7, మార్చి 2014, శుక్రవారం

నాన్నకే నా సపోర్ట్.. బాబాయ్ కి 'రాం రాం' చరణ్
పవన్ కళ్యాణ్ పెట్టబోయే రాజకీయ పార్టీపై చిరంజీవి తనయుడు రాం చరణ్ స్పందించారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు తన మద్దతు ఉంటుందని.. అయితే నాన్నకే తన సపోర్ట్ అని వ్యాఖ్యానించారు. అయితే తనకు రాజకీయాలపై అవగాహన లేదు అని రాం చరణ్ అన్నారు. నాదారి నాదే.. బాబాయి దారి బాబాయిదే అని రాం చరణ్ వ్యాఖ్యలు చేశారు. చిన్నతనం నుంచి నాన్న నాకు సపోర్ట్ గా ఉన్నారు.. అలాగే నేను ఎప్పుడూ నాన్నకే సపోర్ట్ చేస్తాను అని అన్నారు. కుటుంబంలో ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే.. ఎవరి ఇష్టం వారిదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఆయన వ్యక్తిగతం అని అన్నారు. 
 
ఇటీవల కాలంలో మెగాస్టార్ కుటుంబంలో విబేధాలు ఉన్నాయనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ చిత్రం ప్రారంభ కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడకోకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా, మార్చి 14 తేదిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ ప్రవేశంపై ఓ ప్రకటన చేయనున్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి