10, ఏప్రిల్ 2015, శుక్రవారం

పవర్ స్టార్ పవర్ ట్విట్ ?
హైదరాబాద్ : తాజాగా తను సపోర్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఉద్యమం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారనే విషయం అందరినీ షాక్ ఇస్తోంది. ఈ విషయమై ఆయన ట్వీట్ చేసి అంతటా చర్చనీయాంశంగా మారారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ 2 ప్రారంభమవుతుందనుకునే ఈ సమయంలో ఈ ట్వీట్ రావటం అందరినీ షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ ...దాదాపు సినిమాలు తగ్గిస్తూ వచ్చారు. గత సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ సంవత్సరం రిలీజైన గోపాల గోపాల లో ఇంకో హీరో ఉన్నారు. సోలో హీరోగా పవన్ నుంచి సినిమా నుంచి వస్తుందని ఆశించిన వారుకి పవన్ ట్వీట్ ఆశ్చర్యానకి గురి చేసింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటీ..అంటే పవన్ ట్వీట్ చేస్తూ... ‘ఈ రోజు మీడియా వార్తలు ప్రకారం(అం.ప్ర) ప్రభుత్వం,రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు మీద భూసేఖరణ చట్టం ప్రయోగించనున్నట్టు హైకోర్టుకి తెలిపారు. ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి నేను సిద్ధంగా వున్నానని' ట్వీట్ చేసాడు.

చంద్రబాబు ప్రభుత్వంతో పవన్ దోస్తానా కట్ చేస్తాడా.. ? స్వయంగా పొలిటికల్ చదరంగంలోకి దూసుకుపోవాలనుకుంటున్నా.. ?? మరో ఇతర కారణలేమైనా వున్నాయా.. ??? అంటూ పవన్ ఫ్యాన్స్ సైతం ఉత్కంఠగా కూపిలాగే పనిలో వున్నారు. ఏదేమైనా పవన్ మరోసారి ప్రెస్ ముందుకొస్తేగానీ సందేహాలు తీరేలా లేవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి