బాబుకి వేరే ఆప్షన్ లేవ్ ...
భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోడానికి ముందు చాలా గొంతెమ్మ కోర్కెలను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఏనాడూ భారతీయ జనతా పార్టీకి ‘ప్రధాన పార్టీ’ అన్న ముద్ర లేదు. తెలంగాణలో తప్ప, సీమాంధ్రలో ఆ పార్టీకి ప్రాభవం లేదు. సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ. అలాంటి బీజేపీ ఈసారి, డబుల్ డిజిట్ సాధించేస్తామన్న ధీమాతో వుంది. ఆ ధీమాతోనే, టీడీపీ ముందు గొంతెమ్మ కోర్కెలు వుంచింది.
తెలంగాణ అంశం కారణంగా తెలంగాణలో తమకు కలిసి వస్తుందని భావించిన చంద్రబాబు, బీజేపీ గొంతెమ్మ కోర్కెలను తీర్చేందుకు ఒప్పుకోక తప్పలేదు. అయినప్పటికీ, సీమాంధ్రలో బీజేపీ కోరినన్ని సీట్లను చంద్రబాబు కేటాయించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఎన్ని చోట్ల పోటీ చేసినా, బీజేపీకి డబుల్ డిజిట్ వచ్చే అవకాశం లేదన్నది విశ్లేషకుల వాదన. అలాంటప్పుడు చంద్రబాబు, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు.? వారి కోరికలను ఎందుకు అంగీకరించినట్టు.?
సమాధానం సింపుల్. 2004, 2009లాగానే ఈసారి కూడా తేడా కొడితే నెపాన్ని తేలిగ్గా బీజేపీపైకి నెట్టేయొచ్చని చంద్రబాబు భావిస్తున్నారట. అంతకు మించి చంద్రబాబు వద్ద వేరే ఆప్షన్ కూడా లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్, సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో ఎంతో కొంత బావుకోవచ్చన్న ఆలోచన తప్ప, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి, ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల్లోకి వెళ్ళలేని దయనీయ స్థితి చంద్రబాబుది.
బీజేపీ ఎన్ని చోట్ల పోటీ చేసినా, ఎన్ని సీట్లు దక్కించుకున్నా ఆ పార్టీకి ఎంతో కొంత లాభమే తప్ప నష్టముండదు. కానీ టీడీపీ పరిస్థితి అది కాదు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అంటూ స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఈసారి ఎన్నికల్లో ఏమన్నా డింకీ కొడితే.. ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. అప్పుడిక బీజేపీ వల్లనే ఓడిపోయాం అని చంద్రబాబు చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమీ వుండదు.
భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోడానికి ముందు చాలా గొంతెమ్మ కోర్కెలను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఏనాడూ భారతీయ జనతా పార్టీకి ‘ప్రధాన పార్టీ’ అన్న ముద్ర లేదు. తెలంగాణలో తప్ప, సీమాంధ్రలో ఆ పార్టీకి ప్రాభవం లేదు. సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ. అలాంటి బీజేపీ ఈసారి, డబుల్ డిజిట్ సాధించేస్తామన్న ధీమాతో వుంది. ఆ ధీమాతోనే, టీడీపీ ముందు గొంతెమ్మ కోర్కెలు వుంచింది. తెలంగాణ అంశం కారణంగా తెలంగాణలో తమకు కలిసి వస్తుందని భావించిన చంద్రబాబు, బీజేపీ గొంతెమ్మ కోర్కెలను తీర్చేందుకు ఒప్పుకోక తప్పలేదు. అయినప్పటికీ, సీమాంధ్రలో బీజేపీ కోరినన్ని సీట్లను చంద్రబాబు కేటాయించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఎన్ని చోట్ల పోటీ చేసినా, బీజేపీకి డబుల్ డిజిట్ వచ్చే అవకాశం లేదన్నది విశ్లేషకుల వాదన. అలాంటప్పుడు చంద్రబాబు, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు.? వారి కోరికలను ఎందుకు అంగీకరించినట్టు.?
సమాధానం సింపుల్. 2004, 2009లాగానే ఈసారి కూడా తేడా కొడితే నెపాన్ని తేలిగ్గా బీజేపీపైకి నెట్టేయొచ్చని చంద్రబాబు భావిస్తున్నారట. అంతకు మించి చంద్రబాబు వద్ద వేరే ఆప్షన్ కూడా లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్, సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో ఎంతో కొంత బావుకోవచ్చన్న ఆలోచన తప్ప, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి, ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల్లోకి వెళ్ళలేని దయనీయ స్థితి చంద్రబాబుది.
బీజేపీ ఎన్ని చోట్ల పోటీ చేసినా, ఎన్ని సీట్లు దక్కించుకున్నా ఆ పార్టీకి ఎంతో కొంత లాభమే తప్ప నష్టముండదు. కానీ టీడీపీ పరిస్థితి అది కాదు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అంటూ స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఈసారి ఎన్నికల్లో ఏమన్నా డింకీ కొడితే.. ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. అప్పుడిక బీజేపీ వల్లనే ఓడిపోయాం అని చంద్రబాబు చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమీ వుండదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి