1, మే 2015, శుక్రవారం

Idi-MayaLokam: Runa Vimochana Narasimha Stotram ఋణ విమోచన నృసిం...

Idi-MayaLokam: Runa Vimochana Narasimha Stotram

ఋణ విమోచన నృసిం...
: Runa Vimochana Narasimha Stotram ఋణ విమోచన నృసింహ స్తోత్రం దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ...
Runa Vimochana Narasimha Stotram

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ ||

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౫ ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౬ ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౭ ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౮ ||

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || ౯ ||

28, ఏప్రిల్ 2015, మంగళవారం

Runa Vimochana Angaraka Stotram in Telugu


స్కంద ఉవాచః
ఋణగ్రస్తనరాణాం తు ఋణముక్తిః కథం భవేత్
బ్రహ్మోవాచః వక్ష్యే హం సర్వ లోకానాం - హితార్థం హితకామదం
శ్రీ మదంగారక స్తోత్రమహామంత్రస్య - గౌతమ ఋషిః - అనుష్ఠుప్ ఛందః
అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్థే జపే వినియోగః

ధ్యానం
రక్తమాల్యాంబరధరః - శూలశక్తిగదాధరః
చతుర్భుజో మేషగతో - వరదశ్చ ధరాసుతః
మంగళో భూమిపుత్రశ్చ - ఋణహర్తా ధనప్రదః
స్థిరాసనో మహాకాయః - సర్వకామ ఫలప్రదః
లోహితో లోహితాక్షతశ్చ - సామగానాం కృపాకరః
ధరత్మజః కుజోభౌమో - భూమిజో భూమినందనః
అంగారకో యమశ్చైవ - సర్వరోగాపహారకః
సృష్టేః కర్తాచ హర్తాచ - సర్వదేవైశ్చ పూజితః
ఏతాని కుజనామాని -  నిత్యం యః ప్రయతః పఠేత్
ఋణం న జాయతే తస్య - ధనం ప్రాప్నో త్య సంశయం
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు వినాశయ
రక్తగంధైశ్చ పుష్పైశ్చ - ధూపదీపైర్గుడోదకైః
మంగళం పూజయిత్వా తు - దీపం దత్వా తదంతికే
ఋణరేఖాః ప్రకర్తవ్యా - అంగారేణ తదగ్రతః
తాశ్చ ప్రమార్జయే త్పశ్చాత్ - వామపాదేన సంస్పృశన్
మూలమంత్రం
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు విమోచయ
ఏవంకృతే న సందేహో - ఋణం హిత్వా ధనీ భవేత్
మహతీం శ్రియ మాప్నోతి - హ్యపరో ధనదో యథా
అర్ఘ్యము
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు విమోచయ
భూమిపుత్ర మహాతేజ - స్స్వేదోద్భవ పినాకినః
ఋణార్త స్త్వాం ప్రపన్నోస్మి - గృహాణార్ఘ్యం నమోస్తుతే
ఇతి ఋణవిమోచకాంగారక స్తోత్రం

27, ఏప్రిల్ 2015, సోమవారం

Pratah Smarana Stotram in Telugu


ప్రాతఃస్మరణస్తోత్రం
ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్ |యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం
తద్బ్రహ్మ నిష్కళమహం న చ భూతసంఘః || ౧ ||

ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం
వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ |
యన్నేతినేతి వచనైర్నిగమా అవోచుః
తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యమ్ || ౨ ||
ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం
పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యమ్ |
యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై || ౩ ||
శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణమ్
ప్రాతః కాలే పఠేద్యస్తు స గచ్ఛేత్పరమం పదమ్ ||

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

ఏపీ వాహనాలకి షాక్.... ట్యాక్స్ కట్టాల్సిందే ..?

హైదరాబాద్: అంతర్రాష్ట్ర పన్ను పైన హైకోర్టులో వాహన యజమానులకు ఒకింత షాక్ తగిలింది. రవాణా పన్ను చెల్లించాల్సిందేనని, అయితే, ఆ ట్యాక్స్ మొత్తాన్ని బ్యాంకులలో జమ చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య
అంతర్రాష్ట్ర పన్ను రగడ సాగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుండి తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుండి వచ్చే వాహనాల పైన అంతర్రాష్ట్ర పన్ను విధిస్తోంది. దీని పైన పలు ప్రయివేటు వాహనాల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం పది రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టును ఆశ్రయించిన వాహన యజమానులు ట్యాక్స్ చెల్లించవద్దని సూచించింది. ఇది న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికే వర్తిస్తుందని తెలిపింది.

కేసు తదుపరి విచారణను  న్యాయస్థానం జరిపింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా పన్ను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ట్యాక్సును బ్యాంకుల్లో జమ చేయాలని సూచించింది. ఆ డబ్బులు దేనికీ వాడవద్దని షరతు విధించింది. ఇది కోర్టును ఆశ్రయించిన వాహన యజమానులకే వర్తిస్తుందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది.


పవర్ స్టార్ పవర్ ట్విట్ ?
హైదరాబాద్ : తాజాగా తను సపోర్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఉద్యమం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారనే విషయం అందరినీ షాక్ ఇస్తోంది. ఈ విషయమై ఆయన ట్వీట్ చేసి అంతటా చర్చనీయాంశంగా మారారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ 2 ప్రారంభమవుతుందనుకునే ఈ సమయంలో ఈ ట్వీట్ రావటం అందరినీ షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ ...దాదాపు సినిమాలు తగ్గిస్తూ వచ్చారు. గత సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ సంవత్సరం రిలీజైన గోపాల గోపాల లో ఇంకో హీరో ఉన్నారు. సోలో హీరోగా పవన్ నుంచి సినిమా నుంచి వస్తుందని ఆశించిన వారుకి పవన్ ట్వీట్ ఆశ్చర్యానకి గురి చేసింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటీ..అంటే పవన్ ట్వీట్ చేస్తూ... ‘ఈ రోజు మీడియా వార్తలు ప్రకారం(అం.ప్ర) ప్రభుత్వం,రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు మీద భూసేఖరణ చట్టం ప్రయోగించనున్నట్టు హైకోర్టుకి తెలిపారు. ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి నేను సిద్ధంగా వున్నానని' ట్వీట్ చేసాడు.

చంద్రబాబు ప్రభుత్వంతో పవన్ దోస్తానా కట్ చేస్తాడా.. ? స్వయంగా పొలిటికల్ చదరంగంలోకి దూసుకుపోవాలనుకుంటున్నా.. ?? మరో ఇతర కారణలేమైనా వున్నాయా.. ??? అంటూ పవన్ ఫ్యాన్స్ సైతం ఉత్కంఠగా కూపిలాగే పనిలో వున్నారు. ఏదేమైనా పవన్ మరోసారి ప్రెస్ ముందుకొస్తేగానీ సందేహాలు తీరేలా లేవు.

9, ఏప్రిల్ 2015, గురువారం


Story :
Satyamurthy (Prakash Raj) is a kind-hearted rich man with principles, who helps people around him. Viraj Anand (Allu Arjun) is his son, who lives a carefree life in foreign. His world shatters when his father Satyamurthy passes away in an unfortunate accident, leaving behind huge debt. Due to this, the family responsibility falls on Viraj. He becomes a wedding planner to clears his father’s debt. He meets Sameera aka Subbalakshmi (Samantha) at an event and falls in love with her. But when he meets her father (Rajendra Prasad), the latter assigns him the task of bringing some disputed land documents from a factional leader Devaraj (Upendra), if he wants to marry his daughter. Here the story takes an interesting twist !
What Viraj has done to win his love ? How Viraj restores the name and fame of his family ? What is the twist in the tale ? How are the other Heroines Nithya Menon and Adah Sharma connected to Allu Arjun ? All these form the crux of the story.
Artists Performance:

Allu Arjun: He excelled as an actor and given his career best performance in few scenes, especially the sequence where Protagonist explains to Samantha about his Father. Upped the Style Quotient, Maintained Dignity, Exhibits Emotions to Perfection and Danced Superbly to walk away with the top honors.

Samantha as the Love Interest of Protagonist is good enough. Adah Sharma looks gorgeous. Upendra as Devaraj, a powerful village strongman, is just perfect. Sneha is apt for the role of Devaraj's Wife. Nithya Menon makes her presence felt playing Devaraj's Sister. Rajendra Prasad produces few laughs with his mannerisms and comic timing. Brahmanandam excels in few scenes. Ali plays a full-length role. Kota Srinivas Rao, Rao Ramesh, Sampath and MS Narayana have done justice to their roles

'సన్నాఫ్‌ సత్యమూర్తి' రివ్యూ

300 కోట్లు ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ సత్యమూర్తి(ప్రకాష్ రాజ్) గారి అబ్బాయి విరాజ్ ఆనంద్(అల్లు అర్జున్). సత్యమూర్తి గారు ఓ యాక్సిడెంట్ లో హఠాత్తుగా చనిపోవటంతో...ఒక్కసారిగా ఆస్దులు..అప్పులు లెక్కల్లో ...ఆస్ది అంతా కొట్టుకుపోయి...రోడ్డు మీద కుటుంబం పడే పరిస్ధితి వస్తుంది. అయితే విరాజ్ ఆనంద్ ఎదురుగా ఓ ఆప్షన్ ఉంటుంది. ఆ అప్పులు కట్టనని ఎగ్గొట్టే మార్గం ఉంటుంది. కానీ తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, ఆయన ఇచ్చిన విలువలే ఆస్దిగా నమ్మే విరాజ్ ఆనంద్... అందుకు ఒప్పుకోక...అప్పులు తీర్చి... సామాన్యుడులా మారి వెడ్డింగ్ ప్లానర్ గా మారి కుటుంబాన్ని లాగుతూంటాడు. 
ఈ క్రమంలో ఓ పెళ్లిలో అతను..సమీర(సమంత)తో ప్రేమలో పడతాడు. అయితే సమీత తండ్రి సాంబశివరావు(రాజేంద్ర ప్రసాద్) డబ్బే జీవితం అనుకునే మనిషి. అతనికి కి మొదటి నుంచి విరాజ్ ఆనంద్ అంటే పడదు. దాంతో తన కూతురుతో ప్రేమ ఓకే చేయాలంటే....సత్యమూర్తి గారి ద్వారా తాను నష్టపోయిన ఆస్ది కు చెందిన కాగితాలు తెచ్చిఇవ్వాలనే కండీషన్ పెడతాడు. దాన్ని తెచ్చి ఇవ్వాలంటే దేవరాజ్ నాయుడు (ఉపేంద్ర)ని విరాజ్ ఆనంద్ ఎదుర్కోవాలి. రాయలసీమ - తమిళనాడు బార్డర్ లో ఉండే దేవరాజ్ ఆనంద్ సామాన్యుడు కాడు...అతను... ఓ ప్రెవేట్ సైన్యాన్ని నడుపుతూంటాడు. అలాంటి వాడి దగ్గర నుంచి ఆ ఆస్ధి ఎలా తెచ్చాడు..తన తండ్రి..పరువు ఎలా నిలబెట్టాడు. తను ప్రేమించిన అమ్మాయిని ఎలా పొందాడు అనేది మిగతా కథ.
ఫైనల్ గా తల్లి,తండ్రుల ఇచ్చిన విలువలే పిల్లలకు ఆస్దులు అనే థిన్ స్టోరీలైన్ తో పెద్ద హీరోకు కథ చేసే ధైర్యానికి త్రివిక్రమ్ ని అభినందించాలి. అయితే వినోదం మరింతగా పెట్టుకుని ఉంటే ..విలువలకు మరింత విలువ వచ్చి ఉండేది.

8, ఏప్రిల్ 2015, బుధవారం

Krishnam Kalaya Sakhi

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం
కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలమ్ అఖిల సత్యం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల
కృష్ణం కలయ సఖి సుందరం
దామోదరమ్ అఖిల కామాకరంగన శ్యామాకృతిమ్ అసుర భీమం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

3, మే 2014, శనివారం

‘తల్లిని సుఖపెట్టడం’- అంటే అర్ధం  చెప్పు పవన్‌!
పవన్‌ కల్యాణ్‌ ను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. మాతృత్వం పట్ల ఆయనకు మమకారం ఉంది. తల్లి ఎవరికైనా తల్లే! వైఎస్‌ జగన్‌ను తాను రాజకీయ శత్రువుగా పరిగణిస్తున్నప్పటికీ.. ఆయన తల్లి విజయమ్మ పట్ల మాత్రం.. పుత్రప్రేమనే కనబరుస్తున్నాడు. ఆ తల్లి ఎన్నికల ప్రచారంలో కష్టపడుతున్నదని పాపం పవన్‌ ఆవేదన చెందుతున్నాడు.  అయితే తాను సెలబ్రిటీని అనే ఒక భ్రమలో.. నాలుగుగోడల మధ్య, మాత్రమే బతకడానికి అలవాటు పడిన పవన్‌కల్యాణ్‌లో సామాజిక అంశాల గురించిన అజ్ఞానం వలన ఆయన అలా మాట్లాడుతున్నారు అనుకోవాల్సి వస్తోంది. పవన్‌ పదేపదే విజయమ్మమీద జాలి కురిపించడం చూస్తోంటే.. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు.. నీకెందుకు బయ్యా అని కొందరు అనవచ్చు గానీ.. ఆయన ఒక్క సంగతి వివరణ చెప్పాలి.  
ఇంతకూ అమ్మను సుఖపెట్టడం అంటే ఏమిటి? కనీసం ఈ ఒక్క ప్రశ్నకు పవన్‌ కల్యాణ్‌ వద్ద సరైన జవాబు ఉన్నదా? అమ్మను సుఖపెట్టడం అంటే.. ఆమెను ఇంట్లోంచి బయటకు కదలనివ్వకుండా ఒక మూల కూర్చోబెట్టి.. ముప్పొద్దుల్లా తిన్నంత తిండిపెట్టి, ఆరోగ్యావసరాలకు డాక్టరు వద్దకు తీసుకెళుతూ.. ఇతరత్రా సేవలు చేయడం మాత్రమేనా? మామూలు గృహిణులుగానే బతికి అలాగే రిటైరైన పవన్‌ అమ్మలాంటి వారి విషయంలో ఆయన సిద్ధాంతం నిజమే కావొచ్చు. కానీ ఈ రాష్ట్రానికి తిరుగులేని జనరంజక పాలన అందించిన ఒక ముఖ్యమంత్రి కి భార్య, రాజకీయ చైతన్యం ఉన్న కుటుంబానికి ఆమె పెద్దదిక్కు.. అలాంటి రాజకీయ చైతన్యం ఉన్న మహిళను వంటింటికి, లేదా ఇంట్లోని విశ్రాంతి గదికి పరిమితం చేయడం అనేది.. ఆమెలో ఉన్న శక్తులను బలవంతంగా అణిచేసినట్లు అనిపించుకోదా? స్త్రీజాతికి పవన్‌ కల్యాణ్‌ ఇచ్చే విలువ ఇదేనా? ఒకే స్త్రీ.. భార్య స్థానంలో ఉంటే ఎన్నికల్లో పోటీచేయడానికి తిరగడానికి అర్హురాలు, తల్లి స్థానంలో ఉంటే అనర్హురాలు అవుతుందా? తల్లి స్థానానికి వచ్చిన తర్వాత.. విశ్రాంతి తప్ప రాజకీయ చైతన్యం అధికారం అనేవి ఆమెకు ఎప్పటికీ దక్కకుండా చేయడం కొడుకు బాధ్యత అనుకోవాలా? 

బహుశా పవన్‌ కల్యాణ్‌ లాంటి అవకాశవాద కొడుకు ఉంటే మాత్రం.. అలాగే చేసేవాడేమో? అమ్మ ద్వారా తనుకు రాజకీయ చైతన్యం సంక్రమించినా.. సరే, తన పబ్బం గడవగానే.. అమ్మను వంటింటికి పరిమితి చేసేవాడేమో. కానీ జగన్‌ అలాకాదు.. తన తల్లి విలువను, సమాజానికి సేవ చేయడంలో ఆమె చిత్తశుద్ధిని ప్రజలకు ఆమె అవసరాన్ని తెలిసిన వాడు. అందుకే ఎమ్మెల్యేగా ఉన్న తల్లిని.. ఎంపీగా ఢిల్లీ చట్టసభకు పంపే పనిలో ఉన్నాడు. ఈ సత్యాన్ని అజ్ఞానాంధకారం కళ్లలో నిండిన పవన్‌ గుర్తించలేకపోవచ్చు... కానీ ప్రజలందరికీ ఈ విషయం తెలుసని పవన్‌ గ్రహించాలి. 
అంటే ఏంటి పవన్‌బాబూ!
‘రాజధానిని నిర్మించడానికి అనుభవం కావాలి.. అందుకనే నేను చంద్రబాబునాయుడుకు మద్దతు ఇచ్చా...’ అంటూ పవన్‌ కల్యాణ్‌ పదేపదే అంటున్నారు. మొత్తం సీమాంధ్ర సభల్లో ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేయడానికి.. టోకుగా చుట్టబెట్టేస్తున్న పవన్‌కల్యాణ్‌.. ప్రతి చోటా చంద్రబాబును మించిన ఉక్రోషంతో వైఎస్‌ జగన్‌ను తూర్పారపట్టేస్తున్నారు పవన్‌ కల్యాణ్‌!  సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించడానికి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలని.. అందుకే తాను చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నానని పవన్‌ కల్యాణ్‌ పదేపదే ప్రకటిస్తున్నారు. అనుభవం.. అనుభవం.. అంటున్నారు. అక్కడికేదో.. ముఖ్యమంత్రి పదవిలో ఎక్కువ కాలం ఉండడమే ప్రాతిపదిక అన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజధానిని నిర్మాణానికి అనుభవం ఉండాలంటే.. అదేమీ ఇటుకలతో గోడ కట్టడం కాదు కదా.. అనుభవం ఉన్న మేస్త్రీనా? లేని మేస్త్రీనా? అని బేరీజు వేసుకోవడానికి. అది కార్యనిర్వహణ సామర్థ్యానికి సంబంధించిన వ్యవహారం మాత్రమే. ఒక విషయంలో తన పరిణతిని ప్రూవ్‌ చేసుకున్న వారు మరో విషయంలోనూ అలా చేయగలరు! రాజధాని నిర్మాణం అంటే.. చంద్రబాబు తాపీ పట్టుకుని నిర్మించనక్కర్లేదని.. నిపుణులు- నిజాయితీ ఉన్న అధికారులు, అనుచరుల్ని నమ్మితే.. అద్భుతాలు సృష్టించవచ్చునని ఎవరైనా చెప్పగలరు! అయితే చంద్రబాబుకు అసలు మనుషుల్ని నమ్మే అలవాటే లేదు కదా! ఆయన అసలేం చేయగలరు అనేది అందరి అనుమానం.  దాన్ని పక్కన పెడితే.. అసలు అనుభవం అనేది ఒక్కటే పనిని సక్సెస్‌ఫుల్‌గా చేయడానికి గీటురాయి కానక్కర లేదని పవన్‌కల్యాణ్‌ సొంత అనుభవాలన్నీ చెబుతున్నాయి. బహుశా ఆయనకు రాజకీయాలకంటె సినిమా పరిభాషలో చెబితే బాగా అర్థం కావచ్చు.  ఆయన హీరో కెరీర్‌లో అద్భుతాలు సృష్టించిన చిత్రాలన్నీ అనుభవశూన్యులు ఇచ్చినవే. తొలిప్రేమ కరుణాకరన్‌, తమ్ముడు అరుణ్‌ప్రసాద్‌, బద్రి పూరీ జగన్నాధ్‌ వంటి అనుభవ శూన్యులే ఆయనను జీవితంలో హీరోగా నిలబెట్టారు. ఖుషి, గబ్బర్‌సింగ్‌, జల్సా వంటి హిట్‌లు ఇచ్చిన సమయానికి కూడా ఆయా దర్శకులకు ఒకటి రెండు సినిమాలకు మించిన అనుభవం లేదు.  అనుభవమే ముఖ్యం అని పవన్‌ నమ్మేట్లయితే.. కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కెఎస్‌ఆర్‌దాస్‌, కోడి రామకృష్ణ, బిగోపాల్‌ లాంటి వారితోనే తీసుకోలేకపోయారా? అనేది జనం సందేహం. కాబట్టి పవన్‌ కల్యాణ్‌ తన విషయంలో అయితే అనుభవం కంటె టేలెంటు ముఖ్యమని నమ్ముతారు. జనం ఎలా  చస్తే మనకేంటిలే అనే భావన ఉన్నవాడు గనుక.. టేలెంటు చిత్తశుద్ధితో నిమిత్తం లేకుండా చంద్రబాబుకు ఓటు వేయమని సలహా ఇస్తాడు.  అసలు పవన్‌ మరో సంగతి తెలుసుకోవాలి. అనుభవం ముదిరితే.. వార్ధక్యం వస్తుంది. అందుకే ఇప్పుడు కె.రాఘవేంద్రరావు లాంటి వాళ్లు జనం నాడి పట్టే సినిమాలు తీయలేకపోతున్నారు. కోదండరామిరెడ్డి, ముత్యాలసుబ్బయ్య లాంటి వాళ్లు మానుకున్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద నమ్మకం ఉంటే.. చంద్రబాబును కూడా రిటైర్‌ కమ్మని సలహా ఇస్తే మంచిది.