నువ్వా-నేనా అనేలా....
దేవిశ్రీ ప్రసాద్ జనరంజకమైన సంగీతాన్ని అందించాడు. దేవిశ్రీ తండ్రిగారు సత్యమూర్తి, నేను చాలా సినిమాలకు పనిచేశాం. అప్పుడు దేవిశ్రీ చాలా చిన్నపిల్లాడు. ఇప్పుడు తన ఎదుగుదల చూస్తుంటే ఆనందంగా ఉంది. జగపతిబాబుది ఇందులో విలన్ పాత్ర అని నేను అనను. మా ఇద్దరి పాత్రలూ నువ్వా- నేనా అనేలా ఉంటాయి. పంచభక్ష్యపరమాన్నాలతో వడ్డించిన విస్తరిలా సినిమాను మలిచాడు బోయపాటి’’ అని చెప్పారు. ‘‘ ‘బాబులకే బాబు లాంటివాడు బాలయ్యబాబు. ఆయన ముందు నన్ను ‘బాబు’ అని పిలవొద్దు’ని సెట్‌లోకి రాగానే అందరికీ చెప్పాను. కానీ అందరూ నన్ను ‘బాబు’ అనే పిలుస్తున్నారు. ఎందుకు అనడిగితే... ‘బాలయ్యే మిమ్మల్ని బాబు అని పిలుస్తున్నారండీ. ఇక మేం పిలవకపోతే ఎలా’ అన్నారంతా. దటీజ్ బాలయ్య. నేను ఇప్పటివరకూ బాలయ్యను యాక్టర్ మాత్రమే అనుకున్నాను. కానీ ఆయన న్యూక్లియర్ రియాక్టర్ అని ఆయనతో పనిచేశాక తెలిసింది’’ అని జగపతిబాబు అన్నారు.
బాలకృష్ణతో పనిచేయడం ఆనందంగా ఉందని, ఈ సినిమాతో అందరు హీరోలతో పనిచేసిన క్రెడిట్ తనకు దక్కిందని దేవిశ్రీప్రసాద్ ఆనందం వెలిబుచ్చారు. యూనిట్ సభ్యులతో పాటు రాజమౌళి, బాలకృష్ణ అల్లుళ్లు లోకేష్, శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.
సంచలనాల 'లెజెండ్'
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన 'లెజెండ్' సినిమా విడుదలకు ముందే సంచలనాలు రేపుతోంది. బుధవారం అభిమాని చేతుల మీదుగా విడుదల చేసిన లెజెండ్ టీజర్ కు మంచి ఆదరణ లభించింది. సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో దీన్ని అభిమానులు వీక్షించారు. 26 సెకనుల నిడివున్న ఈ ప్రచార చిత్రాన్ని 12 గంటల్లోపు సుమారు 120000 మంది పైగా వీక్షించినట్టు చెబుతున్నారు. చేతిలో తుపాకీ పట్టుకుని బాలకృష్ణ ఠీవిగా కూర్చున్నట్టుగా ఇందులో చూపించారు. బాలయ్య మెడ మీద టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టీజర్ కు మంచి ఆదరణ లభించడం పట్ల దర్శకుడు బోయపాటి శ్రీను సంతోషం వ్యక్తం చేశారు. 'లెజెండ్' తప్పకుండా మంచి సినిమా అవుతుందని చెప్పారు. దేవీశ్రీ ప్రసాద్ మంచి సంగీతం అందించాడని తెలిపారు. బాలయ్యను కొత్తగా ప్రమోట్ చేయడానికి టాటూ వేశామని వెల్లడించారు. బాలయ్య కోసం ప్రత్యేకంగా బైకు, సఫారీ కారు తయారు చేయించామని బోయపాటి తెలిపారు. మార్చి 7న ఆడియోను విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. మార్చి 28న 'లెజెండ్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి