2, మార్చి 2014, ఆదివారం

మరో మల్టిస్టారర్ సినిమా వెంకి-రవితేజ 

హైదరాబాద్ : వెంకటేష్ మరో మల్టి స్టారర్ చిత్రం కమిటయ్యాడనే వార్తలు ఫిల్మ్ సర్కిల్సో లో వినిపిస్తున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు చిత్రంతో మల్టి స్టారర్ చిత్రాలకు మళ్లీ చాలా కాలం తర్వాత ఈ తరంలో శ్రీకారం చుట్టిన వెంకటేష్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి. ఈ సారి రవితేజతో ఆయన కలిపి చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వీరూ పోట్ల దర్శకత్వం వహించే అవకాసం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఓ మైగాడ్ చిత్రం తర్వాత ఈ చిత్రం ప్రారంభించే అవకాసం ఉందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్టయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారికంగా ఏ విధమైన ప్రకటనా ఇంతవరకూ లేదు. ఇక వెంకటేష్‌, మీనా మరోసారి జోడీ కట్టబోతున్నారని సమాచారం. శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఈ జోడీ ప్రేక్షకుల్ని అలరించబోతోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యమ్‌'కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతుంది. మాతృకలోనూ మోహన్‌లాల్‌ సరసన నటిచింది మీనానే. అందులో మీనా నటనని చూసిన దర్శక,నిర్మాతలు ఈ సినిమాకి కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంచుకోవాలని నిర్ణయించారని సమాచారం. అలాగే నదియా ఈ చిత్రంలో కీలకమైన పాత్ర అయిన పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తారు. 
మరో ప్రక్క రవితేజ హీరోగా రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హన్సిక హీరోయిన్. కె.ఎస్‌.రవీంద్రనాథ్‌ (బాబి) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ చిత్రంలో రవితేజ ..పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. రవితేజ సూపర్ హిట్ విక్రమార్కుడుని పోలిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. డ్యూయిల్ రోల్ పాత్రను మరోసారి పోషిస్తున్నాడని,అయితే పూర్తి స్ధాయి ఎంటర్ట్నైమెంట్ తో ట్రీట్ మెంట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి పవర్ అనే టైటిల్ పెట్టారు. రవితేజ మాట్లాడుతూ ''నాలుగేళ్ల క్రితం నుంచి రాక్‌లైన్‌ వెంకటేష్‌తో పరిచయముంది. మంచి కథ దొరికితే ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకొన్నాం. అది ఇప్పటికి కుదిరింది. బాబీ తయారు చేసిన కథ చాలా బాగుంది. అతనితో 'బలుపు' సమయంలోనే పరిచయం ఏర్పడింది. అప్పుడే ఈ కథ గురించి చెప్పాడు. బాగా నచ్చింది. అతని రూపంలో ఇంకొక కొత్త దర్శకుడు పరిచయం అవుతుండడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటివాళ్లు మరింత మంది రావాలి'' అన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి