‌పార్టీ తరఫున ఇదే వార్డు నుంచి కొల్లి శ్రీనివాసచక్రవర్తి నామినేషన్ దాఖలు చేశారు.
= తాడేపల్లి చైర్మన్ అభ్యర్థిగా 5వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున కొయ్యగూర మహాలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.
= పొన్నూరు చైర్మన్ అభ్యర్థిగా 16వ వార్డు నుంచి టీడీపీ తరఫున సజ్జా హేమలత నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి