10, ఏప్రిల్ 2015, శుక్రవారం

ఏపీ వాహనాలకి షాక్.... ట్యాక్స్ కట్టాల్సిందే ..?

హైదరాబాద్: అంతర్రాష్ట్ర పన్ను పైన హైకోర్టులో వాహన యజమానులకు ఒకింత షాక్ తగిలింది. రవాణా పన్ను చెల్లించాల్సిందేనని, అయితే, ఆ ట్యాక్స్ మొత్తాన్ని బ్యాంకులలో జమ చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య
అంతర్రాష్ట్ర పన్ను రగడ సాగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుండి తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుండి వచ్చే వాహనాల పైన అంతర్రాష్ట్ర పన్ను విధిస్తోంది. దీని పైన పలు ప్రయివేటు వాహనాల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ ప్రారంభించిన న్యాయస్థానం పది రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టును ఆశ్రయించిన వాహన యజమానులు ట్యాక్స్ చెల్లించవద్దని సూచించింది. ఇది న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికే వర్తిస్తుందని తెలిపింది.

కేసు తదుపరి విచారణను  న్యాయస్థానం జరిపింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా పన్ను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ట్యాక్సును బ్యాంకుల్లో జమ చేయాలని సూచించింది. ఆ డబ్బులు దేనికీ వాడవద్దని షరతు విధించింది. ఇది కోర్టును ఆశ్రయించిన వాహన యజమానులకే వర్తిస్తుందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి