2, మార్చి 2014, ఆదివారం

ఏప్రిల్ 7 నుంచి ఎన్నికలు

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసి) సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కు తుదిమెరుగులు దిద్దుతోంది. ఈ విషయమై ఈసి అధికారులు కేంద్ర హోంశాఖ అధికారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. రెండు మూడు రోజులలో ఎన్నికల షెడ్యూల్ కు తుదిరూపం తీసుకువస్తారు.  

 దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.  ఏప్రిల్ 2వ వారం నుంచి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 7-10 మధ్య మొదటి విడత పోలింగ్ జరుగుతుందని  ఈసీ వర్గాల సమాచారం.  బుధవారం లేదా గురువారం ఎన్నికల షెడ్యూలు విడుదల చేస్తారు.  ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి